24, సెప్టెంబర్ 2016, శనివారం

హాకీక్ స్టోన్స్ (Hakeek Stones)

హాకీక్ స్టోన్స్


             తంత్ర శాస్త్రంలో హాకీక్ స్టోన్స్ ప్రముఖ పాత్ర వహిస్తాయి. హాకీక్ స్టోన్స్ చాలా తక్కువ రకు లభ్యమవుతాయి. ఇవి కూడా రత్నాల మాదిరిగానే దొరుకుతాయి. ఆధ్యాత్మిక పర్వతాల నీడలో హాకీక్ పర్వతాలు ఉంటాయి. ఈ స్టోన్స్ టర్కీ, ఇరాన్ దేశాలలో అత్యధికంగా దొరుకుతాయి. ఇవి ముస్లింలు పవిత్రమైన రాయిగా పురాతన కాలం నుండి ధరిస్తున్నారు. హాకీక్ స్టోన్స్ పాలిష్ చేసినట్లుగా మెరుస్తూ ఉంటుంది. హాకీక్ స్టోన్స్ సూర్య కిరణాలను గ్రహించి పరావర్తనం ద్వారా కాంతి మన శరీరానికి ప్రసరింపజేస్తాయి. హాకీక్ స్టోన్స్ రెడ్, ఎల్లో, ఆరెంజ్, క్రీమ్, గ్రీన్, బ్లాగ్, గ్రే, వైట్ కలర్స్ లో లభ్యమవుతాయి.
          తాంత్రికంగా హాకీక్ స్టోన్స్ చేతికి, మెడకు ధరించిన లేదా దగ్గర ఉంచుకున్న చేతబడులు, నరదృష్టి ప్రభావాలు ఉండవు. ప్రమాదాల బారి నుండి, శత్రువుల బారి నుండి రక్షిస్తుందని తాంత్రిక పరంగా నమ్ముతారు. కొన్ని హాకీక్ స్టోన్స్ ని సూర్యరశ్మిలో కొంతసేపు ఉండనిచ్చిన తరువాత కొద్దిపాటి నీటిలో హాకీక్ స్టోన్స్ ఉంచి కొంతసేపటి తరువాత ఆ నీటిని త్రాగిన కంటిచూపు మెరుగుపడటంతో పాటు గుండెజబ్బులను, కోప స్వభావాలను తగ్గిస్తుంది. మానసిక రుగ్మతలను దూరం చేస్తుంది.
           కొన్ని తాంత్రిక గ్రంధాలలో వీటి యొక్క ఉపయోగాలు చాలా పేర్కొన్నారు. ఏదైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు 11 హాకీక్ స్టోన్స్ ని ఆలయంలో సమర్పించిన కార్య సఫలత కలుగుతుందనియు, లక్ష్మీదేవి స్వరూపంగా భావించే 27 హాకీక్ స్టోన్స్ ని లక్ష్మీదేవి విగ్రహం ముందు గాని, శ్రీ చక్రం ముందు గాని ఉంచి పూజ చేసుకొని బీరువాలో గానీ, లాకర్స్ లోగాని కొంత దనంతో పాటు ఉంచిన నిరుపేదలు సైతం ధనవంతులు కాగలరని, వ్యాపార స్ధాలంలో ఉంచిన వ్యాపారం దినదనాభి వృద్ధి చెందుతుంది అని పేర్కొనటం జరిగింది.

2 కామెంట్‌లు:

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...