3, మార్చి 2018, శనివారం

నవగ్రహ దోష నివారణకు తినవలసిన దానం చేయాల్సిన వస్తువులు

నవగ్రహ దోష నివారణకు తినవలసిన దానం చేయాల్సిన వస్తువులు

నవగ్రహ దోషాలు ఉన్నప్పుడు ఆయా గ్రహాలకు సంబందించిన ఆహార పదార్ధాలను తినటం వలన గ్రహాలకు సంబందించిన దోషాలు నివారించవచ్చును. తరువాత పూజా సంబందిత కార్యక్రమాలు, దాన ధర్మాలు చేయటం ద్వారా దోషాలను నివారించవచ్చును. జాతకంలో గ్రహాలు శత్రు క్షేత్రాలలో ఉన్న, నీచలో ఉన్న, అస్తంగత్వ ప్రభావంలో ఉన్న, పాపార్గళంలో ఉన్న, గ్రహం ఉన్న రాశిలో తక్కువ అష్టకవర్గు బిందువులు ఉన్న, గ్రహాలకు సంబందించిన దశాంతర్ధశల యందు, గోచార నందు ఆయా గ్రహాలకు సంబందించిన ఆహార పదార్ధాలు తినటం ద్వారా అవి మన శరీరానికి పట్టి ఆయా గ్రహాలు ఇచ్చు దోష ఫలితాలను నివారించవచ్చును. గ్రహాలకు సంబందించిన ఆహార పదార్ధాలను మన శరీరానికి తీసుకున్న తరువాత పూజా పూజలు, వ్రతాలు, యఙ్ఞాలు, దాన ధర్మాలు మొదలగు కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చును. 
 
రవిగ్రహ దోషం ఉన్నవారు తండ్రికి సహాయపడటం, గోధుమ గడ్డి, చెరుకు రసం, గోధుమ పిండి, నెయ్యి, ఎర్ర వస్త్రాలు, ఎర్ర చీమలకు గోధుమ పిండి వెయ్యటం, కోతులకు ఆహారం పెట్టటం, ఎర్ర చందనం చెక్క లేదా పొడి, ఎర్ర పుష్పాలు, ఎర్ర వర్ణం కలిగిన ఆవులు, గోధుమరొట్టె, ఆరెంజ్ వస్త్రాలు, రాగి, రాగి వస్తువులు, రాగి జావ, తెల్లజిల్లేడు వత్తులు, తెల్లజిల్లేడు విగ్రహాలు, మిరియాలు, రేగి పళ్ళు, క్యారెట్, రాగితో చేసిన వస్తువులు  దానం చేయవచ్చును.
 
చంద్రగ్రహ దోషం ఉన్నవారు త్రాగే నీటిని దానం చేయటం, అన్నదానం, బియ్యం, తల్లికి సహాయ పడటం, బియ్యంతో చేసినవి, పాలు, పటిక బెల్లం, పాలతో చేసినవి, నీళ్ళు, తెలుపు కాటన్ వస్త్రాలు, ముత్యపు మాలలు, తెల్ల ఆవుకి ఆహారం పెట్టటం, కర్పూర మాలలు, పళ్ళరసాలు, వెండి వస్తువులు, కర్పూరం, తెల్ల పుష్పాలు, మెత్తటి ఉప్పు, శంఖాలు, పొంగళి మొదలగునవి దానం చేయవచ్చును.
 
కుజగ్రహ దోషం ఉన్నవారు కందిపప్పు, మట్టి బొమ్మలు, కాయ ధాన్యాలు, మిరపకాయలు, నిమ్మ పులిహోర, పచ్చి ఖర్జూర, కళ్ళుప్పు, డేట్స్ సిరప్, బెల్లం, ఎరుపు వస్త్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రానిక్ బొమ్మలు, బొగ్గులు, వ్యవసాయ పనిముట్లు, ఎర్ర చందనం, కాషాయ వర్ణ సింధూరం, కాషాయ వర్ణ వస్త్రాలు, ఎరుపు మచ్చల ఆవు, బొబ్బట్లు, బ్రెడ్, తీపి చపాతి శుక్రుడితో కలిసిన సోదరికి వస్త్రాభరణాలు బహుమతిగా ఇవ్వటం, ఎరుపు రంగు వస్త్రాలు మొదలగునవి దానం చేయటం.
 
