5, మే 2017, శుక్రవారం

కర్కాటక లగ్నములో నవగ్రహములు

కర్కాటక  లగ్నములో నవగ్రహములు

కర్కాటక లగ్నము యొక్క అధిపతి చంద్రుడు.  మీ లగ్నము  కర్కాటకమైన ఎడల మీరు ప్రయాణములందు ఆసక్తి కలిగి వుండెదరు. మీ కల్పనాశీలత మరియు స్మరణ క్షమత బాగుండును. మీలో ఎల్లప్పుడు ప్రగతిబాటలో ముందుకు నడిచే కోరిక కలిగి వుండెదరు. యది మీ కుండలిలో లగ్న బావములో మరే గ్రహమైనా వున్న ఎడల దానివలన మీరు ప్రబావితులు కాగలరు.

కర్కాటక లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థ సూర్యుడు
కర్కాటక లగ్నము యొక్క కుండలిలో సూర్యుడు ద్వితీయ బావము యొక్క అధిపతి కాగలడు. ప్రధమ బావములో చంద్రుని యొక్క రాశి కటకములో వుండుట వలన గ్రహము ఆరోగ్య సంబందమైన విషయములో కష్టకారిగా వుండును. సూర్య దశలో ఆరోగ్యము వలన వ్యక్తి కష్టపడుచుండును. వీరిలో అభిమానము మరియు కోపము వుండును. వీరిలో వ్యాపారము పట్ల అపేక్ష మరియు ఉద్యోగము చేయుట ఇష్టకరముగాను వుండును. ప్రభుత్వ సంబంద విషయములలో సమస్యలను ఎదుర్కొన వలసి వచ్చును. తండ్రితో మతబేదములు వుండును. వీరు నిలకడగా ఒకచోట కూర్చొనుటకు ఇష్టపడరు. బందుమిత్రులతో వివాదములను ఎదుర్కొన వలసి వుండును.

కర్కాటక లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థ చంద్రుడు

చంద్రుడు కర్కాటక లగ్నము యొక్క కుండలిలో లగ్నాదిపతిగా వుండుట కారణముగా శుభకారక గ్రహముగా వుండును. చంద్రుడు స్వరాశిగా వుండును. మంచి స్వబావము కలిగి పరోపకారిగా వుండును. వీరిలో భగవంతుని పట్ల భక్తి మరియు పెద్దవారిపై గౌరవ మర్యాదలు కలిగి వుండెదరు. వీరిలో మనోభలము అధికముగా వుండును. వారి ప్రయత్నములో సమాజములో ఉన్నత స్థానమును పొందెదరు. వ్యాపారములో వీరికి సఫలత లభించును. కళా క్షేత్రములో కూడా వీరికి మంచి సఫలత లభించగలదు. చంద్రుని యొక్క దృష్టి సప్తమ బావములో వుండుట కారణముగా జీవితభాగస్వామి యొక్క సంబందములలో ఉత్తమ ఫలితములను ఇచ్చును. వ్యక్తిని విద్యావానుడుగాను మరియు ఙ్ఞానవంతునిగాను చేయును. ధన బావములో చంద్రుని యొక్క ప్రభావము వుండిన ఎడల ఆర్ధిక స్థితి బాగుండును. వివాహము తరువాత వీరికి విషేశమైన లాభములు కలుగును. కఠినమైన సత్యము మరియు నేరుగా మాట్లాడు అలవాట్లు వుండుట వలన వీరు విరోధములను ఎదుర్కొన వలసి వచ్చును.


