8, ఆగస్టు 2016, సోమవారం

జాతకచక్ర చిట్కాలు ద్వితీయ స్ధానం (ధన స్ధానం)



జాతకచక్ర చిట్కాలు ద్వితీయ స్ధానం (ధన స్ధానం)

ద్వితీయ స్ధానం ద్వారా కుటుంబం, ధనం, వాక్కు, అవతల వ్యక్తి మాటతీరుని బట్టి అతన్ని అంచనా వేయవచ్చును. కుటుంబ పోషణ, ప్రాధమిక విద్య, చేతిలో (నిల్వ) ఉన్న ధనం, అశుభ స్ధానంలో ఉన్న ద్వితీయాధితి దశ , ద్వితీయంలో ఉన్న అశుభగ్రహ దశ జరుగుతున్నప్పుడు కుటుంబ పోషణ బాధ్యత మీద పడవచ్చును. ద్వితీయంలోనూ భావప్రకటనా విద్య ఉన్నది. మొదలగునవి ముఖ్యమైన అంశాలు ద్వితీయ స్ధానం ద్వారా పరిశీలించవచ్చును. శుభగ్రహాల కలయిక వలన కొంత. చెడు ప్రభావం తగ్గుతుంది. శుభగ్రహాలు శుభ ఫలితాలను, అశుభగ్రహాలు అశుభ ఫలితాలను ఇస్తాయి. 


ద్వితీయ భావంలో సూర్యుడు ఉంటే:- కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తిగా ఉంటాడు. మంచి గుణాలు కలిగిన వ్యక్తి, వాక్ ఫటిమ కలిగిన వ్యక్తి, కుడి కన్ను, ధనాభివృద్ధి, అబద్ధాలు, క్షణికోద్రేకం, అశుభ రవి ద్వితీయంలో డబ్బుకు ప్రాదాన్యత వహిస్తూ కుటుంబ నిర్లక్ష్యం జరగవచ్చు. 

ద్వితీయ భావంలో చంద్రుడు ఉంటే:- స్త్రీ ధనం, కుటుంబంలో గౌరవాలు, మృధువైన వాక్కు, వక్రీకరణ లేకుండా ఉన్నది ఉన్నట్లు నిజం మాట్లాడతారు. కేతువు, శని, నీచ గురువు, వక్ర బుధుడు కలసి ఉన్నచో అబద్ధాలు, దొంగతనాలు చేసి ధనం సంపాదిస్తాడు. శుక్ర, చంద్రులు కలసి ఉంటే మంచి సింగర్, గురువు కలసి ఉంటే వాక్ చాతుర్యం కలగి ఉంటారు. మినరల్ వాటర్, సముద్ర వ్యాపారం, వ్యాపారంలో క్రయ విక్రయ నైపుణ్యం, శుక్లపక్ష తిధులలో జన్మించిన కాంతివంతమైన గుండ్రని ముఖం కలిగి ఉంటారు. అశుభ చంద్రుడి వలన సముద్రంలో ఆటుపోటుల మాదిరి జీవితంలో ఆటుపోటులు ఉంటాయి. 

ద్వితీయ స్ధానంలో కుజుడు ఉంటే :- జీవితంలో ఒడిదుడుకులు, అబద్ధాలు, పరుషంగా ఇతరులను అవమానపరుస్తూ మాట్లాడటం, ద్వితీయంలో కుజుడు వలన కుజ దోషం. కంటి సమస్యలు, చెవి సమస్యలు, విద్యలో ఆటంకాలు, తలకు గాయం, కుజుడు బలంగా ఉంటే మంచి వాగ్ధాటి కలగి ఉంటారు. ఏదైనా మాట్లాడినప్పుడు ఇతరులు తప్పుగా అర్ధం చేసుకుంటారు. లోహ సంబంధమైన వ్యాపారం కలసి వస్తుంది.
ద్వితీయ స్ధానంలో బుధుడు ఉంటే :- తెలివిగా మాట్లాడటం, మ్యాధ్స్ విద్యపైన పట్టు సాధిస్తారు మంచిగా సంభాషిస్తారు. మంచి దృష్టి, లౌక్యంగా మాట్లాడటం, తడుముకోకుండా కంటిన్యూగా మాట్లాడటం, త్తి, మూగ, లగ్నం నుండి ద్వితీయం ధనాన్ని, బుధుడి నుండి ద్వితీయం  విధ్యని, చంద్రుడి నుండి ద్వితీయం వాక్ చాతుర్యాన్ని తెలుసుకోవచ్చు. 

