18, ఫిబ్రవరి 2016, గురువారం

జాతకచక్రంలో సంతాన స్ఫుట నిర్ణయంజాతకచక్రంలో సంతాన స్ఫుట నిర్ణయం 


సంతాన కలుగక సమస్యలు అనుభవిస్తున్న దంపతుల జాతకాలను పరిశీలించి వారికి సంతానం సమస్యలు ఉన్నది లేనిది  సంతాన స్ఫుటం ద్వారా నిర్ణయించవచ్చును. దంపతుల జాతకచక్రములలోని గ్రహ స్ఫుటాలను వేరు వేరుగా తీసుకోవాలి. స్త్రీ జాతకచక్రం ఆధారంగా వేసే స్ఫుట నిర్ణయాన్ని క్షేత్రస్ఫుటం అంటారు. పురుష జాతకచక్రం ఆధారంగా వేసే స్ఫుట నిర్ణయాన్ని బీజస్ఫుటం అంటారు. స్ఫుటం 360° డిగ్రీల కంటే ఎక్కువ వస్తే వచ్చిన స్ఫుటం నుండి 360° తీసివేయాలి. క్షేత్రస్ఫుటం లో క్షేత్రం అనగా గర్భం నిలిచి ఉండే స్ధానం. బీజ స్ఫుటంలో బీజం అనగా వీర్యం అంటారు. బీజ, క్షేత్ర స్ఫుటములపైన, బీజ, క్షేత్ర స్ఫుట స్ధానముల నుండి పంచమ స్ధానం పైన పాపగ్రహాల, నపుంసక గ్రహాల దృష్టి ,యుతి లేక పోవటం మంచిది. బీజ, క్షేత్ర స్ఫుటములపైన గురుదృష్టి,,యుతి. ఉండటం మంచిది. గోచారంలో బీజ, క్షేత్ర స్ఫుటములపైన గురు సంచారం గాని, దృష్టి గాని ఉన్నప్పుడు సంతానం కలగటానికి మంచి సమయంగా గుర్తించాలి.


క్షేత్ర స్ఫుటం:-సంతానకారకుడు గురువు, రక్తమాంసాలకు కుజుడు, సంతానం కనటానికి కావలసిన బలమును చంద్రుడు సూచిస్తాడు. కుజుడు, చంద్రుడు సరి రాశిలో ఉన్న బలం కలిగి ఉంటాయి. స్త్రీ జాతకచక్రంలోని చంద్రగ్రహ, కుజగ్రహ, గురుగ్రహ స్ఫుటములను మేషరాశి నుండి రాశి-భాగ-లిప్తలతో సహా తీసుకొని మూడుగ్రహ స్ఫుటాలను కలుపగా వచ్చిన స్ఫుటం రాశిచక్రంలో సరి రాశిని, నవాంచక్రంలోను సరి రాశిని, అదే విధంగా సప్తమాంశ వర్గచక్రంలోను సరి రాశిని తెలియజేస్తే ఆ స్త్రీకి సంతానం కలుగుటలో బలం కలిగి ఉంటుంది. మూడు చక్రాలలోను వేరు వేరుగా సరి, బేసి, సరి వస్తే కొన్ని పరిహారాల ద్వారా సంతానం పొందవచ్చును. అలా కాక మూడు చక్రాలలోను బేసి రాశులను తెలియజేస్తే సంతాన అవకాశాలు తక్కువ.

బీజస్ఫుటం:- సంతాన కారకుడు గురువు, గర్భాధారణకు బలమును కలుగజేయు గ్రహం రవి, వీర్యమును సూచించు గ్రహం శుక్రుడు. రవి, శుక్రుడు బేసిరాశిలో ఉన్న బలం కలిగి ఉంటాయి. పురుష జాతకచక్రంలోని సూర్యగ్రహ, శుక్రగ్రహ, గురుగ్రహ స్ఫుటములను  మేషరాశి నుండి రాశి-భాగ-లిప్తలతో సహా తీసుకొని మూడుగ్రహ స్ఫుటాలను కలుపగా వచ్చిన స్ఫుటం రాశిచక్రంలో బేసి రాశిని, నవాంచక్రంలోను బేసి రాశిని, అదే విధంగా సప్తమాంశ వర్గచక్రంలోను బేసి రాశిని తెలియజేస్తే పురుషుడికి సంతానం కలుగుతుంది. మూడు చక్రాలలోను వేరు వేరుగా బేసి, సరి, బేసి వస్తే కొన్ని పరిహారాల ద్వారా సంతానం పొందవచ్చును. అలా కాక మూడు చక్రాలలోను సరి రాశులను తెలియజేస్తే సంతాన అవకాశాలు తక్కువ.

రాశి, నవాంశ, సప్తమాంశ చక్రాలలో వేరు వేరుగా వచ్చిన, స్త్రీకి మూడు చక్రాలలోను బేసి రాశులను, పురుషుడికి మూడు చక్రాలలోను సరి రాశులను తెలియజేసిన  లేదా బీజం (పురుషులలో) బలహీనంగా ఉండి క్షేత్రం (స్త్రీలలో) బలంగా ఉన్న ఆ గ్రహాలకు వర్తించు ఔషదాలు, దానాలు, జప, హోమ, పూజా అర్చనాదుల ద్వారా సంతానం పొందే అవకాశం ఉంది.

4 వ్యాఖ్యలు:

  1. అన్నగారు మీ పోస్ట్ లు చాలా బాగున్నాయి . .అలాగే సంతానము ఆలస్యము,మరియు సంతానము కాకపోవడానికి కారణములు ..వీటికి సంబంధించి తెలియచేయగలరని మనవి చేసుకుంటున్నాను. . .ఎందుకనగా ఈ విషయం అందరికి ఉపయోగ పడుతుంది కాబట్టి. . .

    ప్రత్యుత్తరంతొలగించు
  2. అన్నగారు మీ పోస్ట్ లు చాలా బాగున్నాయి . .అలాగే సంతానము ఆలస్యము,మరియు సంతానము కాకపోవడానికి కారణములు ..వీటికి సంబంధించి తెలియచేయగలరని మనవి చేసుకుంటున్నాను. . .ఎందుకనగా ఈ విషయం అందరికి ఉపయోగ పడుతుంది కాబట్టి. . .

    ప్రత్యుత్తరంతొలగించు

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...