10, మే 2017, బుధవారం

బుధాదిత్య యోగం

బుధాదిత్య యోగం

శ్లో :-మేషే సింహే యదా భానుః సోమ పుత్రేణ సంయుతః
దీర్ఘయుర్భల సంపన్నో సాధకో బహు పోషకః

సూర్యుడికి ఉచ్చ స్ధానమైన మేషంలోగాని, స్వక్షేత్రమైన సింహాంలో గాని రవి, బుధులు కలిసి ఉండటం బుధాదిత్య యోగం అవుతుంది. ఈ బుధాదిత్య యోగం కలిగిన జాతకులు దీర్ఘాయుర్ధాయం కలిగి ఉంటారు. శక్తి సామర్ధ్యాలు కలిగి ఉంటారు. అనేకమందిని పోషించే సాధకునిగా చేస్తుంది. బుధాదిత్య యోగం రవి, బుధులు కన్య, మిధున రాశులలో ఉన్న ఏర్పడుతుందని కొందరి భావన.


బుధాదిత్య యోగం  చాలామంది జాతకాలలో ఏర్పడటానికి అవకాశం ఉంది. బుధుడు, రవి గ్రహాల మద్య దూరం 29 డిగ్రీలకు మించి ఉండదు. రవి, బుధులు అతి దగ్గరలో ఉండటం వలన ఈ యోగం ఏర్పడుతుంది. బుధుడు రవికి 14 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు అస్తంగత్వం కావటం వలన యోగం ఏర్పడినప్పటికి అనుభవంలో ఫలితాలు సరిపోవటం లేదు. బుధుడు అస్తంగత్వం చెందినప్పుడు జాతకునికి స్ఫురణ శక్తి తగ్గుతోందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

సామాన్యమైన జాతకాలలో ఈ యోగం ఉండి, ప్రముఖ వ్యక్తుల జాతకాలలో ఈ యోగం కనిపించకపోవటం జరుగుతుంది. ఇలా యోగాలు పనిచేయని సంధర్భాలు ఎక్కువ. యోగాలు ఎందుకు పనిచేయటం లేదంటే వానిని అన్వయించుకోవటంలో సరైన అవగాహన లేకపోవటం. బహు శాస్త్ర పరిఙ్ఞానమున్నా, శబ్ధాదికారం ఉన్నా, మేధా సంపత్తి ఉన్నా కూడా ఫలిత విషయంలో పూర్వాచార్యులచే చెప్పబడిన సూక్ష్మతర విషయాలను గ్రహించకుండా ఫలితాన్ని నిర్ధారిస్తే భంగపాటు తప్పదని వరాహమిహరుని వచనం.   

జాతకంలో యోగం ఉండగానే సరిపోదు. ఆ యోగ కారకులు ఫలితాన్ని అనుభవాన్ని తెలియజేసే నవాంశ వర్గ చక్రంలో మంచి స్ధానాలలో ఉండాలి. యోగం ఫలవంతం అవటానికి ఫలితాన్ని అందించటానికి అనుకూల దశ, గోచారం కీలకపాత్ర వహిస్తాయి. జరుగుతున్న దశ, గోచారం అనుకూలంగా ఉండాలి. యోగ కారక గ్రహాలు దుస్ధానాలకు అధిపతులు కారాదు.

యోగ ఫల నిర్ణయంలో యోగకారకమైన గ్రహం ఇంకా ఇతర ఫల సంబంద కారకత్వ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఫలితాన్ని నిర్ధారించాలి. లేదా ఫలితాలు తారుమారు అయి ఫలిత నిర్దారణ వాస్తవానికి దూరంగా ఉంటుంది. ఏ యోగాన్ని అయిన నిర్ణయించటానికి ముందు జాతక పరిదిరీత్యా యోగ తీవ్రతను, జాతకుని ఆయుః పరిమాణాలను దృష్టిలో ఉంచుకొని ఫలితాంశాన్ని నిర్ణయించాలి అని మంత్రేశ్వరుడి వచనం.  

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...