29, జనవరి 2014, బుధవారం

కుజదోష నివారణకు రోజ్ క్వార్ట్జ్ గణపతి(Rose Quartz Ganapati)

Astroexperts
కుజదోషాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏదోషం ఉండదు....

కుజదోషం ఉంటే వివాహం ఆలస్యమవుతుంది అని ఒక ప్రచారం ఉంది. శాస్త్ర దూరమైన అంశం. మరి కుజదోషం ఉండి చిన్న వయసులో సకాలంలో వివాహమైన వారు ఎందరో ఉన్నారు. అలాగే కుజదోషం ఉంటే భార్యాభర్తలు విడిపోతారు అన
ి మరొక నానుడి. భార్యాభర్తలు విడిపోవడానికి కుజదోషం ఒక్కటే కారణం కాదు.

కుజుడు అనారోగ్య కారకుడు. కలహకారకుడు. అటువంటి వాడు లగ్నంలో ఉంటే కళత్ర భావమును చూస్తాడు. అలాగే వ్యయంలో వుంటే కళత్ర భావంను చూస్తాడు. కుటుంబ స్థానాన్ని చూడరాదు.



చతుర్థంలో ఉంటే కళత్ర స్థానాన్ని చూస్తాడు. అష్టమంలో కుటుంబ స్థానాలలో ఎక్కడ ఉన్నా కుటుంబ స్థానాన్ని చూస్తాడు. ఇటువంటి సందర్భంలో కుటుంబ కళత్ర స్థానాలతో ఆయనకు చూపు, స్థితి వంటివి వుంటే కలహాలు సృష్టించి కుటుంబ జీవనం పాడుచేసే అవకాశం ఉంది.

కాబట్టి ఆయన స్పర్శ కుజదోషంగా ఉన్న జాతకులకు అటువంటి జాతకులతోనే వివాహం చేయమని, కుజదోషం లేనివారికి కుజదోషం లేని వారితోనే వివాహం చేయమని మహర్షి వచనం. మరి కుజదోషం అని ఎందుకు వచ్చింది అంటే కుజుడు దోషాలను కలుగజేసే సంచారంలో వున్నారు కావున దానికి కుజదోషం అని పేరు పెట్టారు.

చాలా గ్రంథాల సమీకరణ ద్వారా ఎన్నో సూత్రాలు ఈ కుజదోషం గురించి చెప్పారు. అలాగే కొన్ని గ్రహాల స్థాన సంచారం దృష్ట్యా కుజదోషం పరిహారాలు చెప్పారు. దోష పరిహారాలు అంటే లగ్నాత్ కుజుడు ఏయే స్థానాలలో ఉంటే కుజదోషం ఉన్నది అని చెప్పారో ఆ కుజుడికి ఇతర గ్రహాల యుతివీక్షణల దృష్ట్యా దోషం తగ్గుతుంది అనే అంశాలు చెప్పారు. ఇలా ఎన్నో విశేషాలు గ్రహ సంచారం దృష్ట్యానే చెప్పారు. వీటిని అన్నింటినీ సమీక్షించి చేయు నిర్ణయం మీద వివాహం చేసుకోబోయే దంపతుల జీవన శైలి నిర్ణయించారు.

‘నచేచ్ఛు భయు తేనితః’ అని వున్న కారణంగా శుభ గ్రహముల వీక్షణ లేదా శుభ గ్రహముల కలయిక ఉంటే కుజదోషం ఉండదు.

శుభ గ్రహముల కలయిక అంటే శుభ గ్రహములతో 12 డిగ్రీలలోపు కలయిక ఉండాలి. 12 డిగ్రీలు దాటిన తరువాత శుభ గ్రహం ఉంటే ఉపయోగం ఉండదు.

ద్వితీయే భౌమదోషన్తు యుగ్న కన్యక యోర్వినా అని చెప్పిన శ్లోకం దేద కేరళ గ్రంథము నుండి పరిశీలిస్తే మిధున కన్యా లగ్నములలో పుట్టిన వారికి రెండవ ఇంటిలో కుజుడు ఉంటే దోషం ఉండదు. మిధున లగ్నానికి కుజుడు ఆరవ శత్రు,ఋణ సహజ కారకాధిపతిగా ఉండటం వలన,కన్యా లగ్నానికి కుజుడు మూడవ సహజ సోదర కారకాధిపతి కావటం వలన ఈ రెండు లగ్నాల వాళ్ళకు కుజదోషం వర్తించదు.

వృషభం పుట్టిన వారికి పన్నెండవ ఇంట కుజుడు స్వక్షేత్రంలో ఉంటే కుజదోషం ఉండదు.

మేష వృశ్చిక లో కుజుడు స్వక్షేత్రంలో వున్న దోషం ఉండదు.

మకర కుంభ లగ్నంలో పుట్టిన వారికి సప్తమంలో కుజుడు వున్న దోషం ఉండదు.మకరం కుజుడికి ఉచ్చస్ధానం,కుంభ లగ్నానికి తృతీయ సహజ కారకత్వం వల్ల దోషం ఉండదు.

ధనస్సు మీన లగ్నంలో పుట్టిన వారికి అష్టమంలో కుజుడు వున్న దోషం ఉండదు. ఈ రెండు లగ్నాలకి కుజుడు యోగకారకుడు.

సింహం లగ్నములో పుట్టిన వారికి కుజదోషం ఉండదు అని దేవకేరళ అనే గ్రంథమందలి విశేషం. సింహలగ్నానికి కుజుడు యోగా కారకుడు కావటం వలన కుజదోషం ఉండదు.

మేష వృశ్చికములు కుజుడికి స్వక్షేత్రములు. మకరము ఉచ్ఛ కనుక ఈ లగ్నములలో పుట్టిన వారికి కుజదోషం ఉండదు. మృగశి, ధనిష్ఠ, చిత్త నక్షత్రములు కుజ ఆధిపత్యం వున్న నక్షత్రములు అందువలన ఈ నక్షత్రములలో పుట్టిన వారికి కుజదోషం ఉండదు.

పుట్టిన సమయానికి కుజదశ వెళ్లిపోయినా వైవాహిక జీవిత కాలంలో కుజ మహాదశ రాదు అనినా కుజదోషం పరిధిలోకి తీసుకోనవసరం లేదు.

చంద్ర మంగళ సంయోగంతో కుజదోషం ఉండదు. గురు మంగళ సంయోగంతో కుజదోషం ఉండదు. కుజుడు నీచంలో ఉంటే కుజదోషం ప్రభావం అతితక్కువ.

కుజుడు దోషంగా ఉంటే పెళ్లి కాకుండా చేయడు. కలహకారుడు కుజుడు. వైవాహిక జీవితంలో కలహాలు తెస్తాడు. కళత్ర కారకుడు శుక్రుడు. కలహకారుడు కుజుడు పది డిగ్రీలలో కలిస్తే కుజదోషం ఉండదు కానీ అటువంటి జాతకులకు వైవాహిక జీవితంలో కలహ కాపురం తప్పదు. ఒకవేళ వివాహమైన తరువాత ఒకరి జాతకంలో కుజదోషం ఉండి మరొకరి విషయంగా కుజదోషం లలేకపోతే వారు సుబ్రహ్మణ్య ఆరాధనలు నిత్యం చేస్తే కుజదోష ప్రభావం తట్టుకునే శక్తి వస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...