27, జులై 2015, సోమవారం

వక్క గణపతి


కేతుగ్రహ దోష నివారణకు వక్క గణపతి

కేతువు జాతకంలో బలీహనంగా ఉన్నట్లయి తే... మానసిక బలహీనతలు, అతిభక్తి, జీవి తంపై విరక్తి, ఏకాంతంగా ఉండాలనే కోరిక, లేనివి ఉన్నట్టు ఊహించుకోవడం, తనలో తా నే మాట్లాడుకోవడం, తనను తాను చాలా గొ ప్పవాడిగా లేదా దేవుడు, దేవతగా ఊహించు కోవడం, దేన్ని చూసినా భయపడడం, ఉద్యో గం, భార్యాపిల్లలను వదిలివేసి దేశసంచారం చేయడం, పిచ్చివానిలా ప్రవర్తించడం, విచిత్ర వేషధారణ, సంతానం కలుగకపోవడం, గర్భం వచ్చి పోవడం, చిన్న పిల్లలకు తీవ్ర అనారో గ్యం, చదువులో ఆటంకాలు,అంటువ్యాధులు, వైద్యులు కూడా గుర్తిం చలేని రోగాలు కేతుగ్రహ దోషం వల్ల కలుగు ను.

కేతువు ద్వాదశ భావంలో ఉంటే బాలారిష్ట దోషం.పంచమంలో ఉంటే సంతాన సమస్యలు,చతుర్దంలో బలహీనంగా ఉంటే విద్యా సమస్యలు,ఇలా కేతుగ్రహ సమస్యలు ఉన్నవారు వక్క గణపతిని పూజిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చును.



వక్క(సుపారి)గణపతి ని కేతుగ్రహ దోషాలు ఉన్నవారు పూజిస్తే మంచిది.వక్క(సుపారి)గణపతి ని  పూజించడం వలన కార్యాలు సఫలీకృతం కావడమే కాకుండా, గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పబడుతోంది.

విద్య .. ఉద్యోగం .. వివాహం .. వ్యాపారం .. ఇలా దేనిలో అనుకున్న ఫలితాలను పొందాలన్నా అందుకు అడ్డుపడుతోన్న ఆటంకాలు తొలగిపోవాలి. అలాంటి ఆటంకాలు తొలగించే దైవంగా వినాయకుడు కనిపిస్తుంటాడు. అందుకే ప్రతిఒక్కరూ అత్యంత భక్తిశ్రద్ధలతో  వక్క(సుపారి)గణపతి ని పూజిస్తూ వుంటారు.

కాలసర్ప దోషం సాదారణ మానవులపై ప్రభావం చూపించదు.కాలసర్ప దోషం ప్రపంచాన్ని ,దేశాన్ని,రాష్ట్రాన్ని,సంస్ధని,అదికారం చలాయించే వారికి కాలసర్పదోష ప్రభావం ఉంటుంది.వారు పరిపాలించేచోట సరియైన సమయంలో వర్షాలు పడక పంటలు సరిగా పండక ,ఆర్దికవ్యవస్ధ దెబ్బతిని,కోట్లాటలు,అనారోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతారు.

పరిపాలాద్యక్షుకుడికి,పాలనా వ్యవస్ధపై కాలసర్పదోష ప్రభావ కనపడుతుంది.పాలకులు సరియైన నిర్ణయాలు తీసుకోలేరు.

అయితే కాలసర్పదోషం ఉన్నవ్యక్తులకు,రాహు,కేతు దశలు నడుస్తున్న వ్యక్తులకు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తాడు.కొన్ని రెమిడీస్ చేసుకుంటె రాహు,కేతు చాయగ్రహాలభాదలనుండి విముక్తి లభిస్తుంది.

జాతక చక్రంలో వున్న గ్రహాలలో రాహుకేతువుల గురించి చరిత్ర పరిశీలిస్తే.. క్షీరసాగర మధన సమయంలో అమృతం తాగబోయిన రాహువు అనే రాక్షసుని శ్రీహరి తన యొక్క సుదర్శనంతో చీల్చివేయడంతో మొండెం క్రింద భాగం, మొండెం పై భాగం రాహు కేతువులు అయిరి.

కాలసర్పదోషం అంటే రాహు కేతువుల మధ్యలో మిగిలిన రవి చంద్ర కుజ గురు శుక్ర శని గ్రహాలు ఒకపక్కన వుండి మరొక పక్కన అసలు గ్రహాలు లేకుండా ఉండడం. సరే బాగా జ్యోతిశ్శాస్త్రం రీసెర్చ్ చేసేవారు వారి అనుభవాలతో చెప్పే అంశాలు ఏమిటి అంటే రాహుకేతువుల మధ్య మాలికా యోగం (సప్తగ్రహ) అనగా వరుస ఏడు రాశులలో ఏర్పడితే అది ప్రమాదకరం అని రాహు కేతువులకు ఈ మాలికా యోగం వలన ప్రత్యక్ష సంబంధం కలగడం వంటివి ఏర్పడుతాయి. కావున ఇబ్బందికరం అని చెబుతారు.

మిగిలిన విషయాలలో కేవలం కాలసర్పదోషం వలన జీవితం పాడయిపోతుంది. అభివృద్ధి వుండదు అనే భావన వాదన శాస్త్ర దూరమైన విషయమే. మిగిలిన గ్రహాలు వాటి స్థితి బాగుండకపోతే వచ్చే ఫలితాలు బాగుంటే వచ్చే ఫలితాలు గూర్చి పరిశీలింపక కేవలం కాలసర్ప దోషం వలన జాతకం పాడయిపోతున్నది అని చెప్పే సిద్ధాంతులు నేటి సమాజంలో ఎక్కువ వున్నారు.

రాహు కేతువుల మధ్య మిగిలిన ఏడు గ్రహాలు చేరడం వలన వచ్చిన దోషం కావున శాంతి కోసం తొమ్మిది గ్రహాలకు జపం దానం హోమం తర్పణం చేయుట వైదిక ప్రక్రియ. తద్వారా దోష శాంతి చేకూరుతుంది. ఇది వైదీక విజ్ఞానం వున్న బ్రాహ్మణులు, నవగ్రహ మంటపం వున్న ప్రతి దేవాలయంలోనూ చేయించుకోవచ్చు. అలాగ కాకపోతే ఎవరి ఊరిలో వారు కాలసర్ప దోష శాంతి చేసుకోవచ్చు.



వక్క గణపతి:-200.00
పై  వక్క గణపతి కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో  వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.



Bank Details:-State Bank Of Hyderabad ;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC Code:-SBHY0021056.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...