2, ఏప్రిల్ 2014, బుధవారం

జాతకంలో సుఖసౌఖ్యాలు


జాతకంలో సుఖసౌఖ్యాలు సులువుగా తెలుసుకోవటం.......


ఒక వ్యక్తి జాతచక్రాన్ని పరిశీలించి జాతకుడు తన జీవితంలో ఏ ఏ దశలలో అనగా బాల్యదశ,యవ్వన దశ,వృద్దాప్య దశ లలో మంచి జీవితాన్ని,ఆనందకరమైన ,సుఖ సౌఖ్యమైన జీవితాన్ని,తృప్తిని ఏ ఏ దశలలో పొందుతాడో జాతకచక్రంలోని సర్వాష్టకవర్గు బిందువుల ద్వారా తెలుసుకోవచ్చు.

1)మీనరాశి నుండి మిధునరాశి వరకు మొత్తం 4 రాశులలోని సర్వాష్టకవర్గు బిందువులను కలుపగా వచ్చిన బిందువుల సంఖ్య బట్టి జాతకుడి "బాల్య జీవితం "బాగుంటుందోలేదో తెలుసుకోవచ్చు.

2)కర్కాటకరాశి నుండి తులా రాశి వరకు మొత్తం 4 రాశులలోని సర్వాష్టకవర్గు బిందువులను కలుపగా వచ్చిన బిందువుల సంఖ్య బట్టి జాతకుడి "యవ్వన జీవితం "బాగుంటుందోలేదో తెలుసుకోవచ్చు.

3)వృశ్చికం రాశి నుండి కుంభ రాశి వరకు మొత్తం 4 రాశులలోని సర్వాష్టకవర్గు బిందువులను కలుపగా వచ్చిన బిందువుల సంఖ్య బట్టి జాతకుడి " వృద్దాప్య జీవితం "బాగుంటుందోలేదో తెలుసుకోవచ్చు.

ఉదాహరణ జాతకచక్రంలోని సర్వాష్టక బిందువులు:-

1)మీన రాశి,మేషరాశి,వృషభరాశి,మిధునరాశి సర్వాష్టక బిందువుల సంఖ్య:-21+28+30+36=115.

2)కర్కాటక రాశి,సింహరాశి,కన్యారాశి,తులారాశి సర్వాష్టక బిందువుల సంఖ్య:-35+26+26+20=107.

3)వృశ్చికరాశి,ధనస్సురాశి,మకరరాశి,కుంభరాశి సర్వాష్టక బిందువుల సంఖ్య:-30+27+27+31=115.

బాల్యదశ లో సర్వాష్టక బిందువులు:-115

యవ్వనదశ లో సర్వాష్టక బిందువులు:-107.

వృద్దాప్యదశ లో సర్వాష్టక బిందువులు:-115.

పై జాతకచక్రంలోని సర్వాష్టక బిందువులను పరిశీలించగా బాల్యదశలో 115,యవ్వనదశ లో 107,వృద్దాప్యదశ లో 115 బిందువులు ఉన్నాయి.

కాబట్టి జాతకుడు యవ్వనదశ లో కంటే బాల్యదశ,వృద్దాప్యదశలో ఆనందకరమైన,సుఖ సౌఖ్యాలు కలిగిన జీవితాన్నిఅనుభవిస్తాడు అని తెలుసుకోవచ్చును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...