10, డిసెంబర్ 2013, మంగళవారం

గోరోచనం


ఒక ప్రసిద్ధమైన, అధ్బుతమైన పూజా ద్రవ్యం గోరోచనం. ఇది గోవు పిత్తమని కొందరు, గోవు శిరస్సు నుండి లభిస్తుందని మరికొందరు భావిస్తారు.

అనేక సాధనా ప్రయోగాల్లో దీనిని వినియోగిస్తారు. ఇది అత్యంత శక్తివంతమైనది. పవిత్రమైనదిగా సాధకులు భావిస్తారు. ఈ కారణంగా ఇది కస్తూరి వంటి పూజా ద్రవ్యాల జాబితాలోకి చేరింది. దుర్లభమైన వస్తువు.పూజాదికాలాల్లో, యంత్ర-తంత్ర కార్యాల్లో గోరోచనానికి ఉన్నత స్థానం లభించింది. దీని పొడితో అనేక పవిత్రమైన, శక్తివంతమైన యంత్రాలను రచిస్తారు. తాంత్రిక గ్రంధాల్లో దీనికి అనేక పేర్లున్నాయి. అన్ని వేళలా శుభాన్ని కలిగించే శివునిలా ప్రతిభావంతమైన గోరోచనాన్ని "శివా" అంటారు. మంగళకరమైనది, అశుభాలను దూరం చేస్తుంది.

గోరోచనానికి మరొక పేరు "వందనీయ", కారణం - పూజ, అర్చనాదుల్లో ఆరాధ్యదైవానికి సమర్పించటమే. తిలకథారణకు, లేపనాలకు గోరోచనం శ్రేష్టమైనది. శ్రీకృష్ణ భగవానుడు అమిత ఇష్టంతో గోరోచనాన్ని తిలకంగా ధరించేవాడు.

మేధాశక్తిని వృద్ధి చేసే గుణ కారణంగా "మేధ" అని గోరోచనాన్ని పిలుస్తారు. దీనిలో ఔషధ గుణాలు ఉండటంతో ముఖ్యమైన ఔషధంగానూ భావిస్తారు. గోరోచనం ఉన్న చోట దైవిక శక్తి నిలిచి ఉంటుంది.వాయుదోషాలు, అకాల మృత్యువు బారిన పడిన దీన దరిద్ర ప్రాణుల ఆత్మలు - ఇవన్నీ గోరోచన ప్రభావంతో దాని వాసన, రంగు స్పర్శ, దర్శనంతో దూరంగా పారిపోతాయి.

గోరోచనానికి దాని గుణం ఆధారంగా అనేక పేర్లున్నాయి. యంత్ర-తంత్ర సాధనాల్లో, యంత్రలేఖనంలో, వశీకరణ తిలక రచనలో షట్కర్మ, దశకర్మల అనేక ప్రయోగాల్లోనూ, అనేక ఔషధాల్లోనూ ఉపయోగిస్తారు. దీనిని యంత్ర రచనకై అష్టగంధ్సిరాలో కూడా ఉపయోగిస్తారు.

ఏ అష్టగంథంలో గోరోచనం ఉపయోగిస్తారో, దానితో రాసిన యంత్రం శక్తివంతమైనదిగా ఉంటుంది. కాని, ఈ లాభం గోరోచనం శుద్ధమైనది, అసలైంది అయితేనే కలుగుతుంది. శుద్ధమైన గోరోచనాన్ని విధివిధాన యుక్తంగా ఉపయోగిస్తే ఉద్దేశాలు సఫలం కాకపోవటం అంటూ ఉండదు. శ్రద్ధ, సంయమనం, నియమం, ధైర్యం ఈ ప్రత్యేక సాధనకు అవసరం.

రవి పుష్య లేక గురుపుష్య యోగం రోజున శుద్ధమైన గోరోచనాన్ని తెచ్చి, ధూప దీపాలను సమర్పించి, ఇష్టదెవతా మంత్రంతో అభిమంత్రించి వెండి లేక బంగారు తాయెత్తులో నింపాలి. ఈ తాయెత్తును మెడ, భుజం లేక నడుముకు ధరించాలి. ధరించకపోయినా, దీనిని ఇంట్లో ఎక్కడైనా సురక్షితంగా ఉంచినా దీని ప్రభావం పనిచేస్తుంది. ఈ తాయెత్తు ఉన్న చోట అమంగళాలు, దుష్ప్రభావాలు నశిస్తాయి. మంగళ మయ వాతావరణానికి శుభఫలితాలనుప్రసాదించేటంత శక్తివంతమైనది.

ప్రతి వ్యక్తీ నవగ్రహాల ప్రభావంతొ పోషింపబడటం, పీడింపబడటం జరుగుతూ ఉంటుంది. శని, కుజ, సూర్య, రాహు, కేతువులను క్రూర, కఠోర, కష్టాలను కలిగించే గ్రహాలుగా భావిస్తారు. చంద్ర, బుధ, గురు, శుక్ర, గ్రహాలను సౌమ్య శుభప్రధమైన గ్రహాలుగా భావిస్తారు. కాని పరిశీలించి చూస్తే స్థితిని, సమయాన్ని అనుసరించి ప్రతి ఒక్క గ్రహం శుభాశుభ ఫలితాలను ప్రసాదిస్తాయని తెలుస్తుంది.

గోరోచనంలో నవగ్రహ దోష నివారణ శక్తి విహితమై ఉంది. ఇందువల్ల సాధకులు రవిపుష్య యోగంలో ఒక గ్రాము గోరోచనాన్ని గంగాజలంతో స్పృశింపజేసి, ధూపదీపాలను సమర్పించి, దానిలో ఒక భాగాన్ని వెండి తాయెత్తులో ఉంచి, రెండవ భాగాన్నికొత్త భరిణలో ఉంచి, స్నానం చేశాక మంచి నీటిలో కలిపి చందనంలా నుదుటిపై బొట్టుగా ధరించాలి. తాయెత్తును మెడలో లేదా భుజానికి ధరించాలి. ఇలా చేయటంవల్ల నవగ్రహం ప్రతికూలత నుండి విముక్తి లభిస్తుంది.

గురుపుష్య యోగం రోజున స్నానాదులు పూర్తి చెసి భోజపత్రంపై గోరోచన లేపనంతో ద్రాక్షఫలం ఉపయోగించి "హ్రీ" అని రాయాలి. దానికి ధూపాన్ని సమర్పించి, ఇష్టదైవాన్ని, శివుడిని లేదా దుర్గా దేవిని స్తుతిస్తూ భోజ పత్రాన్ని ఎర్రటి వస్త్రంలో కట్టి, వెండి లేదా రాగి తాయెత్తులో ఉంచాలి. దీనికి రోగికి ధరింపజేయాలి. దీర్ఘకాల అనారోగ్యాలనుండి విముక్తి కలుగుతుంది.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...