10, అక్టోబర్ 2012, బుధవారం

చంద్రకళ రుద్రాక్ష కవచం

చంద్ర కళ రుధ్రాక్ష మాల
                   చంద్ర కళ రుధ్రాక్ష మాలలో 9 ద్విముఖి రుధ్రాక్షలు కలిగి ఉంటుంది.జాతకచక్రంలో చంద్రుడు అనుకూలంగా లేనివారు ఈ చంద్రకళ మాలను ధరిస్తే చంద్రగ్రహా దోషాలను నివారించుకోవచ్చును.
              చంద్ర గ్రహా  దోషాలు గలవారు జీవితంలో ఒడుదుడుకులు అనుభవిస్తారు.అమావాస్య ,పౌర్ణమి రోజులలో మానసిక ఒత్తిడికి లోనవుతారు.ఉద్రేక స్వభావాలు కలిగి ఉంటారు.మనస్సు స్ధిరంగా లేక చంచలత్వం కలిగి ఉంటారు.

                  చంద్రకళ రుధ్రాక్ష మాలను ధరించటం వలన కళలలలో ప్రావీణ్యం సంపాదిస్తారు.దృష్టి దోషాలు నివారించబడతాయి.చక్కటి వినయ విదేయతలు కలిగి ఉంటారు.క్రయ విక్రయాలందు ప్రావీణ్యం కలిగి ఉంటారు. మతిమరుపు నివారించబడుతుంది.ఉద్యోగంలో గౌరవాలు పొందుతారు.కవులు,గాయకులు,సంగీత విద్వాంసులు వారి వారి కళలయందు నైపుణ్యం కలిగి ఉంటారు.
                  చంద్రకళ రుధ్రాక్ష మాలను ధరించటం వలన జల రోగాలు నివారించబడతాయి.నూతన విషయాలను,మార్గాలను అన్వేషిస్తారు. పిరికితనం నశిస్తుంది.ఎటువంటి మనిషినైన మాటలతో మెస్మరైజ్ (ఆకట్టుకోవటం) చేయగలరు.హోటల్,వాటర్ షాప్,కూల్డ్రింక్స్,వస్త్ర,దాన్యం మొదలగు వృత్తులు చేసేవారు,పెద్ద పెద్ద కన్ స్ట్రక్షన్స్ చేసేవారు,మహిళా సంఘాల వారు,వ్యవసాయం చేసేవారు,వాటర్ ప్లాంట్ లు కలిగినవారు తప్పక ధరించవలెను.మంత్రోపాసన చేసేవారు ధరించవచ్చును.    
              

2 కామెంట్‌లు:

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...