4, నవంబర్ 2016, శుక్రవారం

జ్యోతిష శాస్త్ర చిట్కాలుజ్యోతిష శాస్త్ర చిట్కాలు

జాతకచక్రంలో ఎక్కువ డిగ్రీలు నడచిన గ్రహం నవాంశలో చంద్రుడు ఉండే రాశిలో పడుతుందో వారు గొప్ప గౌరవ కీర్తి ప్రతిష్టలు పొందుతారు. లేదా చంద్రుడు ఆత్మకారకుడైన చాలు కీర్తి ప్రతిష్టలు పొందుతారు.

రాశిచక్రంలో చంద్రుడు ఉన్న రాశ్యాధిపతి లగ్నాన్ని, చంద్రుడిని రెండిటినీ చూస్తూ ఉన్న గ్రహం 10, 11 భావాలకు సంబంధించిన లేదా ఆరుద్ర, పుష్యమి, మఖ, శ్రవణ, రేవతి నక్షత్రాలలో ఉన్న గ్రహం పాప గ్రహం ఐన మంచి ఫలితాలను ఇస్తుంది. ఆ గ్రహ దశలో పేరు ప్రతిష్టలు, ప్రమోషన్స్, ఆర్ధిక లాభం, శుభకార్యాలు జరగటం కలుగుతాయి. 


కారకాంశ లగ్నం నుండి పంచమ స్ధానంలో గురువు ఉండటం చాలా మంచిది. ఇతని దశలో ఉన్నత స్ధాయికి ఎదగుతారు. ధనలాభం కలుగుతుంది. గ్రంధ రచన చేసి పేరు ప్రతిష్ఠలు గడిస్తారు. 

జాతకచక్రంలో 4-10 భావాల ఆదిపతుల మధ్య పరివర్తన జరిగితే దేవాలయాలు స్వయంగా నిర్మించటం లేదా దేవాలయ నిర్మాణంలో పాల్గొనటం చేస్తారు. 

లగ్నాధిపతి కంటే దశమాధిపతి ఉన్న భావం అభివృద్ధి చెందుతుంది. 

చంద్ర, శనులు కర్కాటకంలో ఉండటం కాని, పరస్పర దృష్టి ఉండటం కాని, పరివర్తన యోగం కాని ఉంటే సాంప్రదాయాలను దిక్కరించటమే కాకుండా స్వతంత్ర సిద్ధాంతాలను నెలకోల్పెదరు. 

వృశ్చిక లగ్నంలో పుట్టిన వారికి విష సర్పాల వలన ఇబ్బందులు ఉంటాయి. ద్వితీయమున రాహువు ఉండి కుజునిచే చూడబడినచో విష కీటకముల వలన భయముంటుంది. 

దశమ భావానికి రవి, రాహువులిరువురికి సంబంధం ఏర్పడితే అట్టి జాతకుడు డాక్టర్ అవుతాడు. 

నవమ భావం పూర్వజన్మ పుణ్య, పాపాలను తెలియజేస్తుంది. ఆ అధిపతి ఉన్న స్ధానాన్ని బట్టి పరిహారాలు చేసుకుంటే ఈ జన్మలో చేసిన పాపాలను తొలగించుకోవచ్చును. 

చతుర్ధాధిపతి లగ్నాధిపతితో సంబంధం కలిగి ఉన్న అట్టి జాతకుడు స్వశక్తిచే గృహం నిర్మించుకుంటారు. చతుర్ధాధిపతి అష్టమంలో ఉన్న, అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్న స్వార్జితమైన గృహం ఉంటుంది.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...