1, మే 2015, శుక్రవారం

కర్తరీ

కర్తరీ

సాధారణంగా కర్తరీ మే నెల 4 వతేదీన డొల్లుకర్తరీ ,మే నెల 11 వ తేదీన నిజకర్తరీ ప్రారంబమై మే నెల 28 వ తేదీతో కర్తరీ త్యాగం జరుగుతుంది.

సూర్యుడు మేషరాశికి చెందిన భరణి నక్షత్రం 4 వ పాదంలో ప్రవేశించినది మొదలుకొని వృషభ రాశిలోని రోహిణి నక్షత్రం మొదటి పాదం దాటే వరకు గల మద్య కాలాన్ని “కర్తరీ” అంటారు.అంటే భరణి నాలుగో పాదం ,కృత్తిక నాలుగు పాదాలు,రోహిణి మొదటి పాదం మొత్తం ఆరు పాదాలలో సూర్యుడు ఉన్న కాలం కర్తరీ అంటారు.దీనినే “కత్తెర” అనికూడ అంటారు. కర్తరి నక్షత్ర కాలంలో సూర్యుడు నిప్పులు చెరుగుతాడు.డిగ్రీలలో చెప్పాలంటే మేషరాశిలో(డిగ్రీల 23°-20' నిమిషాలు) నుండి వృషభరాశిలో (డిగ్రీల 26°-40' నిమిషాలు).సూర్యుడు భరణి నక్షత్రం ప్రవేశించిన రోజే “డొల్లు కర్తరీ”ప్రారంభమవుతుంది.దీనినే "చిన్న కర్తరీ" అని కూడా అంటారు.సూర్యుడు కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ప్రవేశించే రోజుతో డొల్లు కర్తరీ అంతమై "నిజకర్తరి" ప్రారంభమవుతుంది.సూర్యుడు రోహిణి నక్షత్ర రెండవ పాదం  ప్రవేశంతో కర్తరీ త్యాగం అవుతుంది.

కర్తరీ లో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి.అవి చెట్లు నరకటం, నారతీయటం, వ్యవసాయం ఆరంభం, విత్తనాలు చల్లటం,భూమిని త్రవ్వటం,తోటలు వేయటం, చెఱువులు, బావులు,కొలనులు త్రవ్వటం,కొత్త బండి కొనటం,అదిరోహించటం,నూతన గృహ నిర్మాణం చేయటం,పాత గృహాలను బాగు చేయటం వంటి గృహ నిర్మాణ పనులు చేయరాదు.

కర్తరీలో ఉపనయనం,వివాహం,యజ్ఞం,మండపాదులను కప్పటం వంటి పనులు చేయవచ్చును.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...