1, ఫిబ్రవరి 2015, ఆదివారం

పాదరస బాణ లింగం (Parad Banalingam)

పాదరస బాణ లింగం

ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి వుంటుంది. అటువంటి శివలింగాలలో పాదరస బాణ లింగం కూడా ఎంతో ముఖ్యమైంది. శివలింగాలలోనే ఈ పాదరస బాణ లింగం ఎంతో శక్తివంతమైంది.

కార్తీకమాసం శివుడికి ఇష్టమైన నెల. ఆ నెలరోజులూ పాదరస బాణ లింగాన్ని పూజించినట్లయితే ఎంతో పుణ్యం సుఖసంతోషాలను, సర్వ సంపదలను సొంతం చేసుకోవచ్చు.పాదరస బాణ లింగం దర్శనం వల్ల కోట్లాది శివలింగాలను దర్శించిన ఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. పాలు, పచ్చ కర్పూరం, కస్తూరి, కుంకుమ పువ్వులతో ప్రతిరోజు పాదరస బాణ లింగానికి పూజలు జరుపుతారు.



ప్రాచీనకాలంలో ఈ పాదరసంతో తయారుచేయబడిన విగ్రహాలను గృహాల్లో నిర్మించుకుని ఎంతో ఆధ్మాత్మికంగా పూజించుకునేవారు. శివలింగం, లక్ష్మీ, గణేశ, దుర్గ మొదలైన దేవతా మూర్తుల రూపంలో పాదరస విగ్రహాలను ఇంట్లో పెట్టుకుని పూజిస్తే.. మంచి సమృద్ధితోపాటు సుఖశాంతులతో కూడిన జీవితాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే నాలుగు పురుషార్థాలు కూడా సిద్ధిస్తాయి. మానవ జీవితంలో భౌతికంగా వున్న లోట్లను తీరుస్తూ, ఆధ్మాత్మికంగా అతనిలో ఉన్నతిని పెంపొందించడంలో ఎంతో సహాయపడుతుంది. మొత్తానికి పాదరసం పూర్నత్వానికి ప్రతీకగా పేర్కొనవచ్చు.

కేవలం ఆధ్మాత్మికంగానే కాదు... ఆయుర్వేదంలో కూడా దీని ప్రాముఖ్యత గురించి విశ్లేషించబడింది. ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం మర్థనానికి దీనిని ఉపయోగిస్తారు. భస్మం రూపంలో మానవునికి ప్రాణదాయకమైన ఎన్నో రసాలుగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా.. తంత్రశాస్త్రంలో కూడా పాదరస మహిమల గురించి వర్ణించబడివున్నాయి. ముఖ్యంగా పాదరస బాణ లింగాన్ని నిత్యం పూజిస్తే.. అన్నిరకాల దోషాలను సంపూర్ణంగా తొలగించవచ్చని మన హిందూ శాస్త్రాలు తెలుపుతున్నాయి.

జ్యోతిష్యం ప్రకారం పాదరసం బుధగ్రహనికి తగినదంటున్నారు. బుధగ్రహాధిపత్యంలో జన్మించిన జాతకులు పాదరస లింగాలను, విగ్రహాలను పూజించడం ద్వారా ఉపాధి అవకాశాలు, విదేశీయానం, ఆర్థికాభివృద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.పాదరస శివలింగాన్ని శాస్త్రయుక్తంగా, మంత్రాలతో, విధి విధినాలతో పూజిస్తే.. గృహాల్లో వున్న కష్టాలన్నీ తొలగిపోయి.. ఎటువంటి లోటు లేకుండా అన్ని కోర్కెలను ఆ పరమేశ్వరుడు తీరుస్తాడని ప్రాచీనకాలం నుంచి పురోహితులు, జ్యోతిష్య నిపుణులు, పండితులు విశ్వసిస్తూ వస్తున్నారు.


 పాదరస బాణ లింగం:-800.00

  పై  పాదరస బాణ లింగం  కావలసినవారు మా బ్యాంక్ ఎక్కౌంట్ నందు నగదు జమచేసినచో  వస్తువులు కొరియర్ ద్వారా పంపగలము.కొరియర్ చార్జీ అదనంగా 50=00 జమ చేయవలెను.

Bank Details:-State Bank Of Hyderabad ;Name:-N.Raja Sekhar ;A/c No:-52207626721,Place :-Hyderabad,IFSC Code:-SBHY0021056.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...