కర్కాటక లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థ కుజుడు

కుజుడు కర్కాటక లగ్నము గల కుండలిలో పంచమాదిపతి మరియు దశమాదిపతి కాగలడు. ఇది దశమాదిపతి మరియు త్రికోణాదిపతిగా వుండుట వలన కర్కాటక లగ్నములో మంగళకరమైనదిగా వుండును. కుజుని ప్రబావము వలన క్రోదము మరియు ఉగ్ర స్వభావము కలిగి వుండును. వీరిలో మహత్వకాంక్ష అధికముగా వుండును. రాజకీయ రంగములో కుజుడు వీరికి లాభములను ప్రదానించును. ప్రధమ బావములో  వున్న కుజుడు చతుర్ధ బావమును మరియు అష్టమ బావమును చూచును. కుజుని యొక్క దృష్టి కారణముగా వ్యక్తికి ఆర్ధిక లాభము లభించుచుండును. కాని వ్యయము కూడా అదే అనుపాతములో వుండును. దన సేకరణము చేయుట వీరికి కఠిన కరమైన విషయముగా వుండును. వైవాహిక జీవితములో మదురతలో లోపము ఏర్పడవచ్చును. అనగా కుజుని యొక్క దృష్టి వలన సప్తమ బావము ప్రభావితము కాగలదు. కుటుంబ జీవితము కలహ పూరితముగా వుండును. లగ్నస్థ కుజుని యొక్క ప్రభావము వలన వ్యక్తి సంతాన సుఖమును పొందగలడు. స్వబావములో తెలివితేటలు మరియు పేరశ కారణముగా అప్పుడప్పుడు వీరి అవమానములను ఎదుర్కొన వలసి వచ్చును.

కర్కాటక లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థ బుధుడు

బుధుడు కర్కాటక లగ్నము యొక్క కుండలిలో అశుభ కారక గ్రహము కాగలడు. ఇది ఈ లగ్నములో తృతీయ మరియు ద్వాదశ బావము యొక్క అధిపతి కాగలడు. బుదుడు యది లగ్న బావములో స్థితిలో వున్న ఎడల వ్యక్తి యొక్క ఆచరణ, అలవాట్లు సందేహ పూరితమైనవిగా వుండును. జీవనోపాది కొరకు వీరికి ఉద్యోగము ఇష్టకరముగా వుండును. వ్యాపారము చేయుటలో వీరికి అభిరుచి తక్కువగా వుండును. వీరికి బందు మిత్రులతో మరియు సోదరులతో విశేషకరమైన ఆప్యాయత ఏమీ వుండదు. సప్తమ బావముపై బుధుని యొక్క దృష్టి వుండుట కారణముగా గృహస్థ జీవితములో అశాంతి కలిగి వుండును. బాగస్వాముల నుండి హాని కలుగును. శత్రువుల కారణముగా కష్టములను ఎదుర్కొన వలసి వుండును.

కర్కాటక లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థ గురువు

కర్కాటక లగ్నములో గురువు షష్టమ మరియు నవమ బావము యొక్క అధిపతి. షష్టమ యొక్క అధిపతిగా వుండుట వలన ఏ చోట అయితే గురువు దోషించబడునో ఆ చోట అదే త్రికోణాదిపతిగా వుండుట వలన శుభ ఫలదాయకముగా కూడా వుండును. కర్కాటక లగ్నములో  వున్న గురువు ఉచ్చ స్ధితిని పొందును. వ్యక్తిత్వమును ఆకర్షణీయముగా చేయును. ఇది తన యొక్క పూర్ణ దృష్టితో పంచమ, సప్తమ మరియు నవమ బావమును చూచును. పంచమ బావములో గురువు యొక్క దృష్టి సంతానము యొక్క సందర్బములో శుభ పలదాయకముగా వుండును. సప్తమ బావములో జీవిత భాగస్వామి విషయములో ఉత్తమతను ప్రదానించును. నవమ బావముపై దృష్టి వుండుట కారణముగా బాగ్యము ప్రభలముగా వుండును. జీవితము ధన దాన్యములతో పరిపూర్ణముగా వుండును. వ్యాపారములో ఉదార స్వబావమును మరియు దయాస్వభావమును కలిగించును.

