5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

లక్ష్మీ నరసింహాస్వామి సాలగ్రామం(Lakshmi Narasimha Swamy Salagramam)

లక్ష్మీ నరసింహాస్వామి సాలగ్రామం

సాలగ్రామాలు పగిలి నప్పటికీ, పెచ్చు పూడినప్పటికీ కూడా పూజార్హత కలిగి ఉంటాయి.

సాలగ్రామాన్ని భక్తిశ్రద్ధలతో, పరిపూర్ణ విశ్వాసంతో, శాస్త్ర ప్రకారం అభిషేకిస్తే, కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యఫలానికి సమానమవుతుంది. మరియు కోటి గోవులను దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు. సాలగ్రామ పూజచే, శివకేశవులని పూజించిన ఫలితం కలుగుతుంది.

సాలగ్రామ మును అభిషేకించిన జలాలను ప్రోక్షించుకొనిన యెడల, పవిత్ర గంగానదీ స్నానమాచరించిన యెడల సర్వ తీర్థాలలో స్నానమాచరించిన పుణ్యఫలం కలిగి, సర్వదేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుంది.సాలగ్రామాన్ని అర్చించు టకు మంత్రాదులు తెలియకున్నప్పటికీ, శక్తిననుసరించి పూర్తి భక్తివిశ్వాసాలతో పూజిస్తే, కొన్ని ఫలితాలైనా కలు గుతాయి. సాలగ్రామ శిల యందు ఉంచిన అన్ని పదార్థములు పవిత్రములవుతాయి. ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు కొందరు వాటిని పూర్తిగా నీళ్ళల్లో మునిగేలా ఉంచుతారు. దానిని జలవాసం అంటారు. ఏదైనా ఆలయంలో దానిని ఉంచవచ్చును.

సర్వవిధాలైన కష్టాల నుండి రక్షించేది, సర్వ పుణ్యణఫలాలను ఇచ్చేది, సర్వదేవతా పూజాఫలితాలను ఇచ్చేది, సర్వశ్రేయస్కరమైనది, సర్వో త్కృష్టమైనది, సర్వాంతర్యామి యొక్క ప్రతీక అయిన ‘సాలగ్రామాన్ని’ పూజించుకునే భాగ్యం ఈ కలియుగం లో మానవులమైన మనకు కలగటం, నిజంగా అపూర్వ మైన అదృష్టం. అటువంటి అవకాశాన్ని వినియోగించు కుని, జీవితాన్ని ధన్యం ఒనర్చుకుని, శాశ్వతానందాన్ని పొంది ముక్తిని పొందటం భక్తిపరుడైన మానవునికి ముఖ్యకర్తవ్యం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అవకాశం దొరికితే, ఆ పుణ్యఫలాన్ని దక్కించుకు నేందుకు ప్రయత్నించాలి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...