18, నవంబర్ 2015, బుధవారం

చతుర్దాంశ వర్గ చక్రం



చతుర్దాంశ వర్గ చక్రం

        రాశిలో నాలుగో భాగానికి చతుర్ధాంశ అంటారు.ఒకొక్క భాగం 7° 30 నిమిషాల ప్రమాణం ఉంటుంది.మొత్తం 12 రాశులకు 48 చతుర్ధాంశలు ఉంటాయి. చతుర్దాంశ వర్గ చక్రం ద్వారా వాహన యోగం,వాహన ప్రమాదాలు, గృహ యోగం, గృహ సౌఖ్యం,సుఖ సౌఖ్యాలు,అదృష్టాలు,బాధ్యతలు,విద్య,ధన కనక వస్తు వాహనాల గురించి, భూమి, ఆస్తి పాస్తులు కలిగి ఉండటం,కుటుంబ సౌఖ్యత,జ్ఞానాభివృద్ధి,స్ధాన చలనం ,బందువులు,విదేశీ ప్రయాణాలు,విదేశాలలో నివశించటం, కూతురు పెళ్ళి,ఇల్లరికం అల్లుడు  మొదలగు వాటి గురించి తెలుసుకోవచ్చును. జాతకచక్రంలో ఉన్న యోగాలు చతుర్ధాంశ చక్రంలో లగ్నానికి మంచి స్ధానంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ యోగా ఫలితాన్ని పొందవచ్చును. 
 
రాశి చక్రంలో గ్రహాలు గాని లగ్నం గాని 0°-00 నిమిషాల నుండి 7°30 నిమిషాల  మద్యలో ఉన్నప్పుడు చతుర్దాంశ వర్గ చక్రం నందు అదే రాశిలో గ్రహం ఉంచాలి.
 
రాశి చక్రంలో గ్రహాలు గాని లగ్నం గాని 7°-30 నిమిషాల నుండి 15°00 నిమిషాల  మద్యలో ఉన్నప్పుడు చతుర్దాంశ వర్గ చక్రం నందు చతుర్ధంలో గ్రహం ఉంచాలి.
 
రాశి చక్రంలో గ్రహాలు గాని లగ్నం గాని 15°-00 నిమిషాల నుండి 22°30 నిమిషాల  మద్యలో ఉన్నప్పుడు చతుర్దాంశ వర్గ చక్రం నందు సప్తమంలో గ్రహం ఉంచాలి.
 
రాశి చక్రంలో గ్రహాలు గాని లగ్నం గాని 22°-30 నిమిషాల నుండి 30°00 నిమిషాల  మద్యలో ఉన్నప్పుడు చతుర్దాంశ వర్గ చక్రం నందు దశమంలో గ్రహం ఉంచాలి.
 
మొదటి చతుర్ధాంశకు బ్రహ్మదేవుడి కుమారుడైన “సనకా”ఆదిపత్యం వహిస్తాడు.మొదటి చతుర్ధాంశలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు ప్రేమస్వభావం కలిగి ఉంటారు.గౌరవ సత్కారాలు లభిస్తాయి.మంచి గుర్తింపు లబిస్తుంది. 
 
రెండవ చతుర్ధాంశకు బ్రహ్మదేవుడి కుమారుడైన “సనంద”ఆదిపత్యం వహిస్తాడు.రెండవ చతుర్ధాంశలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు ఎప్పుడు సంతోషమగాను,ఆనందం గాను ఉంటారు.నవ్వుతూ మాట్లాడతారు.కోప స్వభావాలు ఉండవు.
 
మూడవ చతుర్ధాంశకు బ్రహ్మదేవుడి కుమారుడైన “సనత్కుమార” ఆదిపత్యం వహిస్తాడు.మూడవ చతుర్ధాంశలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు ప్రతి విషయంలోనూ కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు.కుజుడు మూడవ చతుర్ధాంశలో ఉంటే కుజ దోష ప్రభావం తక్కువగా ఉంటుంది.
 
నాల్గవ చతుర్ధాంశకు బ్రహ్మదేవుడి కుమారుడైన “సనాతన”ఆదిపత్యం వహిస్తాడు.నాల్గవ చతుర్ధాంశలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు సంతోషాన్ని ,నిరంతర మార్పులను తెలియజేస్తుంది.
 
రాశి చక్రంలో  లగ్నాదిపతి,చతుర్ధాదిపతి చతుర్ధాంశ వర్గ చక్రంలో ఎక్కడ ఉన్నారో పరిశీలించాలి.చతుర్ధాంశ లగ్నానికి 6,8,12 లో ఉన్న ఆయా గ్రహాల యొక్క ఫలితాన్ని పూర్తిగా పొందలేరు.
 
రాశిచక్రంలో గజకేసరి యోగం గాని,ఇతర పంచమహా పురుష యోగం గాని ఉన్న పంచమహాపురుష మోగ గ్రహాలు గజకేసరి యోగా గ్రహాలైన చంద్రుడు,గురువు చతుర్ధాంశ వర్గ చక్రంలో లగ్నానికి 6,812 లో ఉన్న,శత్రు క్షేత్రంలో ఉన్న యోగా ఫలితాన్ని పొందలేరు.
 
చతుర్ధంలో కుజ,శని,రాహు,కేతువులు రాశి చక్రంలో చతుర్ధంలో ఉండి చతుర్ధాంశ వర్గ చక్రంలో చతుర్ధంలో  ఉంటే విదేశాలలో జీవిస్తారు.చతుర్ధాదిపతి వ్యయంలో ఉన్న,వ్యయాదిపతి సప్తమంలో ఉన్న,నవమంలో చతుర్దాదిపతి, వ్యయాదిపతి,నవమాదిపతి ఉన్న విదేశాలలో జీవనం కొనసాగిస్తారు. చతుర్దాదిపతి నవమంలోఉన్న విదేశాలలో విద్యను అభ్యసిస్తారు. 
 
రాశిచక్రంలో చతుర్దాదిపతి,కుజ శుక్రులు చతుర్ధాంశలో 6,8,12 లో ఉన్న,శత్రుక్షేత్రంలో ఉన్న,తరచుగా వాహన ప్రమాదాలు జరుగుతాయి.స్దిరాస్తులకు సంబందించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...