30, నవంబర్ 2015, సోమవారం

ముత్యపు చిప్పలు



ముత్యపు చిప్పలు
  ముత్యపు చిప్పలను ఆల్చిప్పలు అంటారు.ఇవి మంచినీటిసరస్సులు,సెలయేళ్ళు,నదులలోను,సముద్రా లలోనుజీవిస్తుంటాయి.మంచినీటిసరస్సులలో నివసించే వాటిని మంచినీటి ఆల్చిప్పలనీ,సముద్రపు నీటిలో నివసించే వాటిని 'పెరల్‌ ఆయిస్టల్‌' అని అంటారు. మంచినీటి ఆల్చిప్పల శాస్త్రీయ నామం 'యూనియా'. అలాగే సముద్రపు ముత్యపు చిప్పల శాస్త్రీయ నామం 'పింక్టాడా వర్గారిస్‌'.ఇవి మొలస్కా వర్గానికి, పెలిసిపొడా విభాగానికి, పైజోడాంటా క్రమానికి చెందిన జీవులు. ఇవి నిశాచర జీవులు.అంటే రాత్రిపూట మాత్రమే తిరుగాడుతూ ఉంటాయి.

         ఆల్చిప్ప శరీరాన్ని కప్పుతూ రెండు వైపులా కర్పరాలు ఉంటాయి. అంటే రెండు కర్పరాల మధ్య ఆల్చిప్ప దేహ భాగాలన్నీ ఇమిడి ఉంటాయన్నమాట.కర్పరాలు మూసుకోవడానికి, తెరుచుకోవడానికి కర్పర కవాటాలు తోడ్పడతాయి. దీని చలనానికి గొడ్డలి ఆకారంలోనున్న పాదు సహాయపడుతుంది.కర్పరానికి కిందుగా దేహాన్ని ఆవరించి ప్రవారం అనే మందమైన పొరలు ఉంటాయి.ఇవి మూడు పొరలు ఉంటాయి. వెలుపలి పొరను 'పెరియాస్ట్రాకమ్‌' అంటారు.ఇది 'కాంకియో లిన్‌' అనే పదార్థంతో తయారవుతుంది.ఈ పొర ముదురు గోధుమ వర్ణంలో ఉంటుంది.మధ్యపొరను 'ప్రిస్‌మాటిక్‌ లేయర్‌' అంటారు.ఇది కాల్షియం కార్బోనేట్‌ స్ఫటికాలతో ఏర్పడి ఉంటుంది.లోపలి పొరను ముత్యపుపొర అంటారు.ఇదే ముత్యాన్ని తయారు చేసేది.దీనిలో కాల్షియం కార్బోనేట్‌ పల్చటి వరసలుగా ఉంటుంది.ఇది తెల్లగా ఉండి బహువర్ణ ప్రకాశ లక్షణాన్ని కలిగి ఉంటుంది.
         ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే ముత్యపు చిప్ప మొలుస్క్  అనే కీటకం నుంచి రూపొందు తాయి. ముత్యపుచిప్ప లోపలివైపున ఎలాంటి మెరుపుతో వుంటుందో, ముత్యము అలాంటి మెరుపుతోనే వుంటుంది. ముత్యపు చిప్పలలో  నీటిని ఉంచి ఆ నీటిని త్రాగిన చంద్రగ్రహ దోష నివారణ కలుగుతుంది.జాతకంలో చంద్రుడు అష్టమంలో ఉండటం వలన వచ్చే బాలారిష్టదోష ప్రభావాన్ని తొలగిస్తుంది.రాగి, ఇత్తడి,వెండి ప్లేట్ల కంటే  ముత్యపు చిప్పలపైన దేవతా విగ్రహాలను ఉంచి ఆ విగ్రహాలకు పూజ చేస్తే సత్వర ఫలితాలు వస్తాయి.ముత్యపు చిప్పల భస్మం స్వీకరించిన నత్తి,చెవుడు,పూనకం,ఫిట్స్ వంటి రోగాలు, మానసిక రోగాలు,చర్మరోగాలు సైతం నయం అవుతాయి.ఆల్చిప్పల్లో ఉండే ఐరన్, మరియు జింక్ మెదడును చురుగ్గా పని చేయడంలో సహకరిస్తుంది.తద్వారా ఏకాగ్రతపెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది. ముత్యపు చిప్పలను అక్షయ తృతీయ, దీపావళి,వంటి ప్రత్యేక రోజులలో గాని శుక్రవారం రోజు గాని ప్రత్యేకమైన పూజలు చేసి బీరువాలో ధనం ఉండే చోట గాని,క్యాష్ బాక్స్ నందు గాని ఉంచిన  ధనాభివృద్ధి, వ్యాపారా భివృద్ధి కలుగుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...