7, అక్టోబర్ 2016, శుక్రవారం

నక్షత్ర గోచారం



నక్షత్ర గోచారం

సకల గ్రహాలు రాశులను చూసినట్లే నక్షత్రాలను కూడా చూస్తుంటాయి. రవి, చంద్రులు తామున్న నక్షత్రం నుండి 14, 15 నక్షత్రాలను చూస్తారు. శని తానున్న నక్షత్రం నుండి 3, 15, 19 నక్షత్రాలను చూస్తాడు. గురుడు తానున్న నక్షత్రం నుండి 10, 15, 19 నక్షత్రాలను చూస్తాడు. కుజుడు తానున్న నక్షత్రం నుండి 3, 7, 8, 15 నక్షత్రాలను, బుధ, సుకృలు తామున్న నక్షత్రం నుండి 1, 15 నక్షత్రాలను చూస్తారు. పూర్ణ చంద్రుని దృష్టి శుభాన్ని, క్షీణ చంద్రుని దృష్టి అశుభ ఫలితాన్ని ఇస్తుంది.


రవి జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రాన్ని చూస్తుంటే రోగం, ధన నష్టం కలుగుతుంది. క్షీణ చంద్రుని దృష్టి మంచిది కాదు. కుజ దృష్టి అశుభ ఫలితాలను ఇస్తుంది. బుధ దృష్టి క్షేమాన్ని, లాభాన్ని కలిగిస్తుంది. శని దృష్టి వల్ల ఆపదలు, మరణం సంభవిస్తాయి. గురు, శుక్ర దృష్టి వల్ల శ్రేయస్సు, లాభం కలుగుతాయి. 

రవి, చంద్రులు జన్మ లేదా నామ నక్షత్రాన్ని చూడటం మృత్యుప్రదం. రవి, కుజుల దృష్టి మృత్యుప్రదం. రవి, బుధుల దృష్టి కార్యభంగం. రవి, గురుల దృష్టి జయం, లాభం, సౌఖ్యం కలుగుతాయి. రవి, శుక్రుల దృష్టి  మరణం. రవి, శనుల దృష్టి  మృత్యుప్రదం.  చంద్ర, కుజులు జన్మ లేదా నామ నక్షత్రాన్ని చూస్తుంటే అశుభం కలుగుతుంది. బుధ, చంద్రుల దృష్టి వల్ల లాభం కలుగుతుంది. చంద్ర, శుక్రుల వీక్షణ వల్ల జయం, లాభం కలుగుతాయి. శని, చంద్రుల దృష్టి వల్ల మరణం కలుగుతుంది. గురు, బుధ దృష్టి వల్ల మరియు బుధ, శుక్ర వీక్షణం వల్ల విశేష లాభం, కార్య జయం కలుగుతాయి. బుధ, శనులు గాని, గురు, శనులు గాని చూడటం ఆలన కార్య నాశనం. శని, శుక్ర వీక్షణం వలన మృత్యుప్రదం కలుగుతాయి. 

నాలుగు నైసర్గిక పాపగ్రహాలు జన్మ నక్షత్రాన్ని చూస్తుంటే తప్పక మరణం కలుగుతుంది. నాలుగు నైసర్గిక శుభ గ్రహాలు అంటే చంద్ర, బుధ, గురు, శుక్రులు చూస్తుంటే విశేష లాభం, సౌఖ్యం, జయం, అభివృద్ధి కలుగుతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...