2, ఏప్రిల్ 2014, బుధవారం

జ్యోతిష్కుడు మోసకారి అయితే జ్యోతిష్య శాస్త్రం మోసమవుతుందా?


జ్యోతిష్కుడు మోసకారి అయితే జ్యోతిష్య శాస్త్రం మోసమవుతుందా?


జ్యోతిష్యం శాస్త్రీయమే భారత ప్రభుత్వం ఆమోదముద్ర.5000 వేల సంవత్సరాల క్రితం సైన్స్ అని ఆధారాలతో నిరూపితం.బొంబాయి హైకోర్టు సంచలన తీర్పు.

అరె! సైంటిస్ట్ మోసకారి అయితే సైన్స్ బూటకమా ? చెప్పండి. కాదు గదా మరి. ఇదే రూలు మన ప్రాచీన శాస్త్రం "జ్యోతిష్యం" కు ఎందుకు వర్తించదు?

చిన్నతనం నుంచీ అంచలంచెలుగా Science గురించి నేర్పినట్లు, జ్యోతిశ్శాస్త్రం గురించిన అవగాహన, కనీసం తల్లిదండ్రుల వద్దనైనా దొరుకుతుందా?తెలుసుకోవాలనే జిఙ్ఞాస ఉండి, కాస్తంత అర్థమయ్యేట్టు తేలికగా ఎవరన్నా చెబుతారా అంటే అది అందని ద్రాక్ష అయి కూర్చుంటుందే తప్ప, పది మంది అర్థం చేసుకొని, తెలుసుకోవాలనే ఆసక్తికి నోచుకోలేక పోతుంది జ్యోతిషం.

జ్యోతిషం ‘Science కాదు’ అని గుడ్డిగా నమ్మే పరిస్థితి ఏర్పడింది. ఖగోళ శాస్త్రం Science అయితే, జ్యోతిషం కూడా ముమ్మాటికీ ఒక శాస్త్రమే.

వైద్యం అనేది నిరూపించబడి శాస్త్రం అయింది, అలా జ్యోతిష్యం నిరూపించబడిందా . నిజమే కాని మానవ జాతిని కొన్ని వేల సార్లు నాశనం చెయ్యగల అణ్వాయుదాలు కనిపెట్టాడానికి ప్రపంచంతో పోటి పడి కొన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న మనం మన ప్రాచీన శాస్త్రం అయిన జ్యోతిష్యం మీద పరిశోదనలుకు అందులో 1 శాతం అయినా ఖర్చు చేస్తున్నామా? మరి పరిశోదనలు చెయ్యకుండానే అది హంబగ్ అని ఎలా నిర్దారిస్తున్నారు?

కొంతమంది అడుగుతుంటారు, అణ్వాయుదాలు అనేవి ప్రపంచంలో ప్రస్తుత దేశాల మద్య పోటీ దృష్ట్యా అవసరం కాని జ్యోతిష్యం వల్ల లాభమేంటని? దానికి ఒకటే సమాదానం’వంద రూపాయలతో "నీకు భవిష్యత్తు అంతా శుభప్రదం" అని చెప్పి, ప్రజల్లో ఆశావదృక్పదం కలిగిస్తున్న జోతిష్యుడే ఉపయోగకారే.’

" మానవీయత లేని,శాస్త్రాభివృద్ది ప్రపంచంలోని సప్త మహాపాపములలో ఒకటి అని జాతిపిత గాంధీ మహాత్ముని ఉవాచ.ఆ విదంగా చూస్తే సైన్స్ పేరుతో మనం ఎంతటి పాపానికి ఒడిగడుతున్నామో అర్థం చేసుకోవాలి.కాబట్టి ప్రస్తుత సైంటిస్టులు చెప్పేదే గొప్ప, వెనుకటి వాల్లు చెప్పింది అంతా నాన్ సెన్స్ అంటే ఎలా? నా దృష్టిలో మతాచారములు అన్ని నిన్నటి సైన్స్. వాటిలో మంచి ఉండవచ్చు. చెడు ఉండవచ్చు . వాటిని చేతనైతే పరిశోదించి నిగ్గు తేల్చాకె వాటి మీద ఒక అభిప్రాయానికి రావడం ఉత్తమ లక్షణం.

ఎన్నో వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహాల గురించి తెలుసుకోవాడినికి కోటానుకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న మానవుడు తన జన్మ రహస్యం తెలుసుకోవాడినికి కొంత ఖర్చు చెయ్యకూడదా? " దేనినైనా గుడ్డిగా నమ్మడం యెంత తప్పో, గుడ్డిగా వ్యతిరేకించడం అంతే తప్పు". అర్థంచెసుకోండి.ఎవరినీ నమ్మించే ప్రయత్నం చేయటంలేదు. అటువంటి ప్రయత్నం కూడా వ్యర్థమే అని తెలుసు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...