5, ఆగస్టు 2013, సోమవారం

దక్షిణావృత శంఖం

దక్షిణావృత శంఖం లక్ష్మీదేవి స్వరూపం....

శంఖే చంద్ర మావాహయామి
కుక్షే వరుణ మావాహయామి
మూలే పృధ్వీ మావాహయామి
ధారాయాం సర్వతీర్థ మావాహయామి

దక్షిణావృత శంఖం సంపదలకు ప్రతీక ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదుల యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్ఠాలు మాయమైపోతాయి. సౌభాగ్యాల పంట దక్కుతుంది. ఇందువల్లనే భారతీయ సంస్కృతిలో దీనికి ప్రత్యేకమైన స్థానం కలదు. మందిరాలలోనూ శుభకార్యాలలోనూ శోభను పెంచుతుంది. 


దక్షిణావృత శంఖం పుట్టుక సముద్ర మధనంలో జరిగిందని చెబుతారు. సముద్ర మధనంలో వచ్చిన పదనాలుగు రత్నాలలోదక్షిణావృత శంఖం ఒకటి .విష్ణు పురాణం ప్రకారం దక్షిణావృత శంఖం లక్ష్మి సముద్రతనయ అయివున్నది.

దక్షిణావృత శంఖం లక్ష్మికి సోదరి, సోదరుడు కూడాను.ఈమె లక్ష్మికి వారసురాలు, నవనిధులలో అష్టసిద్ధులలో దీనికి ఉపయోగిస్తారు. దీపావళి రోజున దక్షిణావృత శంఖాన్నిపూజ, ఆరాధన, అనుష్ఠాలలో, హారతిలో, యజ్ఞాలలో, తాంత్రికక్రియలలో దీనిని ఉపయోగిస్తారు. దక్షిణావృతశంఖాన్ని తూర్పు ముఖంగా ఉండి అభిషేకం చేసినప్పుడు కుడి ప్రక్కన అనగా దక్షిణం వైపు కడుపు (ఆవృతం) ఉంటంది కాబట్టి ఈ శంఖానికి దక్షిణావృతశంఖం అంటారు.దక్షిణావృత శంఖాలలో తెలుపు రంగులో ఉన్నవి శ్రేష్టం.ఎరుపు రంగు గీతలతో ఉన్న శంఖాలను కూడ పూజిస్తారు.

దక్షిణావృత శంఖాన్ని దీపావళి,అక్షయ తృతియ మరియు శుక్రవారం రోజు పూజిస్తే ఉత్తమ ఫలితాలు సాదించవచ్చు.దక్షిణావృత శంఖాన్ని పూజామందిరంలో ఎర్రని వస్త్రంపైనగాని,బియ్యం పైనగాని,కుంకుమ పైన గాని,కూర్మ స్టాండ్ పైనగాని ఉంచి లలిత సహస్త్రనామంగాని,లక్ష్మీ అష్టోత్తరం గాని చదువుతు పూజచేయాలి.ఇంకా శంఖంతో విగ్రహాలను అభిషేకించవచ్చును

." సముద్రతనయాయ విద్మహే శంఖరాజాయ ధీమహీ తన్నో శంఖప్రచోదయాత్‌ "అనే మంత్రం గాని "ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయ దక్షిణావృత శంఖాయనమః" అను మంత్రాన్ని 108 సార్లు పఠించాలి.

ఆయుర్వేదరీత్యా దీనిలో మంచి గుణాలు వున్నాయి. పురాతన కాలంలో ప్రతి ఇంటిలోనూ దక్షిణావృత శంఖాన్ని స్థాపించి ఆరాధించేవారు. కూర్మ పీఠం మీద ఎరుపు పట్టు వస్త్రాన్ని వేసి దక్షిణావృత శంఖాన్ని స్థాపించి, దేవతగా భావించి పూజించేవారు. ఈ పూజలు వల్ల వాళ్లకు ఎంతో అభివృద్ధికల్గేది.శంఖం సాధకుని మనోవాంఛలను పూర్తి చేయును. సుఖ సంతోషాలను కలగజేస్తుంది.

