శీతోష్ణ పరిస్ధితుల వలన సహజముగా బీటలు వారిన భూమి, శల్యములు(ఎముకలు)గల భూమి, పుట్టలు గల భూమి,ఎత్తు పల్లముములు గల భూమియు గృహాది నిర్మాణములకు పనికి రాదు. ఈ రకములైన భూములు యజమాని యొక్క ఆయుష్షును, ధనాన్ని హరించును. పుట్టలు, ఎత్తు పల్లములు, శల్యములు గల భూమిని శోదించి పుట్టలు, శల్యములు లేని దానిగా, ఎత్తు పల్లములు లేకుండా సమానాకారముగా భూమిని చదును చేసి గృహాది నిర్మాణాలు చేయవచ్చును.
బూడిద, బొగ్గులు, ఎముకలు, పొట్టు, వెంట్రుకలు మొదలగునావి భూమి లోపల ఉన్న భూమిని గ్రహించరాదు. ఎలుకలు, పుట్టలు, ఇసుక ఎక్కువగా ఉన్న భూమి దోషమును కలిగించును. ఎత్తైనది,లోతైనది, బీటలు ఉన్నది,పెద్ద బోరియాలు ఉన్నది, చవిటి భూమి, ఎడమ వాటముగా నీరు ప్రవహించు భూమి, వంకరాలు కలిగిన భూమి, మిక్కిలి ఎత్తైన భూమి, కేరాటములు వలె ఎగుడు దిగుడు గల భూములు గృహా నిర్మాణమునకు పనికి రావని తెలియజేయబడినది.
గ్రామములకు, నగరాలకు ఈశాన్య, ఉత్తర, దక్షిణములలో శ్మశానమును
కల్పించవలెననియు, శ్మశాన ధూమం ప్రసరించకుండా తగినంత దూరములో భూమిని
స్వీకరించవలెననియు, శ్మశానానికి 400 గజములకు లోపు గల భూమి, మతాంతరంలో 1000
గజములు లోపు గల భూమి, భూకంపాది దోషాల చేత బీటలు దీసిన భూమి, అగ్ని దగ్ధమైన
భూమి పనికి రాదని గృహా నిర్మాణాలు చేయరాదని స్పష్టమగుచున్నది.
సాత్విక దేవాలయాలైన కృష్ణ, రామ, విష్ణు మొదలగు దేవాలయములకు వెనుక భాగమునందలి భూములను గృహా నిర్మాణములకు విడువవలెననియు, ఉగ్ర దేవాలయములకు దక్షిణ భాగము నందలి భూమిని విడువవలెననియు, కాళి, చండి, దుర్గ మొదలగు సమస్త స్త్రీ దేవతాలయాలకు ఎడమ వైపు గల భూమిని విడువవలెననియు, శివ, వీరభద్ర మొదలగు శివాలయములకు ఎదురుగా ఉన్న భూమిని విడువవలెననియు, చిన్న మూర్తులు గల దేవాలయముల ప్రాకారములతో సమానముగా ఆయా భాగములలో స్ధలములను విసర్జింపవలెననియు, పెద్ద మూర్తులు గల దేవాలయములు పెద్ద ప్రాకారములు ఆయునచో దేవునికి సన్నితముగా ఉండేడి ప్రాకారముతో సమానమగు స్ధలములను ఆయా భాగములలో విడువవలెనని చెప్పబడినది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి