5, అక్టోబర్ 2016, బుధవారం

గర్భాధానం



గర్భాధానం

దంపతుల ప్రధమ సమాగమాన్ని గర్భాధానమని వ్యవహరిస్తారు. బాల్య వివాహాలు ఆచారంగా ఉన్న కాలంలో వివాహానంతరం కొంతకాలానికి స్త్రీలు ఋతుమతులవుతూ ఉంటారు. ఇప్పుడు బాల్య వివాహాలు చట్ట విరుద్ధం కనుక రజస్వల అనంతర వివాహాలే నేడు ఆచారంగా ఉన్నాయి. స్త్రీ రజో దర్శన దినం నుండి నాలుగు దినాలు వర్జ్యాలు. ఆ తరువాత పన్నెండు దినాలు ఋతుకాలం. ఈ కాలంలో సమదినాలందయిన పుత్ర సంతానం బేసి దినాలందయిన స్త్రీ సంతానం కలుగుతుందని శాస్త్ర వచనం. 


గర్భాధనం అనే శబ్ధార్ధమును పరిశీలిస్తే ఋతుమతి అయిన స్త్రీ భర్తతోడి ప్రధమ సాంగత్యంలోనే గర్భాన్ని ధరిస్తుందని గోచరిస్తుంది. ఇప్పుడు గర్భాదానానికి కూడ ప్రత్యేక ముహూర్తం చూడటం ఎక్కడనో కాని కానరావటం లేదు. గర్భాదాన మంత్రాలన్నీ వివాహంలోనే చెప్పి పూర్తి చేయడం కూడా ప్రచారంలో ఉంది. 

“దాంపత్యోః ఆయుర్భోగా శోభావృద్ధ్యర్ధం, అస్యాం, భార్యాయాం ప్రధమ గర్భ సంస్కార ద్వారా సర్వగర్భ శుద్ధ్యర్ధం. గర్భాధానాఖ్యం కర్మ కరిష్యే” అని గర్భాధాన సంకల్పం. అంటే గర్భాధానం భార్యాభర్తలిద్దరికి ఆయుర్వృద్ధిని, వర్చస్సును, యశస్సును, బలాభివృద్ధిని కలిగిస్తుందని, ప్రధమ గర్భానికి మాత్రమే కాక తరువాత గర్భాలకు కూడా శుద్ధి చేకూరుస్తుందని భావం. సంతానాన్ని కని వంశాభివృద్ధికి పాటుబడవలెను.  

ప్రాతఃకాలంలో పునస్సంధాన హోమం నిర్వహించి రాత్రి మాత్రమే గర్భాధాన ముహూర్తాన్ని చూడాలి. అధిక మాసాలు ఆషాడం, భాద్రపదం, పుష్యమాసం గర్భాధాన ముహూర్తానికి శ్రేష్ఠం కావు. మౌడ్యాలలో పనికి రాదు.
విదియ, తదియ, పంచమి, సప్తమి, త్రయోదశి తిధులు గర్భాధానానికి ఉత్తమం. పర్వదినాలు, తిధి సంధులు, పౌర్ణమి, అమావాస్య, సంక్రాంతి మొదలైనవి పనికిరావు. సోమ, బుధ, గురు, శుక్రవారాలు గర్భాధానానికి ఉత్తమమైన రోజులు. 

రోహిణి, హస్త, స్వాతి, అనురాధ, మూల, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రాలు ఉత్తమమైనవి. మతాంతరంలో మృగశిర, చిత్త కూడా పనికి వస్తాయని కొంతమంది అభిప్రాయం. 

మేష, వృషభ, కర్కాటక, కన్యా, తులా, మీన లగ్నాలు గర్భాధానానికి తగిన లగ్నాలు. మతాంతరంలో ధనుర్లగ్నం కూడా పనికి వస్తుంది. లగ్న, అష్టమ శుద్ధి చూడాలి. అష్టమ చంద్రుడు పనికి రాడు. తారాబలం చూడాలి.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...