కర్కాటక లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థ శుక్రుడు

కర్కాటక లగ్నంలో శురుడు శత్రు స్ధానంలో ఉంటాడు.  ఇది ఈ లగ్నము యొక్క కుండలిలో శుక్రుడు చతుర్ధ మరియు ఏకాదశ బావము యొక్క అధిపతిగా వుండును. రెండు కేంద్రబావముల అధిపతిగా వుండుట కారణముగా శుక్రునికి కేంద్రాదిపతి యొక్క దోషము కలుగును. శుక్రుడు లగ్నస్థముగా వుండుట వలన వ్యక్తిలో సాహస లోపము కలుగును. వీరి మనస్సులో అనవసర భయము కలుగుతుండును. ఆర్ధిక స్థితి బాగుండును. ఉద్యోగము మరియు వ్యాపార రంగములలో వీరికి మంచి సఫలత లభించగలదు. శుక్రుని యొక్క దృష్టి సప్తమ బావములో స్థితిలో వున్న శని యొక్క రాశిపై వుండిన ఎడల వ్యక్తిలో పనిచేయవలననే కోరిక అధికముగా వుండును. స్త్రీలపై వీరికి విశెష ఆకర్షణ కలిగి వుండెదరు.

కర్కాటక  లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థ శని

కర్కాటక  లగ్నము యొక్క కుండలిలో శని సప్తమాదిపతి మరియు అష్టమాదిపతిగా వుండును. ఈ లగ్నము యొక్క కుండలిలో శని అశుభ, కష్టకారి మరియు పీడాదాయకముగా వుండును. ఈ రాశిలో శని లగ్నస్థముగా వుండుట వలన వ్యక్తి అరోగ్యములో ఒడిదుడుకులు వుండును. వ్యక్తి సన్నగా వుండును. వీరి స్వభావము విలాస వంతమైనదిగా వుండును. వీరు సుఖమును కోరుకునే వారుగా వుండెదరు. అధిక బాగ ధనమును విలాస వంతమైన విషయములకై ఖర్చుచేయుదురు. లగ్నస్థ శని తల్లి దండ్రుల సుఖములో లోపమును కలిగించును. సంతాన విషయములో కూడా ఇది కష్టకారిగా వుండును. శని దాని యొక్క పూర్ణ దృష్టి వలన తృతీయ, సప్తమ మరియు దశమ బావమును చూస్తున్నాడు. దాని కారణముగా సోదురుల నుండి మరియు కుటుంబస్తుల నుండి విశేష సంయోగము లభించక పోవచ్చును. గృహస్థ జీవితములో లోపము ఏర్పడవచ్చును. శని ఆర్ధిక లాభమును ప్రదానించిన ఎడల ఖర్చులకు కూడా అనేక మార్గమును తెరువబడును. నేత్ర సంబందమైన రోగములకు కూడా అవకాశములు వున్నవి.

కర్కాటక  లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థ రాహువు

రాహువు కర్కాటక లగ్నము యొక్క కుండలిలో ప్రధమ బావములో స్థితిలో వుండుట కారణముగా వ్యక్తిని విలాస వంతునిగా చేయును. వీరి మనస్సు సుఖ బోగముల పట్ల ఆకర్షితులు కాగలరు. వ్యాపారములో సఫలతను పొందుటకు వీరు కఠినముగా పరిశ్రమించవలసి వుండును. ఉద్యోగములో వీరికి తొందరగా సఫలత లభించగలదు. రాహువు వారి ఏడవ దృష్టి నుండి సప్తమ బావమును చూడును దానివలన వైవాహిక జీవితము అశాంతిగా వుండును. జీవిత బాగస్వామి నుండి ఆప్యాయత లబించదు. భాగస్వామి నుండి నష్టము కలుగును.

కర్కాటక లగ్నము యొక్క కుండలిలో లగ్నస్థ కేతువు

కర్కాటక లగ్నము యొక్క కుండలిలో ప్రధమ బావములో  వున్న కేతువు అరోగ్యమును ప్రభావితము చేయును. కేతువు యొక్క దశ సమయములో అరోగ్య విషయములో వొడిదుడుకులు ఏర్పడును. సమాజములో మానవ సంబంధ విషయాల పట్ల విషేశ అభిరుచి కలిగి వుండెదరు. వీరికి గుప్త శత్రువులు కూడా వుండును. దానివలన సమస్యలను ఎదుర్కొన వలసి వచ్చును. సప్తమ బావములో కేతువు యొక్క దృష్టి ఈ బావము యొక్క ఫలితములను బలహీన పరుచును. ఈ బావములో కేతువు వలన పీడించబడి వుండుట వలన వైవాహిక జీవితములోని సుఖములలో లోపము ఏర్పడును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...