21, జులై 2018, శనివారం

శనిగ్రహ దోష నివారణకు "సప్తముఖి రుద్రాక్ష"

శనిగ్రహ దోష నివారణకు "సప్తముఖి రుద్రాక్ష"

జాతకచక్రంలో శనిగ్రహ దోష నివారణకు సప్తముఖి రుద్రాక్షను ధరించాలి. శరీరంలో తీసుకున్న పదార్ధం గాని, వాయువు గాని బయటకు పంపే విసర్జక వ్యవస్ధకు అధిపతి శని. ఇది పనిచేయకపోతే అన్నింటా బద్ధకమే అంతా అనారోగ్యమే. మలబద్దకానికి శని కారకుడు. అందుకే ఉదయాన్నే వాకింగ్ గాని, మేడిటేషన్ గాని చెయ్యాలి. మలబద్దక నివారణకు సప్తముఖి రుద్రాక్షను రాత్రి కాపర్ గ్లాస్ లో ఉంచి ఉదయాన్నే ఆ నీటిని త్రాగవలెను.


దీర్ఘకాలంగా వేదించే వ్యాధులకు కారకుడు శని. చాలా వ్యాధులకు ఏదో రూపంలో శని సంబంధం కలగడం కనిపిస్తుంది. పక్షవాతం, నొప్పులు, అస్తమా, లివర్ వ్యాధులు, నిమోనియా, దగ్గు, క్షయ, కిడ్నీ వ్యాధులు, గాల్ బ్లాడర్ వ్యాధులు, ఎముకలు, చర్మవ్యాధులు, కేన్సర్, టి.బి, వెంట్రుకలు, గోళ్ళకు సంబంధించిన వ్యాధులు మరియు లోపాలు శనిగ్రహ లోపం వల్ల వచ్చే వ్యాధులు. ఈ వ్యాదుల నివారణకు సప్తముఖి రుద్రాక్షను చేతికి గాని మెడలో గాని ధరించాలి. లేదా సప్తముఖి రుద్రాక్షను నీటిలో ఉంచి ఆ నీటిని పరగడుపున త్రాగాలి.

సేవకులతో వైరం, శరీర అవయవ లోపం, కోమాలోనికి పోవటం, నిద్రలేమి, మత్తు పదార్థాల సేవనం, పిచ్చితనం, స్పర్శపోవటం, శరీరం క్షీణించటం, కష్టాలకు, నష్టాలకు శనిగ్రహ దోషమే కారణమౌతుంది. వీరు తప్పనిసరిగా సప్తముఖి రుద్రాక్షను ధరించాలి. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, శనిదశ జరుగుతున్నవారు శని నీచలో ఉన్న, శని శత్రుక్షేత్రాలలో ఉన్న, పుష్యమి, అనురాధా, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు సప్తముఖి రుద్రాక్ష ధరిస్తే ఉపశమనం కలుగుతుంది. సప్తముఖి రుద్రాక్షను సోమవారం గాని, శనివారం గాని శివాలయంలో అభిషేకించి ధరింఛాలి.

ఏలినాటి శని జరుగు చున్నప్పుడు ముఖ్యమైన పనులు ఆటంకములు ఏర్పడి మధ్యలో ఆగి పోవటం జరుగుతుంది. సమయానికి డబ్బు చేతికి అందదు. అనవసర వ్యయం అవుతుంది. శని బద్దకమును పెంచుతాడు, అతినిద్ర, మత్తు, బద్దకము కలిగిస్తాడు. ఏకాగ్రత లోపిస్తుంది. విద్యార్ధులకు మొండితనాన్ని, అశ్రద్ధను, నిర్లక్ష్యాన్ని కలిగిస్తాడు. శని దోష ప్రభావం వలన కొంతమందిలో అయితే ఊబకాయులు అవడము, శరీరమునందు కొవ్వు పెరిగి శారీరక అందమును కోల్పోయి వికారముగా తయారవుతారు. నూనె సంభందిత పదార్ధాలపై ఎక్కువ మక్కువ చూపుతారు. ఏలిన నాటి శని జరుగు చున్న వారు ఏ నిర్ణయమును సరిగ్గా తీసుకోలేరు. ఒకే విషయమును గురుంచి పదేపదే అలోచిస్తూంటారు. వృధాగా కాల యాపన చేస్తారు. అనుకొన్న పనిని అనుకొన్న సమయమునకు పూర్తి చెయ్యలేరు. ఇటువంటి వారు సప్తముఖి ధరించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...