25, మే 2016, బుధవారం

భావకారకులు – యోగకారకులు



భావకారకులు – యోగకారకులు 

జాతకచక్రంలో 12 భావాలకు భావకారకులు ఉంటారు. భావకారకుడు భావంలో ఉంటే ఆ భావం ఫలితాలు బాగుంటాయి. కారకోభావనాశాయ ప్రకారం భావకారకుడు భావంలో ఉంటే ఆ భావ లక్షణాలను చెడగొడతాడు. ఉదా:- పంచమం సంతాన స్ధానం, సంతాన కారకుడు గురువు , గురువు పంచమంలో ఉంటే కారకోభావనాశాయ ప్రకారం సంతానం లేటు కావటం, లేదా మనం అనుకున్న దానికి విరుద్ధంగా కలగటం జరుగుతుంది. గురువుకి ఆ క్షేత్రం శత్రుక్షేత్రం గాని, పాప గ్రహ దృష్టి ఉన్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. 


లగ్నభావానికి –రవి కారకుడు
ధనభావానికి-గురువు కారకుడు
భ్రాతృభావానికి-కుజుడు కారకుడు
మాతృభావానికి-చంద్రుడు కారకుడు
మంత్రభావానికి-గురువు కారకుడు
శతృభావానికి-కుజుడు కారకుడు
వివాహభావానికి-శుక్రుడు కారకుడు
ఆయుర్భావానికి-శని కారకుడు
బాగ్యభావానికి-గురువు కారకుడు
రాజ్యభావానికి-రవి,బుధ,గురు,శని కారకులు
లాభభావానికి-గురువు కారకుడు
వ్యయభావానికి-శని కారకుడు

ఈ భావకారకాదిపతులు కారక భావంలో ఉంటే ఆ భావం వర్తించే కారకాన్ని చెడగొడుతుంది. కారకోభావనాశాయ ఫలితం ఎక్కువగా పాప,శత్రు గ్రహాల దృష్టి ఉంటేనే కారకభావం చెడుతుంది.

ఉదా- పురుషులకు సప్తమంలో శుక్రుడు ఉంటే కారకోభావనాశాయ, స్త్రీలకు సప్తమంలో గురువు ఉంటే కారకోభావనాశాయ అంటారు. దీని వలన పాప,శత్రు గ్రహాల దృష్టి ఉంటేనే కళత్ర దోషం ఉంటుంది. 

2,11 భావాలలో గురువు ఉంటే డబ్బు ఉంటుంది కానీ సెక్యూరిటీ ఉండదు. కారకోభావనాశాయ సూత్రం ప్రకారం శత్రురాశిలో ఉన్న, పాపగ్రహ దృష్టి ఉన్న అభద్రతాభావం ఉంటుంది.

అష్టమ భావంలో శని ఉంటే ఆయుష్కారకుడు కావటం వలన ఆయుర్ధాయాన్ని కలిగి ఉంటాడు. కారకోభావనాశాయ ప్రకారం శత్రురాశిలో ఉన్న, పాపగ్రహ దృష్టి ఉన్న దీర్ఘకాల వ్యాధిని కల్పించి ఇబ్బంది పెడతాడు. 

వ్యయ భావంలో శని ఉంటే యోగసాధన (తపశ్శక్తి) కలిగి ఉంటాడు. కారకోభావనాశాయ ప్రకారం శత్రురాశిలో ఉన్న, పాపగ్రహ దృష్టి ఉన్న అధికంగా ఖర్చులు, తిండి సరిగా తినలేకపోవటం, నిద్ర సరిగా పట్టకపోవటం జరుగుతుంది.
  
భావకారకుడు, యోగకారకుడు ఒక్కడే అయితే మంచి యోగం కలుగుతుంది.
ఉదా:- వృశ్చిక లగ్నానికి ద్వితీయ, పంచమాధిపతులు గురువు యోగకారకుడు, భావకారకుడు అవుతాడు .
కుంభ లగ్నానికి ద్వితీయ, లాభాదిపతి గురువు కావటం వలన లగ్నానికి శత్రువైన యోగకారకుడు, భావకారకుడు అవుతాడు.
మేష లగ్నానికి చతుర్ధాధిపతి చంద్రుడు యోగ కారకుడు అవుతాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...