9, డిసెంబర్ 2013, సోమవారం

గోముఖ శంఖం

గోముఖ శంఖం సముద్రంలో లభించే అత్యంత అరుదైన శంఖం............

గోముఖ శంఖం సముద్రంలో లభించే అత్యంత అరుదుగా లభ్యమయ్యే అత్యాదునికమైన సముద్రపు నత్త పురుగు ద్వారా ఉత్పత్తి అయ్యే శంఖు జాతికి చెందినది.గోవు ముఖాకృతిని కలిగి వుండటం చేత ఈ శంఖుని గోముఖ శంఖం అంటారు.



గోముఖశంఖం గోమాతయైన కామదేను స్వరూపం.శివలింగాన్ని గాని, శివపార్వతులను పూజించేటప్పుడు తప్పనిసరిగా గోముఖ శంఖాన్ని శివుని పాదాల దగ్గర ఉంచి స్వచ్చమైన పూలతో అలంకరించి పూజ చేసిన వారికి గోమాతను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది.

శివలింగాన్ని గాని ఇతర దేవతామూర్తుల విగ్రహాలను పూజించటానికి సర్వసాధారణంగా ధక్షిణావృత శంఖాన్ని వాడతారు.కానీ అంతకంటే ఎక్కువ పవిత్రమైనది ఈ గోవు ముఖాకృతి కలిగిన కామధేను స్వరూపమైన గోముఖ శంఖం.ఈ గోముఖ శంఖం అత్యంత అరుదుగా లభించటం వలన దీని యొక్క ప్రాముఖ్యత అందరికి తెలియదు.

గోముఖ శంఖాన్ని ముందుగా పరిశుభ్రమైన గంగాజలంతో గాని,పసుపు నీళ్ళతో గాని శుభ్రపరిచి శివలింగం వద్ద ఉంచి స్వచ్చమైన పూలతో అలంకరించి పూజ చేస్తే గోమాతను పూజించిన పుణ్యఫలం దక్కుతుంది.

గోముఖ శంఖంతో శివలింగాన్నిగాని,ఇతర దేవతావిగ్రహాలను అభిషేకించి పూజించవచ్చును.గోముఖశంఖంలో నీటిని ఉంచి ప్రతిరోజు స్వీకరించుట చాలా మంచిది.

గోముఖ శంఖాన్ని పూజించిన వారికి మనస్సు లో కోరుకున్న కోరికలు ఆచరణలోకి వస్తాయి.

గోముఖశంఖాన్ని పూజించిన,అభిషేకించిన నీటిని స్వీకరించిన వారికి శయ్యాసౌఖ్యం కలుగుతుంది.

గోముఖశంఖంలో ఉంచిన నీటిని తాగిన వారు చక్కటి తడబాటు లేని వాక్చాతుర్యం ,సత్యభాషణ చేయువారుగాను,మృధుభాషి గాను వ్యవహరించగలరు.

గోముఖశంఖాన్ని ఇంటిలో ఉంచి పూజించినవారికి ఎల్లప్పుడు ధనధాన్యాభివృద్ది కలుగుతాయి.

గోముఖశంఖాన్ని షాపులో ఉంచుకొని పూజించిన వారికి నిత్య వ్యాపార,ధనాభివృద్ది కలుగుతాయి.

గోముఖ శంఖాన్ని పూజించిన వారికి వివాహంలో కలిగే ఆటంకాలను నివారించవచ్చును.అంతేకాక వైవాహిక జీవితంలో కలిగే ఇబ్బందులు తొలిగిపోతాయి.

దీర్ఘకాలంగా అనారోగ్యంగా ఉన్నవారు గోముఖశంఖంలో ఉంచిన నీటిని తాగిన త్వరితగతిన రోగం నయం కావటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

మర్మాంగవిషయ పరిజ్ఞానం,అతిసూక్ష్మ పరిశీలన విద్యాయైన జోతిష్యవిద్యను గోముఖశంఖాన్ని పూజించిన,అభిషేకించిన నీటిని స్వీకరించిన వారికి ఆయా శాస్త్రాలపై పట్టు సాధించగలరు.

వాక్చాతుర్యం కలిగిన బ్రాహ్మణులు,అష్టావధానులు,శతావదానులు తప్పనిసరిగా గోముఖ శంఖాన్ని పూజించిన చక్కటి వాక్శుద్ధి కలిగి పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు.

జాతకచక్రంలోని గురువు,శుక్రగ్రహాదోషాలు వున్నవారు తప్పనిసరిగా గోముఖశంఖాన్ని పూజచేస్తు ,శంఖంలోని నీటిని స్వీకరించిన గ్రహాభాదలనుండి నివారించబడతారు.

3 కామెంట్‌లు:

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...