9, సెప్టెంబర్ 2014, మంగళవారం

స్పటిక శ్రీయంత్రం(Crystal Sri Yantram)

స్పటిక శ్రీయంత్రం

"స్పటిక శ్రీయంత్రం" అన్ని యంత్రాల్లోకి అత్యంత శక్తి వంతమైన శ్రీ యంత్రం తనని పూజించిన వారిని ఓ రక్షా కవచంలా కాపాడుతూ వుంటుంది. దీని మహిమలను గురించి ఎన్నో ధర్మశాస్త్ర గ్రంధాలు ప్రస్తావించడం జరిగింది.
 ఈ 'శ్రీ'యంత్రాన్ని ఇంట్లో స్థాపన చేయడం వలన ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి ...

6, సెప్టెంబర్ 2014, శనివారం

గౌరీశంకర్ రుధ్రాక్ష(Gauri Shankar Rudraksha)

గౌరీశంకర్ రుధ్రాక్ష

గౌరీశంకర్ రుధ్రాక్షను మొదటిసారిగా ధరించేటప్పుడు శివాలయంలో అభిషేకించటం చాలా మంచిది. “ఓం గౌరీశంకరాయనమః” “ ఓం నమశ్శివాయ”అనే మంత్రాన్ని జపిస్తూ రుధ్రాక్ష ధారణ చెయ్యాలి.  

రెండు గింజలు కలిసి ఉన్న రుద్రాక్షలనే ‘గౌరీశంకర్’ రుద్రాక్షలుగా వ్యవహరిస్తారు.రెండు రుధ్రాక్షలలో ఒకటి పార్వతి, రెండవది పరమేశ్వర స్వరూపంగా కొలుస్తారు. బార్యభర్తల అన్యోన్నతకి ,వైవాహిక జీవితంలో కలిగే ఇబ్బందులకు  “గౌరీశంకర్ రుధ్రాక్ష”ని తప్పనిసరిగా ధరించవలెను.

5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్

స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్....

సిరిసంపదల దేవత లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోడానికి స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ దోహదపడుతుంది. ధనాదాయ మార్గాలను పెంచుకునేందుకు స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ ను ప్రతిష్టించుకుంటారు.

స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ ప్రత్యేకత ఏమిటంటే, అందులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. లక్ష్మీదేవి మాత్రమే కాదు, స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ లో సకల దేవతలూ నివసిస్తారు.మామూలుగా స్ఫటికాన్ని మహాశివునికి ప్రతిరూపంగా భావిస్తారు. ఇక స్ఫటిక శ్రీయంత్రం పిరమిడ్ లో మహాశివుని శక్తి అమితంగా ఉంటుంది.

లక్ష్మీ నరసింహాస్వామి సాలగ్రామం(Lakshmi Narasimha Swamy Salagramam)

లక్ష్మీ నరసింహాస్వామి సాలగ్రామం

సాలగ్రామాలు పగిలి నప్పటికీ, పెచ్చు పూడినప్పటికీ కూడా పూజార్హత కలిగి ఉంటాయి.

సాలగ్రామాన్ని భక్తిశ్రద్ధలతో, పరిపూర్ణ విశ్వాసంతో, శాస్త్ర ప్రకారం అభిషేకిస్తే, కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యఫలానికి సమానమవుతుంది. మరియు కోటి గోవులను దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు. సాలగ్రామ పూజచే, శివకేశవులని పూజించిన ఫలితం కలుగుతుంది.

సాలగ్రామ మును అభిషేకించిన జలాలను ప్రోక్షించుకొనిన యెడల, పవిత్ర గంగానదీ స్నానమాచరించిన యెడల సర్వ తీర్థాలలో స్నానమాచరించిన పుణ్యఫలం కలిగి, సర్వదేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుంది.

2, సెప్టెంబర్ 2014, మంగళవారం

కుజదోష నివారణకు “విఘ్నహస్త ప్రవాళ గణపతి”

కుజదోష నివారణకు “విఘ్నహస్త ప్రవాళ గణపతి”

సంస్కృతంలో ప్రవాళం అంటే పగడం.పగడపు గణపతిని కుజదోషం ఉన్నవారు పూజించిన కొంతవరకు కుజదోష ప్రభావాన్ని తట్టుకునే శక్తి వస్తుంది.పగడపు గణపతిని రింగులో కుడిచేతి చూపుడు వేలుకి ధరించవచ్చును.
ప్రవాళ గణపతిని మొదటిసారిగా మంగళవారం రోజు పసుపు నీళ్ళతో శుద్దిచేసి గణపతి లేదా సుబ్రమణ్య లేదా మంగళ యంత్రం మీద గాని ప్రతిష్ఠించి “విఘ్నహర్త ప్రవాళ గణపతి ప్రీత్యర్ధం”అంటూ ఆచమనీయం,అభిషేకం,శుద్దోదక స్నానం తదితర పూజ చేస్తే కుజ దోష నివారణ జరుగుతుంది. 

ఓం గం గణపతయే సర్వ విఘ్నహరాయ సర్వాయ
సర్వ గురవే లండోదరాయ హ్రీం గం నమః

అనే మంత్రాన్ని జపించి ప్రవాళ గణపతికి ఉద్వాసన పలికి నిత్యం పూజమందిరంలో స్ధాపించుకొని పూజ చేసుకోవచ్చును.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...