1, డిసెంబర్ 2016, గురువారం

కనక పుష్యరాగం (Yellow Sapphire)

పుష్యరాగం

పుష్యమి నక్షత్రమువలె మెరుస్తూ ఉంటుంది కాబట్టి దీనికి “పుష్యరాగము” అనే పేరు వచ్చింది. పుష్యరాగంను పుష్పరాజ్, పుక్ రాజ్, గురురత్నం, గురువల్లభ, పీతమణి,  వాచస్పతి,  పుష్యమి,  శ్వేతమణి, జీవమణి అనే పేర్లతో పిలుస్తారు.

పుష్యరాగాలు ఎక్కువగా బ్రెజిల్, అమెరికా, శ్రీలంక, బర్మా, రష్యా, ఆస్ట్రేలియా, పాకిస్ధాన్, మెక్సికో, జపాన్, ఆఫ్రికా దేశాలలో లభిస్తాయి.గులాబీ రంగు పుష్యరాగాలు రష్యా, బ్రెజిల్, పాకిస్ధాన్ దేశాలలో అరుదుగా లభిస్తాయి. పుష్యరాగము అగ్నిపర్వత శిలలో, పెగ్మటెట్ పొరలలో లభ్యమవుతుంది. లేత గులాబీ రంగు గల పుష్యరాగాలు, బంగారు ఛాయతో మెరిసే పుష్య రాగాలు చాల తక్కువగా లభ్యమవుతాయి. ఇవి అత్యంత  విలువ కలవిగా ఉంటాయి. వర్ణరహితము గల పుష్యరాగములను పరానీలలోహిత కిరణాల ద్వారా గురి కాబడి నీలిరంగు పుష్యరాగాలుగా కూడా సృష్టించవచ్చును. సాన పెట్టుటకు వీలు కలిగినది పుష్యరాగం. క్రీ.శ 17 వ శతాబ్ధంలో పోర్చుగీసు రాజు కిరీటంలో పొదగబడిన పుష్యరాగం 1640 క్యారెట్లు ఇంతవరకు లభించిన వాటిలో పెద్దది. ఇది రంగులేని పుష్యరాగం. వాటికన్ సిటీలో 16×12 అంగుళాల పుష్యరాగపు శిల ఉంది.


గోరోచనం రంగు, నలుపు రంగు, తెలుపు కలసిన మిశ్రమ రంగులు, మలినములు, కర్కశము కలవి నల్లచుక్కలు కలవి, తేలికగా ఉన్నవి, గరుకుగా ఉన్నవి ప్రశస్తమైనవి కావు. వాటిని ధరించటం కూడ మంచిది కాదు.
పుష్యరాగంలు కొంచెం పెద్దదిగా బరువు కలిగిన, నిర్మలంగా ఉన్న, బంగారపు రంగు ఉండి కాంతివంతంగా ఉన్నగరుకులు లేకుండా ఉన్న పుష్యరాగాలు శ్రేష్ఠమైనవి. బలాసురుని చర్మము భూమిపై పడి పుష్యరాగముగా మారెనని  గరుడ పురాణంలో పేర్కొనటం జరిగింది. కానీ రత్నములు మొత్తం భూమిపైన పుట్టినవే.
రసాయన శాస్త్రపరంగా పుష్యరాగములు ప్లోరోసిలికేట్, అల్యూ మినియమ్ ఆక్సైడ్ సమ్మేళనం, వీటితోపాటు ఫ్లోరిన్, టైటానియం, ఐరన్ మోతాదులను బట్టి పుష్యరాగం లేతపసుపు, ముదురు పసుపు, నీలంతో కూడిన పసుపు వర్ణంతో ఉండును.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం పుష్యరాగములను మేక పంచకంలో ఒకరోజు నానబెట్టిన శుద్ధి అగును. పుష్యరాగములను బీడి ఆకులో ఉంచి భస్మం చేసిన దానిని సేవించిన కాలేయం, క్లోమం, అజీర్ణం, మూత్రాశయ, మెదడుకు సంబందించిన సమస్యలు తగ్గును. చేతులు, కాళ్ళు వణకటం తగ్గిస్తుంది.

పుష్యరాగం ధరించుట వలన కలుగు ప్రయోజనాలు:-జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పుష్యరాగం గురుగ్రహానికి ప్రీతికరమైనది. గురువు పుత్ర కారకుడు, ధన కారకుడు, విద్యాకారకుడు. పుష్యరాగం ధరించిన  ఋణవిముక్తి కలుగును. శత్రువులు మిత్రులుగా మారతారు.  పుష్యరాగం ధరించటం ద్వారా పుత్ర సంతానప్రాప్తి, వంశాభివృద్ధి కలుగును. వ్యాపారాభివృద్ది, విద్యార్ధులు పుష్యరాగం దరించిన పరీక్షలలో విజయం సాదింపగలరు. విద్యలో ఆసక్తి పెరిగి శ్రద్ధగా చదివి ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. సంతానాహీనులు పుష్యరాగం ధరించిన పూర్ణాయుర్ధాయం కలిగిన పుత్రసంతానం కలుగుతుంది. దైవభక్తి, దైవచింతన, సత్ ప్రవర్తన కలిగి ఉంటారు. త్రాగుడు, జూదం, వ్యభిచారం మొదలగు వ్యసనపరులు పుష్యరాగం దరించిన వ్యసనములపై ఆసక్తి తగ్గి సుఖజీవనము చేయగలరు. పుష్యరాగం జీర్ణశక్తిని,  మేధాశక్తిని,  నరాల  బలహీనతలను,   చేతులు,   కాళ్ళు,   శరీరం వణుకుట తగ్గించును.

జాతకంలో గురువు జన్మ లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న నీచరాశిలో ఉన్న, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలలో జన్మించిన వారికి, శత్రుక్షేత్రంలో ఉన్న గురుదశ జరుగుతున్న పుష్యరాగం ధరించటం మంచిది. పుష్యరాగం ధరించిన ఉద్యోగములో అప్రయత్నంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. అధికారుల ప్రశంసలు పొందగలరు. ఏ నక్షత్రాలలో జన్మించిన వారైనా కష్టనష్టాలు, దరిద్రం తొలగిపోవుటకు, అదృష్టం కలసి రావటానికి పుష్యరాగం ధరించటం మంచిది. పుష్యరాగం ఉదర సంబంధమైన వ్యాధులను నివారించును. దోషరహితమైన పుష్యరాగం ధరించిన ధనం, ఆయుష్షు, పేరు ప్రతిష్టలు, గౌరవం మోక్షం లభించగలవు.

స్త్రీ జాతకంలో భర్త కారకుడైన గురువు వివాహం ఆలస్యం కల్పించినప్పుడు కనకపుష్యరాగం ధరించుట వలన వివాహం త్వరగా జరిగి సుఖసంతోషాలు పొందగలరు. పదిమంది వ్యక్తులలో ఒక గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. పుష్యరాగం దరించేటప్పుడు “ఓం వృషభద్వజాయ విద్మహే కృణి హస్తాయ ధీమహీః తన్నో గురు ప్రచోదయాత్” అనే మంత్రాన్ని పఠిస్తూ 3 క్యారెట్లు కలిగిన పుష్యరాగంను చూపుడువేలుకు గాని, ఉంగరపు వేలుకుగాని గురువారం రోజు గురుహోరలో శెనగలు కిలో పావు దానం ఇస్తూ ధరించాలి. 

1 కామెంట్‌:

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...