13, జులై 2018, శుక్రవారం

శుక్ర గ్రహ దోష నివారణకు "షణ్ముఖి రుద్రాక్ష"

శుక్ర గ్రహ దోష నివారణకు "షణ్ముఖి రుద్రాక్ష" 

షణ్ముఖి రుద్రాక్ష ప్రత్యక్ష కుమారస్వామి [కార్తికేయ] రూపముగా భావిస్తారు. జ్యోతిష్యంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు షణ్ముఖి రుద్రాక్ష ధరించాలి. శుక్రుడు వివాహం, సౌఖ్యత కారకుడు. దాంపత్య జీవితంలో గొడవలు, సౌఖ్యత లేనివాళ్ళు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. వివాహం కాని స్త్రీ, పురుషులు షణ్ముఖి రుద్రాక్షను దరిస్తే వివాహం తొందరగా జరుగుతుంది.

శుక్రుడు జాతకంలో బలహీనంగా ఉన్నా లేక వ్యతిరేకంగా ఉన్నా అట్టి జాతకుని సామర్థ్యాలు బయటి ప్రపంచానికి తెలియవు. ఎక్కడా అవకాశాలు రావు. తన సామర్థ్యము మీద తనకే నమ్మకము పోతుంది. ఇతరుల దగ్గర ఉద్యోగాలు చేసి లేక వారి దగ్గర సహాకులుగా స్థిరపడి వాళ్ళ పురోగతికి వీళ్ళు సోపానాలు అవుతారు. జీవితములో ఏదో సాథించాలని తాపత్రయ పడి అన్నిరకాలుగా శక్తి సామర్థ్యాలు, క్రియేటివిటీ ఉండి అనేక సంవత్సరాలు అవకాశము కోసము ఎదురుచూసి ఏ రకమైన ప్రయోజనము పొందలేక జీవితములో ఓడిపోతారు.

కొందరి జాతకములో శుక్రుడు అఖండంగా యోగిస్తాడు. కానీ ఆ యోగాన్ని నిలబెట్టలేడు. గొప్ప కళాకారుడిగా రాణించి, కీర్తిప్రతిష్టలు సంపాదించి అత్యున్నత స్థానములో వెలిగిపోతారు. కానీ మద్యపానానికి అలవాటుపడి మద్యమే జీవితమై సర్వం కోల్పోతారు. ప్రాణనష్టం కూడా సంభవించవచ్చు. లేని పక్షములో జీవిత చరమాంకములో తిండికి, బట్టకి నానా ఇబ్బందులూ ఎదుర్కుంటారు.

పేకాటలో, గుఱ్ఱపు పందాలలో నష్టపోవడము మాత్రము శుక్ర గ్రహ ప్రభావము వల్ల మాత్రం కాదు. ఓ స్త్రీకి బానిసై, వృత్తి, ఉద్యోగాలు, కెరియర్ అన్నీ నిర్లక్ష్యము చేసి సంపాదించినదంతా ఖర్చుపెట్టి దివాలా తీస్తారు. ఇది శుక్ర గ్రహ ప్రతికూల ప్రభావం మాత్రమే. జాతక రీత్యా శుక్రుడు బాగా లేకపోతే స్త్రీలవల్ల అష్టకష్టాలు, నిందలు సంభవిస్తాయి. స్త్రీలోలుడిగా అపఖ్యాతి సంభవిస్తుంది.

శుక్రుడు అనుకూలముగా ఉంటే ఎంతటి వ్యభిచారము చేసే వాడయినా అతని లీలలు వెలుగులోనికి రావు. సహోదరీ వర్గం స్థిరాస్థులను సంగ్రహిస్తారు. కోర్టుకు లాగి మరీ ఆస్తులు దక్కించుకుంటారు. చేసిన మేలును మరుస్తారు. రక్త సంబంథమే లేనట్లు ప్రబల శత్రువర్గముగా మారిపోతారు.


వ్యాపారంలో అభివృద్ధి  లేని వారు, ఒడుదుడుకులు ఉన్నవారు షణ్ముఖి రుద్రాక్ష ధరించాలి. లలిత కళలలో రాణించాలని అనుకునే వాళ్ళు, కావ్య రచన చేయువారు, సంగీతం, నాట్యం, కవిత్వం, జ్యోతిష్యం, రత్న వ్యాపారం చేయువారు షణ్ముఖి రుద్రాక్ష ధారణ చేయాలి.

సంసార సౌఖ్యత లేనివారు, శయ్యా సౌఖ్యత లేనివారు షణ్ముఖి రుద్రాక్ష ధరించాలి. కంటిలో రేటినాకు శుక్రుడు కారకుడు కావున దృష్టి లోపం ఉన్నవారు షణ్ముఖి రుద్రాక్షను మెడలో ధరించటం గాని, నీటిలో రుద్రాక్షను వేసుకొని నీటిని తాగిన దృష్టి లోప సమస్యల నుండి నివారింపబడతారు. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే శృంగార సంబంథమైన విషయాల్లో బలహీనత ఏర్పడుతుంది. వీర్యకణాలలో జీవత్వం,పటుత్వం ఉండదు.

అతిమూత్ర వ్యాది ఉన్నవారు, సుఖవ్యాదులు ఉన్నవారు, వీర్య సమస్యలు ఉన్నవారు, చర్మ వ్యాదులు, బొల్లి ఉన్నవారు షణ్ముఖి రుద్రాక్షను నీటిలో వేసుకొని త్రాగవలెను. స్త్రీదేవతోపాసన చేయువారు, వ్యాపార బాగస్వాములు, రియల్ ఎస్టేట్, గృహోపయోగ అలంకరణ సామాగ్రి వ్యాపారం చేయువారు, వస్త్రవ్యాపారం చేయువారు, సుగంద ద్రవ్యాల వ్యాపారం చేయువారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి. షణ్ముఖి రుద్రాక్షను శివాలయంలో అభిషేకం చేయించి సోమవారం గాని, శుక్రవారం గాని ధరించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...