22, జనవరి 2015, గురువారం

గ్రహాలు వృత్తి కారకత్వాలు

గ్రహాలు వృత్తి కారకత్వాలు

సూర్యుడు : వైద్యశాస్త్రం,బౌతికశాస్త్రం,కుజునితో కలసిన శస్త్ర చికిత్సకునిగా,గురువుతో కలసిన ఆయుర్వేదం,శనితో కలసిన అనస్తీషియా,ఆర్ధోఫిడిక్స్ వైద్యుడు,చంద్ర,శుక్రులతో కలసిన గైనకాలజిస్ట్,బుధునితో కలసిన నరాల నిపుణులు,మరియు కర్ణరోగ వైద్యం సూచించును.రాజ్యాధికారము , పరిపాలనా విభాగాములకు అధికారి , ఆఫీస్ మేనేజ్ మెంట్ , అధ్యక్ష పదవులు, ధార్మిక సంస్థలు , సంఘములకు గౌరవ అధ్యక్షులు మొదలగు అనేక విధముల యజమాని హోదా పొందగలరు. చట్ట సభలలో అధికారము, శాసన నిర్మాణ కర్తలు , ప్రజా పరిపాలకులు . ఆర్డర్స్ జారీ చేయు అధికారము , హోదా , గౌరవము కలిగిన వృత్తులను ప్రసాదించును.


చంద్రుడు : చరిత్ర,కవిత్వం,సైకాలజీ,సముద్ర గర్బమును పరిశోదించుట. నీటికి సంబంధించిన శాఖలు , ద్రవ పదార్దములకు సంబంధించినవి . తెలుపు వర్ణమునకు చెందినవి .
అనగా కూల్ డ్రింక్స్ , పాలు , పాల ఉత్పత్తులు , పంచదార , బియ్యము వ్యాపారములు , రైస్ మిల్స్ , హోటల్స్ , టిఫిన్ సెంటర్స్ , మిల్క్ పార్లర్స్ , నావికుల విద్య,శుక్రునితో కలసిన పాల వ్యాపారం,పెయింట్స్,కుజ శుక్రులతో కలసిన పశువైద్యం,బుద్ధునితో కలసిన టెక్స్ టైల్స్,వస్త్ర వ్యాపారములు , వాటర్ ప్లాంట్స్ , నీరు , చేపల ఉత్పత్తులు , బావులు త్రవ్వడం , బోరింగ్స్ , సముద్రపు ఉత్పత్తులు , జలాంత ర్గామి, నావికా దళ ఉద్యోగములు , దూది వ్యాపారము , దూది ఉత్పత్తులు, పుడ్ ప్రొడక్ట్స్ , వెండి వస్తువులు తయారీ మొదలగు వృత్తులను ప్రసాదించును .


కుజుడు : గృహ నిర్మాణం,సర్వే,సివిల్ ఇంజనీర్,శస్త్ర చికిత్సలు,పశుపోషణ,శస్త్ర చికిత్సలు,మెకానికల్ ఇంజనీర్,రసాయన విద్యలు,రక్షణ విధానం,పేలుడువస్తువులు,ఫైర్ సర్వీస్,తీర్పులు,హైడ్రో ఎలక్ట్రిక్ ఇంజనీర్,విమాన చోదక విద్య,వ్యవసాయము , వ్యవసాయ ఉత్పత్తులు , మాంసపు ఉత్పత్తులు , కోళ్ల పరిశ్రమలు , యంత్రములు, పనిముట్లు తయారీ , వడ్రంగి పనులు , భవన నిర్మాణములు , కనస్ట్రక్షన్స్ , కాంట్రాక్టులు , బిల్డింగ్ మెటీరియల్ , విద్యుత్తు శక్తి శాఖలు , విద్యుత్ ప్లాంట్స్ , మిలటరీ , పోలీస్ తదితర రక్షణ శాఖలు , సైన్యమునకు సంబంధించిన ఉద్యోగాలు , మోటార్స్ , మెకానికల్ , భూ పరిశోధన, అటవీ ఉత్పత్తులు , అటవీ శాఖ కు చెందిన ఉద్యోగాలు ఇలాంటి వృత్తులు కుజుడు ఆధీనము లో ఉంటాయి .

బుధుడు : వ్యాపారం,కమర్షియల్ డిగ్రీలు,బ్రోకర్స్ , బ్యాంకులు , పైనాన్సియల్ సెక్షన్స్ , చిట్ ఫండ్ వ్యాపారములు , ట్రెజరీ డిపార్టమెంట్లు , బడ్జెట్ తయారీ చేయువారు , చిత్ర కళ,డ్రాయింగ్,పెయింటిగ్,నమూనాలు గీయుట,ఎస్టిమేటింగ్,వ్రాత,గణిత విద్య,కంస్ట్రక్షన్ డిజైన్,జ్యోతిష్యం,శుక్రునితో కలసిన చాయా చిత్రములకు చెందిన వ్యాపారం,రసాయన శాస్త్రం,జీవశాస్త్రం,వృక్షశాస్త్రం,అనువాదకులు,ఉపాద్యాయులు, పత్రికలు , పత్రికా సంపాదకులు , ముద్రణా రంగములు , పుస్తక పరిశ్రమలు , రచయితలు చార్టెడ్ ఎకౌంట్స్ , విలేఖర్లు ,జర్నలిజం , గుమస్తా ఉద్యోగాలు ,సాప్ట్ వేర్ , కంప్యూటర్ , టెక్నాలజీ సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు పచ్చళ్ళు పరిశ్రమలు. 

