25, సెప్టెంబర్ 2016, ఆదివారం

కూర్మ ప్రతిష్ట శ్రీయంత్రంకూర్మ ప్రతిష్ట శ్రీయంత్రం
         కూర్మ ప్రతిష్ట శ్రీయంత్రం అత్యంత శక్తి వంతమైన యంత్రాలలో ఒకటి. కూర్మ ప్రతిష్ట శ్రీయంత్రం పూజ చేసిన సామాన్యులను సైతం సౌభాగ్య వంతులను చేస్తుంది. ఈ భూమిని జలములలో మునిగి పోకుండా తన వీపుపై ధరించి, ఉద్దరించిన విష్ణుదేవుని అవతారమే కూర్మ స్వరూపము. దేవతలచేత అసురుల చేత అమృతానికై సాగరాన్ని చిలికిస్తూ వారందరి చేత కవ్వ రూపంలో ఉండే మందర పర్వతాన్ని ధరించడం కోసం తానే కూర్మ రూపాన్ని ధరించి తన పుష్టంపై ధరించాడు.
       కూర్మ పుష్టం పైన ఉన్న మందర పర్వతాన్ని అవిశ్రాంతంగా మదిస్తుంటే నాలుదిక్కుల వెలుగులను నింపుతూ పద్మంలో కూర్చొని, చేతిలో పద్మాన్ని ధరించి లక్ష్మీదేవి ఆవిర్బవించింది. ఈ లక్ష్మీ సంపదలన్నిటికి ప్రతీక. లక్ష్మీదేవి ఆవిర్భావం తరువాతనే దేవతలకు సకల ఐశ్వర్యాలు కలిగాయి. ఈ విధంగా కూర్మపుష్టం పైన ఆవిర్బవించిన లక్ష్మీదేవి ప్రతిరూపమైన కూర్మ ప్రతిష్ట శ్రీయంత్రాన్ని పూజించిన వారికి సకల ఐశ్వర్యాలు, భూసంపద, ధాన్య, వస్తు సంపద కలుగుతాయి.

           కూర్మప్రతిష్ట శ్రీయంత్రాన్ని ప్రతి శుక్రవారం రోజు విష్ణువుకు ఇష్టమైన పసుపురంగు వస్త్రం పైన బియ్యంగాని, పీఠంగాని ఏర్పాటు చేసుకొని అమ్మవారికి ఇష్టమైన పూలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, తామర విత్తనాలు, లక్ష్మీ గవ్వలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి లక్ష్మీ నారాయణుడిని మనసారా స్మరించుకుంటూ దేవతలు నివసించే శ్రీయంత్రాన్ని పూజించి పెరుగు, బెల్లం నైవేద్యంగా సమర్పించి ఓం ఐం క్లీమ్ సోహం ఓం శ్రీ మహాలక్ష్మీయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఆ తరువాత ఆ యంత్రాన్ని డబ్బు పెట్టే చోట ఉంచితే ఆర్ధిక పరిస్థితి వెంటనే మెరుగు పడుతుంది.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...