దక్షిణావృత శంఖం విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్ఠలకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీక, శంఖాన్ని శివపూజకు, పూజనందు ఆరతి ఇచ్చేటప్పుడు ధార్మిక ఉత్సవాలలో యజ్ఞాలలో రాజ్యాభిషేకాలకు, శుభ సందర్భాలలోనూ, పితృదేవతలకు తర్పణలు ఇచ్చేటప్పుడు మరియు దీపావళి, హోళి, మహాశివరాత్రి, విశిష్టమైన ఖర్మకాండలలో శంఖాన్ని స్థాపించి పూజిస్తారు.రుద్రపూజకు, లక్ష్మీదేవి పూజకు, దేవిపూజకు, విష్ణుపూజకు దీనిని ఉపయోగిస్తారు.

దక్షిణావృత శంఖాన్ని గంగాజలం, పాలు, తేనె, నేయితోను, బెల్లంతోను, అభిషేకిస్తూ వుంటారు. దక్షిణావృత శంఖాన్ని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు.దక్షిణావృత శంఖాన్ని పూజించటం వల్ల వాస్తుదోషాలు పోతాయి. వాస్తుదోషం పోవడానికి ఎర్ర ఆవుపాలతో దక్షిణావృత శంఖాన్ని నింపి ఇల్లు అంతా చల్లుతారు. ఇంటి సభ్యులు అంతా సేవిస్తారు. ఇలా చేయడం వల్ల అసాధ్య రోగాలు, దు:ఖాలు దౌర్భాగ్యం దూరమవుతాయి.దక్షిణావృత శంఖాలు వున్న చోట నుండి లక్ష్మి తరలిపోదు.

ఋషి శృంగుడు చెప్పిన విధానం ప్రకారం చంటి పిల్లలకు దక్షిణావృత శంఖంలో నింపిన నీరును త్రాగించినట్లయితే పిల్లలు ఆరోగ్యవంతులు అవుతారు.శంఖాలు చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకార నాధం వినిపిస్తుంది. శంఖాలు వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగుచున్నవి. శంఖము పాపనాశిని ప్రతి ఇంటిలోను శంఖము వుండవలసిన వస్తువు శంఖము వున్న ఇల్లు లక్ష్మీ నివాసము.

దక్షిణావృతశంఖం ప్రత్యేకంగా జాతకచక్రంలో గల శుక్రగ్రహాదోషాలు పోగొడుతుంది.దక్షిణావృత శంఖంలో నీరు నింపి సంతానం లేని దంపతులు ఆ నీటిని తాగినచో సంతానయోగం కలుగుతుంది.దక్షిణావృత శంఖంలో నీరు నింపి తలపై రోజు చల్లుకుంటే పాపాలు,రోగాలు,కష్టాలు తొలిగిపోతాయి.దక్షిణావృతశంఖం ప్రత్యేకంగా జాతకచక్రంలో గల శుక్రగ్రహాదోషాలు పోగొడుతుంది.దక్షిణావృతశంఖంలో నీటిని ఉంచి త్రాగటం వలన దీర్ఘకాలిక రోగాలు నశిస్తాయి.

దక్షిణావృతశంఖంతో పూజచేసెవారికి సరియైన సమయంలో వివాహం జరుగుతుంది.అంతేకాక వివాహ అనంతరం దాంపత్య జీవితంలో ఎటువంటి కలతలు ఉండవు.
దక్షిణావృతశంఖం ఇంటిలో ఉన్నవారికి ధనాభివృద్ది ఉంటుంది.దక్షిణావృతశంఖం వ్యాపారస్ధలంలో ఉంచిన వ్యాపారాభివృద్ధితో పాటు ధనాభివృద్ధి కలుగుతుంది. శంఖం సంపదలకు ప్రతీక ఈ పవిత్రమైన వస్తువులను పూజా గదుల యందు వుంచినట్లు అయితే అన్ని అరిష్ఠాలు మాయమైపోతాయి. సౌభాగ్యాల పంట దక్కుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...