గురుడు : న్యాయవాదులు,ఆర్ధిక శాస్త్రం,సంస్కృతంలో పట్టాలు,వేదాంతం,అవదాన విద్యలు,జ్యోతిష్యం,విద్యా సంస్థలు , ఉపాధ్యాయులు, లెక్చరర్స్ , భోధనా సంబంధ ఉద్యోగములు , పురోహితులు , పూజార్లు , పూజ గది , పూజా ద్రవ్యములు , దేవాలయ సిబ్బంది , దేవాదాయ శాఖలలో ఉద్యోగాలు , పరిశోధనా రంగములు , విశ్లేషకులు , మత ప్రచారకులు , మేధావి వర్గమునకు చెందినవారు . సంస్కృతి , సంప్రదాయములను వివరించు స్వామీజీలు వీరందరూ గురుడు కు సంబంధించిన వారు . గురుడు ఆకాశ తత్వమునకు చెందిన వాడు కాబట్టి విమానయాన రంగములు , శాటిలైట్ లు మొదలగునవి .

శుక్రుడు : నాట్య రంగం,చిత్రకళలు,రసాయన శాస్త్రం,కామశాస్త్రం,గురు,బుదులతో కలసిన ఎలక్ట్రానిక్స్,వస్త్రాలు, ఆభరణ తయారీలు , ఆర్నమెంట్ నగల వ్యాపారము , బంగారు వ్యాపారము , అలంకరణ సామాగ్రి , ఇంటీరియర్ డిజైనింగ్ , ఫాన్సీ దుకాణాలు , హైర్ స్టైయిల్ డిజైనింగ్,కుట్టుపని,ఎంబ్రాయిడరీ ట్రైనింగ్,ఇల్లు,వాహనాలకు పెయింట్స్ వేయటం,మసాజ్ సెంటర్స్ , రెడీమేడ్ వస్త్రములు , వస్తువులు , స్త్రీలకు సంబంధించిన వస్తువులు , సుగంధ ద్రవ్యములు , అగరబత్తీ పరిశ్రమలు, నూతన వస్తువులు, కళలు , సినిమా రంగము , కళాకారులు , ఎలక్టానిక్ మీడియా , గాయకులు , సంగీత సాహిత్య రంగములు .

శనిగ్రహము :గనులు,త్రవ్వకాలు,భూగర్భ శాస్త్రం,భూగోళ శాస్త్రం,పురాతన వస్తుసేకరణ,బొగ్గు గనులు,ఆర్ధోఫిడిక్స్, రాజకీయ నాయకులు , నామినేటెడ్ పోస్టులు పొందేవారు . న్యాయవాదులు , జడ్జీలు , న్యాయశాఖకు సంబంధించి ఉద్యోగులు , గాలికి సంబంధించిన రంగములు అనగా టెలీ ఫోన్ , కమ్యునికేషన్ , బట్వాడా కార్మికులు , తపాలా శాఖ , సేవకులు , కూలీలు , వ్యవసాయ కార్మికులు , కష్టముచే జీవించువారు , ఇనుము , ఉక్కు పరిశ్రమలు , ఇనుము ఉత్పత్తులు , బొగ్గు సంబంధిత శాఖలలో పనిచేయువారు , బరువులు మోయువారు , ఇన్సూరెన్స్ సంబందిత రంగములలో పని చేయువారు,ఇంగ్లీష్ విద్య,ప్రజా ప్రభుత్వ విద్యలు, సంచార జీవులు, నూనె కర్మాగారములు , పెట్రోల్ , డీసెల్ , గ్యాస్ సంబంధిత పరిశ్రమలలో ఉద్యోగ, వ్యాపారములు , సెకండ్ హ్యాండిల్ వస్తువుల వ్యాపారము మొదలగు వృత్తులు శనిగ్రహము వలన కలుగును . కంప్యూటర్ హార్డ్ వేర్ , అసెంబ్లింగ్ యూనిట్స్ మొదలగునవి .

రాహువు : ఈ గ్రహ ప్రభావము వలన డాక్టర్స్ , మత్తు పానీయముల వ్యాపారము చేయువారు , మందుల దుకాణములు, కెమికల్ ఇండస్ట్రీస్ , రసాయన శాస్త్రవేత్తలు , చెత్త వ్యాపారము ఈ గ్రహమునకు సంబంధించిన వారు.
.
కేతువు : చర్మపు ఉత్పత్తులు , జోళ్ళు , రబ్బరు పరిశ్రమలు , రబ్బరు ఉత్పత్తులు మొదలగు వృత్తులను కలిగించును .

2 కామెంట్‌లు:

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...