12, ఆగస్టు 2013, సోమవారం

గణేష్ శంఖము(Ganesh sanku)

గణేష్ శంఖము
            గణేష్ శంఖం సముద్రంలో దొరికే శంఖం జాతికి చెందినది.గణేష్ శంఖం గణపతి ఆకారాన్ని కలిగి ఉంటుంది.గణేష్ శంఖాన్ని వినాయకచవితి నాడు గాని ,బుదవారం గాని,గురువారం రోజు గాని పూజించటం చాలా మంచిది.గణేష్ శంఖం వినాయక స్వరూపంగా పూజించి శంఖ తీర్ధాన్ని సేవిస్తే చాలా మంచిది.
పూజావిధానం :- గణేష్ శంఖాన్ని బుదవారం రోజు గాని ,గురువారం రోజుగాని ,పూజామందిరంలో బియ్యం పైన గాని,పసుపు మీదగాని ,గణపతి యంత్రం మీదగాని ,రిక మీదగాని, లక్ష్మీ పిరమిడ్ లో గాని ఉంచి వినాయక మంత్రాన్ని జపించాలి.శంఖంతో నీటిని తీసుకొని విగ్రహాలకైనా అభిషేకం చేయవచ్చును.
ఉపయోగాలు:- గణేష్ శంఖాన్ని ఎవరైతే నిత్యం పూజాచేస్తే ఎటువంటి పనినైనా ఆటంకాలు లేకుండ కార్యాన్ని సాదించుకోవచ్చు.ప్రతి పనిలో విజయం సాదించవచ్చును.
గణేష్ శంఖం ఇంట్లో ఉన్నవారికి ఎటువంటి దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు.నరదృష్టి ప్రభావాలు ఉండవు.
గణేష్ శంఖాన్ని విద్యనభ్యసించే  వారు ,విద్యలో ఆటంకాలు ఉన్నవారు తప్పకుండ పూజించాలి. బుద్ది వికాసాన్ని కలిగిస్తుంది.వివేకాన్ని కలిగిస్తుంది.మెమరీ పవర్ పెంచుతుంది.
గణేష్ శంఖాన్ని జాతకచక్రంలో కేతుగ్రహా దోషాలు ఉన్నవారు తప్పక పూజించాలి.జాతకచక్రంలో కేతువు పంచమభావంలో గాని ,సప్తమభావంలో గాని ,చతుర్ధభావంలో గాని ,లగ్నభావంలో గాని ఉన్నప్పుడు శంఖాన్ని తప్పక పూజించాలి.
గణేష్ శంఖంతో నీటిని త్రాగిన వ్యక్తులు చెడు వ్యసనాలకు(తాగుడు,జూదం) క్రమక్రమంగా దూరం అవుతారు.చెడుకలలు,వికృత చేష్టలు నివారించబడతాయి.
జాతకచక్రంలో పడవ స్థానంలో కేతువు శత్రుక్షేత్రాలలో ఉంటే వృత్తిలో స్థిరత్వం ఉండదు.అలాంటి వారు గణేష్ శంఖాన్ని పూజిస్తే వృత్తిలో స్థిరత్వం ఉంటుంది.
గృహ నిర్మాణానికి ముందు గాని,వ్యాపార,విద్యా ఆరంభానికి ముందు గణేష్ శంఖు పూజ చేసినట్టైతే గృహ నిర్మాణంలో,వ్యాపారంలో గాని,విద్యలో గాని ఎటువంటి ఆటంకాలు ఉండవు.
జాతకంలో కాలసర్పదోషం,నాగదోషం ఉన్నవారు గణేశ్ శంఖుని పూజిస్తే చాలా మంచిది.
ఇంటిలో ఈశాన్య దిక్కు దోషం ఉన్నవారు గణేష్ శంఖుని పూజామందిరంలో ఉంచుకొని పూజిస్తే వాస్తుదోషాలు తొలగిపోతాయి.

.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...