27, ఫిబ్రవరి 2015, శుక్రవారం

త్రిజ్యేష్ఠా

త్రిజ్యేష్ఠా అంటే ఏమిటి........

త్రిజ్యేష్ఠ అనే అంశంలో నుండి ప్రారంభమైంది ఈ జ్యేష్ఠ మాసం జ్యేష్ఠుడి పెళ్లి అనే అంశం.
అయితే ముహూర్తాల విషయంలో వివాహం జ్యేష్ఠ మాసంలో శుభప్రదము అని చెప్పారు. 


‘మాఘ ఫాల్గుణ వైశాఖా జ్యేష్ఠ మాసాశ్శుభప్రదా’ అని జ్యేష్ఠ మాసం విశేషంగా చెప్పారు. అందునా మరొక విశేషం ఏమిటి చెప్పారు అంటే ‘జ్యేష్ఠమాసి కరగ్రహో నశుభకృత్ జ్యేష్ఠాంగనా పుత్రయో’ అని వున్నది. అనగా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠులుగా పుట్టిన వధూవరులకు వివాహం చేయరాదు అని. 

ఈ మధ్యకాలంలో జ్యేష్ఠ మాసంలో పెళ్లి అనే విషయం ప్రస్తావనకు వస్తే మా అబ్బాయి ఇంటిలో పెద్దవాడు కావున జ్యేష్ఠ మాసంలో వివాహం చేయము అనేవారు. జ్యేష్ఠ మాసంలో వివాహం చేయవద్దని చెప్పేవారు ఎక్కువయ్యారు. 

అరుంధతి నక్షత్రం

అరుంధతి నక్షత్రం......

అరుంధతి జన్మవృత్తాంతం శివపురాణంలోనూ, భాగవత పురాణంలోనూ కనిపిస్తుంది.

"అరుంధత్యనసూయా చ సావిత్రీ జానకీసతి
తేజస్వనీ చ పాంచాలీ వందనీయ నిరంతరం"

అరుంధతి, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది - ఈ అయిదుగురు స్త్రీలు సదా వందనీయులని పై శ్లోకానికి అర్థం.

గ్రహాలు - హోరఫలాలు

గ్రహాలు - హోరఫలాలు.........

ప్రతిదినం సూర్యోదయ సూర్యాస్తమయ కాలాన్ని బట్టి ఒక గంటకాలం కలుపు కొని ఫలం చూడాలి. సూర్యోదయ సూర్యాస్త మయ మధ్యకాలాన్ని 12 చే భాగించగా ఎంతకాలం (టైమ్‌) వచ్చునో చూసుకుంటూ 12 కాలాలు చూసి ఫలాన్ని తెలుసుకోవాలి. అలాగే రాత్రి కాలం - ఫలాన్ని చూసుకోవాలి. ఈ హోరాకాలం ఆపద అనే సముద్రాన్ని దాటించే పడవ వంటిది.

ప్రయాణకాలంలో మంత్రిలాగా ఆలోచనలను తెలుపుతుంది. దీనికి మించిన శాస్తమ్రే లేదంటారు పెద్దలు. ప్రతిరోజు దీన్ని చూసి ప్రయాణించ డం సమస్త కార్యాలు చేయడం శుభం. శుభగ్రహ హోరలు శుభాన్ని, పాప గ్రహ హోరలు పాపఫలాన్ని ఇస్తాయి.

గజకేసరీ యోగం

గజకేసరీ యోగం అంటే ఏమిటి?

గజము అంటే ఏనుగు. కేసరీ అంటే సింహం. యోగం అంటే కలయిక. ఏనుగు సింహములు కలిసి ఉండటం అంటే జరిగే పని కాదు.

కలిసినప్పుడు యుద్ధం తప్పదు. కానీ ఏనుగు సింహములను ఒకచోట వుంచి సమాధానపరచగలిగిన స్థాయి సమన్వయకర్తగా ఈ యోగ జాతకులు ఉంటారు అని ఈ పేరు యోగమునకు పెట్టారేమో అని అనిపిస్తోంది. అయితే ‘గజకేసరీ సంజాతస్తేజస్వీ ధనవాన్ భవేత్ మేధావీ గుణసంపన్నో రాజాప్రియకరో నరః’ అని ఫలితం చెప్పారు.

18, ఫిబ్రవరి 2015, బుధవారం

శంఖమాల(Sanka Mala)

బార్యా భర్తల మద్య అన్యోన్యతకు శంఖమాల......

శ్రీ మహాలక్ష్మీకి అత్యంత ప్రీతికరమైన వస్తువులలో శంఖం ఒకటి.శంఖాలను లక్ష్మీదేవి సోదరులగా భావిస్తారు.లక్ష్మీదేవి క్షీర సముద్ర రాజ తనయ .అంటే పాలకడలి లో జన్మించింది.శంఖం ఉన్నచోట తాను ఉంటాను అని విష్ణుమూర్తితో అంటుంది.

"వాసామి పద్మోత్పల శంఖ మధ్యే ,వాసామి చందేచా మహేశ్వరేచ " పద్మాలు,శంఖాలు ఉండేచోట ,చంద్రుడు,శివుడు ఉండే చోట ఉంటాను అని లక్ష్మీదేవి చెబుతుంది.శంఖం గురుంచి వేదాలలో "శంఖేవ హత్య రాక్షసః" శంఖం వలన రాక్షసులు నశిస్తారు.అని అదర్వణ వేదంలో ఉంటుంది.

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...