10, డిసెంబర్ 2015, గురువారం

గ్రామార్వణం



గ్రామార్వణం 

ఒక వ్వక్తి ఒక గ్రామం నుండి మరి యొక గ్రామానికి వలస వెళ్ళి ఆ గ్రామం తనకు నివాసయోగ్యమైనదా... కాదా అని విచారించి ఎన్నుకొనే విధానం గ్రామార్వణం అంటారు. మనం పుట్టిన ఊరు, మన తల్లిదండ్రుల దగ్గర పెరిగినప్పటి ఊరు విషయంలో గ్రామార్వణం చూడనవసరం లేదు. ఉద్యోగరీత్యా మార్పులు తీసుకునే ఊళ్ల విషయంగా గ్రామార్వణం చూడనవసరం లేదు. వ్యాపార విషయంగాను  మరియు రిటైర్మెంట్ లైఫ్ గడిపేందుకు వెళ్లే ఊరు విషయంలోను గ్రామార్వణం చూసుకోవడం శ్రేయస్కరం. ఎవరి మీద అయినా ఆధారపడి జీవనం చేయువారికి గ్రామార్వణం అవసరం లేదు.అర్వణము అంటే అచ్చి రావటం. గ్రామాలు, నగరాలు, స్థలాలు, క్షేత్రాలు కొన్ని కొందరికి అచ్చి వస్తాయి. కొందరికి అచ్చిరావు. ఒకరికి పని చేసిన మందు మరొకరికి పని చేయకపోవచ్చు. ఒక్కొక్కప్పుడు హాని కూడా చేయవచ్చు.


ఈ అర్వణం చూసే విధానం కాలామృతంజ్యోతిర్నిబంధం, వాస్తు ప్రదీపం, జ్యోతిర్విధాభరణం, ముహూర్త రత్నాకరం వంటి గ్రంథాలలో ఒక్కొక్క విధానం చెప్పబడింది.

వాస్తు శాస్తర్రీత్యా అర్వణం చూసేటప్పుడు, జన్మనక్షత్రం కాకుండా నామ నక్షత్రమే చూడాలని శాస్త్రంలో నిర్దేశించారు.

శ్లో.దేశే గ్రామే, గృహే,
యుద్ధే, సేవాయాం
వ్యావహారికే
నామరాశేః ప్రధానత్వం
జన్మరాశిఃన చింతయేల్ -అని శాస్త్ర ప్రమాణము.

దేశం గురించి,అనారోగ్య సమయాలలో,గ్రామం గురించి,గృహ ప్రవేశ విషయాలలో,సేవకుని స్వీకరించే విషయాలలో,దానం చేసేటప్పుడు నామరాశికి ప్రాదాన్యం ఇవ్వాలి.యాత్రలకు,వివాహ విషయాలలో జన్మ రాశి ప్రాదాన్యం పొందుతుంది.కనుక నామరాశినే ప్రధానంగా భావించాలి. ఇంకా ఉత్తమమైనది ఇంటి పేరున అర్వణం చూసుకోవటం మరీ మంచిది. దానివలన వారసులందరికీ అది లాభించి, యోగించే అవకాశం ఉంటుంది. 

అకారాది వర్గ సిద్ధాంతంగా, ధన, రుణ, సంఖ్యలనే సిద్ధాంతంగా కాకిణుల సిద్ధాంతపరంగా ఎన్నేన్నో అర్వణం చూసే విధానాలున్నాయి. పండితులు వారివారి అనుభవాలను బట్టి అనుసరిస్తూ ఉంటారు.గ్రామార్వాణానికి సులభమైన మార్గం ద్వారా తెలుసుకుందాం.
 
నామ నక్షత్ర రాశికి రెండు, ఐదు, తొమ్మిది, పది, పదకొండు రాశులైన గ్రామ నక్షత్ర రాశులు చక్కగా అర్వణవౌతాయి.

గ్రామార్వాణం కట్టే మొదటి పద్దతి

రాజశేఖర్ అనే వ్యక్తికి హైదరాబాదు అర్వణం అవుతుందా?

రాజశేఖర్ పేరులోని మొదటి అక్షరం “రా” తులారాశిలోకి వస్తుంది.గ్రామం హైదారాబాద్ లోని మొదటి అక్షరం “హై” మిధున రాశిలోకి వస్తుంది.పై పట్టికలో చూపిన విధంగా తులారాశి నామరాశికి గ్రామ రాశి మిధున రాశికి సుఖాన్ని కలిగిస్తుంది.తులారాశికి  మిధునరాశి తొమ్మిదవ రాశి అవుతుంది కాబట్టి రాజశేఖర్ అనే వ్యక్తికి హైదరాబాద్ అర్వణమవుతుంది. అధికస్య అధికం ఫలంఅన్నట్టుగా నక్షత్ర రీత్యా కూడా అర్వణమైతే ఇంకా బాగుంటుందని సంపత్ , క్షే, సాధన, మిత్ర, పరమ మైత్ర తారలయితే ఇంకా బావుంటుందని చెప్పే పండితులూ ఉన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...