12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

ఏకాదశ శుక్రుడు దోష ఫల ప్రదుడు

ఏకాదశ శుక్రుడు దోష ఫల ప్రదుడు

సాథారణముగా ఏ గ్రహమైనా ఏకాదశ స్థానములో ఉంటే చాలా మంచిది.అని ఆ గ్రహ దశలలో మంచియోగం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర ప్రమాణిక గ్రంథములలో చెప్పబడుతుంది.కానీ శుక్రుడు మాత్రం ఏకాదశంలో యోగించడు.వేల జాతకాలు పరిశీలించి తెలుసుకున్న సత్యం.

శుక్రుడు లాభస్థానములో కంటే వ్యయస్థానములోఅంటే పన్నెండవ స్థానంలోనే ఎక్కువగా యోగి స్తాడు.లాభస్థానములో ఉండి శుక్రుడు ఉఛ్ఛస్థితిని పొందినప్పుడు మరింత ప్రతికూల ఫలితాలను ప్రసాదిస్తాడు.శుక్రుడు నీచలోనూ యోగకారకుడే.27వ డిగ్రీలోనూ,పరమ నీచలోనూ ఉన్నప్పుడు మాత్రం యోగకారకుడు కాదు.నీచ భంగమయినప్పుడు శుక్ర గ్రహం మంచియోగాన్ని ఇస్తుంది. ఏ కాదశంలో ఉన్న శుక్రుడు మారక యోగ లక్షణాలను కలిగి ఉంటాడు.


రావణబ్రహ్మ మహాతపస్వి.సర్వశాస్త్ర కోవిదుడు.మహా పండితుడు.నవగ్రహాలను శాసించిన ఘోర తపస్వి.నిత్యం శతకోటి లింగార్చన చేసిన మహా శివభక్తుడు.అఖండ జ్యోతిష్య వాస్తు శాస్త్ర వేత్త.లంకా నగర పట్టణాన్నితన వాస్తుశాస్త్ర ప్రావీణ్యంతో చక్కగా,గొప్పగా,సుందరంగా నిర్మించాడు. లంకా నగర వాస్తు వైభవాన్ని శ్రీఆంజనేయ స్వామివారు నాశనం చేసినట్లు మనకు సుందరకాండ లో వివరించబడినది.అంతటి గొప్ప పౌళస్త్యబ్రహ్మ తన కుమారుని జన్మలగ్న నిర్ణయ విషయంలోపొరబాటు పడ్డాడు. అన్ని గ్రహాలతో పాటు శుక్రుడిని కూడా ఏకాదశంలో ఉండమని ఆదేశించాడు. దానితో శుక్రాచార్యుల వారు ఏకాదశం బంథకస్థానము.

ఏకాదశంలో నేను యోగకారకుడిని కాను అని వివరించినప్పటికీ రావణబ్రహ్మ వినిపించుకోలేదు.మేఘనాథుని జన్మసమయములో ఏకాదశంలో ఉండవసినదేనని ఆదేశించాడు.ఏకాదశంలో శుక్రుడు ఉన్న కారణం చేతనే ఇంద్రజిత్తు అన బడే మేఘనాథుడు యుథ్థంలో మరణించాడు.

మిగిలిన యోగాల విషయం ఏవిథంగా ఉన్నా ఆయుర్భావ యోగాన్ని నిర్ణయించడంలో రావణ బ్రహ్మ పొరబడ్డాడు.కనుక ఏకాదశ స్థానములో శుక్రుడు ఉంటే వైవాహిక సంబంథమైనటువంటి ఇబ్బందులు,మర్మావయవములకు సంబంథించిన వ్యాథులు వచ్చే అవకాశం ఉంది.కనుక ఏకాదశ శుక్రునికి శాంతి చేయించడం అవసరం.

ఈ రకమైన శుక్రగ్రహ దోషాలు నశించడానికి జాతకంలో శుక్రుని స్థితిననుసరించి దోష పరిహారం కోసం భృగుపాశుపత హోమం,మహా పాశుపత హోమం పర్వత,అరణ్య,నదీ తీర ప్రాంత ములలో ఈ హోమం చేయాలి.శైవ క్రతువుల్లో అనుభవము ఉన్న పండితులను సంప్రదించండి.

భృగు షట్కదోషం,భృగాష్టమదోషం,షష్టాష్టక దోషం,శుక్రుని వ్యతిరేకఫలితముల నుండి రక్షణ పొందడానికి.శుక్రుడు కలిగించే దుర్యోగాల నివారణకు,శుక్ర మౌఢ్యమిలో జన్మించినవారు భృగు పాశుపత హోమం,మహా పాశుపత హోమం చేయించుకున్నట్లయితే అతి శీఘ్రముగా శుభ ఫలితాలను పొందగలరు.ఈ హోమము ద్వారా శుక్ర మహాదశ మరియు అంతర్దశలు నడుస్తున్నవారు కూడా సత్ఫలితాలు పొందవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...