బుధగ్రహ దోషం ఉన్నవారు పెసరపప్పు, పెసరపప్పుతో చేసిన ఆహార పదార్ధాలు, ఉసిరి కాయలు పంచటం,పాదరస వస్తువులు ఇవ్వటం, అన్నిరకాల మొక్కలు, ఆకుకూరలు, కూరగాయలు, ఆకుపచ్చ వస్త్రాలు, విద్యార్ధులకు విద్యా సంబంధమైన వస్తువులు, పుస్తకాలు, ఆవుకి పచ్చగడ్డి వెయ్యటం, డబ్బు దానం చెయ్యటం మొదలగునవి దానం చేయవచ్చును.
 
గురుగ్రహ దోషం ఉన్నవారు పండ్లు, తీపి పదార్ధాలు, శెనగపిండితో చేసిన ఆహారపదార్ధాలు, బొప్పాయి, అరటిపళ్ళు, పులిహోర, పుచ్చకాయ, కర్భూజ, పసుపు వస్త్రాలు, పసుపు, మెంతులు, నెయ్యి, లడ్లు, పసుపు వస్త్రాలు, శెనగ గుగ్గిళ్ళు, ధార్మిక కార్యక్రమాల కోసం దానం, విద్యా, వైద్యం, భోజనం, పసుపు రంగు వస్త్రాలు, తియ్యని పానియాలు, బఠాని గుగ్గిళ్ళు, దానం చేయవచ్చును.
 
శుక్రగ్రహ దోషం ఉన్నవారు స్త్రీలకు సంబందించిన బొట్టు బిళ్ళలు, జడ పిన్నులు, తెల్ల నువ్వులు, గసగసాలు, ఇంగువ, జడ రబ్బర్లు, గోరింటాకు, గోళ్ళ రంగులు, సెంటు, అద్దాలు, దువ్వెనలు, తేనె, పౌడర్లు, పూలు,  డ్రైప్రూట్స్, బొబ్బర్లు, అలచందలు, పెరుగు, రంగు రంగుల వస్త్రాలు, సౌందర్య సాధనాలు, అలంకరణ వస్తువులు, తెల్ల వస్త్రాలు, ఒక కన్ను ఉన్నవాళ్ళకు సహాయం  చేయటం, సుగంద ద్రవ్యాలు దాల్చిన చెక్క, లవంగాలు, యాలుకలు పంచటం, పెళ్ళికి సంబందించిన వస్తువులు, సిల్క్ వస్త్రాలు, సోదరీలకు సౌందర్య సాధన వస్త్రాభరణాలు ఇవ్వటం  మొదలగునవి దాన చేయవచ్చును.
 
శనిగ్రహ దోషం ఉన్నవారు వంట నూనె, నువ్వులు, ఇనుము, దేవాలయాలకు సిమెంట్, ఐరన్ వస్తువులు, నువ్వులతో చేసినవి, నీలిరంగు వస్త్రాలు, కార్మికులకు, నూనెతో చేసినవి, చెప్పులు, నల్లని గొడుగు, ముసలి వాళ్ళకు, మానసిక వికలాంగులకు, కుంటి, గుడ్డి, కుష్ఠు మొదలగు దీర్ఘకాల అనారోగ్యులకు వస్తు, అనాదలకు సహాయపడటం, ఎద్దుకు ఆహారం పెట్టటం,, ఆహార, ధన రూపంలో సాయం చేయటం, మన ఇంట్లో, వ్యాపార, ఆఫీసులో పనిచేసే వారికి వస్తు, ధన రూపంలో దానం చేయవచ్చును.
 
రాహుగ్రహ దోషం ఉన్నవారు మినుములు, ఆవాలు, అగరబత్తీ, మినప సున్నిండలు, సీసంతో చేసినవి, బార్లీ గింజలు, గరికతో చేసినవి,  పుట్ట మట్టిని నీటిలో వేయటం, అద్ధం, ఇడ్లీలు, మినపగారెలు, తడిపి నాబెట్టిన మినుములు ఆవుకి పెట్టటం, పొగరంగు వస్త్రాలు దానం చేయవచ్చును.
 
కేతుగ్రహ దోషం ఉన్నవారు ఉలవలు, కొబ్బరి కాయలు, కొబ్బరి నూనె, పశువులకు, పక్షులకు, చేపలకు ఆహారం పెట్టటం, పిల్లులకు, కుక్కలకు పాలు పోయటం, వాటిని సంరక్షణ చేయటం, దర్భలతో చేసినవి, ఉలవల పొడిని ఆవులకి పెట్టటం, విచిత్ర వర్ణ వస్తువులు దానం చేయవచ్చును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...