ద్వితీయ స్ధానంలో గురువు ఉంటే :- వివేకంగా మాట్లాడతారు. ఇతరులు ఇబ్బంది పడే విధంగా సత్యం మాట్లాడతారు. అధ్యాపక వృత్తి, పురోహితం, న్యాయవాద వృత్తిలలో, బంగారం, వెండి వ్యాపారాలలో  రాణిస్తారు. కాంతివంతంగా లావుగా ఉండే ముఖం. దీర్ఘాయువు కలిగి ఉంటారు. కుటుంబ జీవితంలో తృప్తి ఉండదు. సంపాదిస్తాడు కానీ తృప్తిగా ఖర్చు పెట్టడు. దాచుకోలేడు. తృప్తికరమైన విద్య ఉండదు. ఎందుకంటే గురువు విశాల {ఆకాశమంత} కారకుడు. ఎంత ఉన్న ఎంతో కొంత వెలతి ఉండటం వలన దేనిలోనూ సరియైన తృప్తీ కలగదు. కాబట్టి గురువు ఈ భావంలో ఉన్న ఆభావ సంబంధ విషయంలో తృప్తి లేకుండా చేస్తాడు. 

ద్వితీయం స్ధానంలో శుక్రుడు ఉంటే:- మంచి సింగర్స్, తియ్యనివాక్కు, సమయం సందర్భాన్ని బట్టి సత్యం మాట్లాడటం, అంటే ఇతరులను ఏ సందర్భంలోను ఇబ్బంది పడే విధంగా మాట్లాడకపోవటం. వంశపారంపర్య ఆస్తి, శ్రావ్యమైన కంఠ స్వరం, కంటి సమస్యలు, దంత సమస్యలు. విలాసాలకు, వినోదాలకు, అలంకరణలకు, ఆకర్షణీయతలకు, సుఖాలకు, ఆనందానికి ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెడతారు. ఏదో ఒక లలిత కళ యందు ప్రవేశం ఉంటుంది. అశుభ శుక్రుడి వలన కళత్రదోషం కలగి ఉంటారు. 

ద్వితీయ స్ధానంలో శని ఉంటే:- శ్రమతో కష్టపడి ధనం సంపాదిస్తాడు. ముఖానికి సమస్యలు ఉంటాయి. ప్రభుత్వపరంగా {ఇన్ కామ్ టాక్స్, పన్నుల రూపంగా} ధననష్టం, వృద్ధాప్యంలో సుఖపడతారు. మోడితనం, నోరుతుత్తర, లోభగుణం, చూసిందల్లా తనకే లేదనే మనస్తత్వం కలగి ఉంటారు. 

ద్వితీయ స్ధానంలో రాహువు ఉంటే :- అబద్ధాలు, ఉన్నదాని కంటే ఎక్కువ చేసి మాట్లాడటం, అనాచార పనులయందు ఆసక్తి, కలలు కంటుంటారు. విద్యలో ఇబ్బందులు. పుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు. విదేశాలలో విద్య, కుటుంబంలో ఆందోళన, అత్యాసగా ధనం సంపాదించుకోవాలనుకోవటం, రాహు, బుధుల కలయిక వలన దొంగ బంగారం కొనటం, దొంగతనంగా  పుస్తకాల ముద్రణ చేయటం చేస్తారు. 

ద్వితీయ స్ధానంలో కేతువు ఉంటే:- విద్యలో ఆటంకాలు. కుటుంబంలో కలహాలు. ఆస్తి నష్టం. కుటుంబంలో వైరం. చెప్పుడు మాటలు వినటం. చెప్పే మాటకు చేసే పనికి పొంతన లేకపోవటం. కుటుంబంలో వైరాగ్యం కలగి ఉంటారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...