1, ఫిబ్రవరి 2015, ఆదివారం

పునుగు (Punugu)

పునుగు

అత్యంత అరుదుగా లభించే సుగంద ద్రవ్యాలకు కారకుడు శుక్రగ్రహం. పునుగు,జవ్వాది,కస్తూరి, గోరోచనం మొదలగు సుగందద్రవ్యాలు శుక్రగ్రహ కారకత్వాన్ని తెలియజేస్తాయి.జాతకంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు పునుగు పిల్లి తైలంతో అభిషేకం చేస్తే శుక్రగ్రహ దోష నివారణ జరుగుతుంది.

పునుగు పిల్లి మర్మాంగాల ద్వార వెలువడే స్రవమే పునుగు. తిరుపతి వెంకన్నకు ప్రతి శుక్రవారం అభిషేకం తరువాత కాస్తంత పునుగు తైలాన్ని విగ్రహానికి పులుముతారు.

"అత్తారు పన్నీరు పునుగు జవాదీ తోడ ముడుపు తెస్తున్నారు మేలుకో" అంటాడు అన్నమాచార్య.



పదకవితా పితామహుడు అన్నమయ్య , తరిగొండ వెంగమాంబ తిరుమలేశునిపై వేలు , వందల సంకీర్తనలు రచించి స్వామివారి అనుగ్రహం పొందగలిగారు. అయితే ఏ కళలూ తెలియని నోరులేని మూగజీవి పునుగుపిల్లి ఏ అదృష్టం చేసుకుందో... ఎన్ని జన్మల పూజా ఫలమో తెలియదు కాని ఈ అరుదైన జీవికి మరొకరికి సాధ్యంకాని అరుదైన సేవాభాగ్యం కలిగింది.

ఏడుకొండల స్వామి మూలవిగ్రహానికి ఈ పునుగుపిల్లి శరీరం నుంచి స్రవించే ద్రవాన్ని పూస్తేనే శుక్రవారపు అభిషేకం పూర్తవుతుంది. స్వామివారి విగ్రహం శతాబ్దాలుగా నల్లగా నిగనిగలాడుతుండడానికి , ఏమాత్రం చెక్కుచెదరకుండా ఉండడానికి ఈ పునుగు తైలమే ప్రధాన కారణమని అర్చకుల నమ్మకం. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ పునుగుపిల్లి అత్యంత అరుదైనది.

పునుగు పిల్లి తైలం తీసే విధానంలో ప్రత్యేకత ఉంది. ఇనుప జల్లెడలోని గదిలో పిల్లిని ఉంచుతారు. ఇనుప జల్లెడ గది పైభాగంలో రంధ్రం ఏర్పాటు చేస్తారు. రంధ్రం ద్వారా చందనపు కర్రను గదిలోకి నిలబెడతారు. రెండు సంవత్సరాల వయస్సు అనంతరం ప్రతి పది రోజులకు ఒకసారి హావభావాలను ప్రదర్శిస్తూ చందనపు కర్రకు చర్మాన్ని పిల్లి రుద్దుతుంది. ఆ సమయంలో చర్మంద్వారా వెలువడే పదార్థమే పునుగుతైలం. తైలాన్ని సుగంధ పరిమళాలతో చూర్ణం చేసి మూలవర్లుకు అభిషేకం చేస్తారు. ఇలా చేయడంద్వారా శ్రీవారు శాంతపడుతారని అర్చకులు చెబుతున్నారు.


 పునుగు :-40.00
  పై పునుగు
కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో  వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.

Bank Details:-State Bank Of Hyderabad ;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC Code:-SBHY0021056.
  

1 కామెంట్‌:

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...