కేతుగ్రహ దోష నివారణకు వక్క గణపతి
కేతువు జాతకంలో బలీహనంగా ఉన్నట్లయి తే... మానసిక బలహీనతలు, అతిభక్తి, జీవి తంపై విరక్తి, ఏకాంతంగా ఉండాలనే కోరిక, లేనివి ఉన్నట్టు ఊహించుకోవడం, తనలో తా నే మాట్లాడుకోవడం, తనను తాను చాలా గొ ప్పవాడిగా లేదా దేవుడు, దేవతగా ఊహించు కోవడం, దేన్ని చూసినా భయపడడం, ఉద్యో గం, భార్యాపిల్లలను వదిలివేసి దేశసంచారం చేయడం, పిచ్చివానిలా ప్రవర్తించడం, విచిత్ర వేషధారణ, సంతానం కలుగకపోవడం, గర్భం వచ్చి పోవడం, చిన్న పిల్లలకు తీవ్ర అనారో గ్యం, చదువులో ఆటంకాలు,అంటువ్యాధులు, వైద్యులు కూడా గుర్తిం చలేని రోగాలు కేతుగ్రహ దోషం వల్ల కలుగు ను.
కేతువు ద్వాదశ భావంలో ఉంటే బాలారిష్ట దోషం.పంచమంలో ఉంటే సంతాన సమస్యలు,చతుర్దంలో బలహీనంగా ఉంటే విద్యా సమస్యలు,ఇలా కేతుగ్రహ సమస్యలు ఉన్నవారు వక్క గణపతిని పూజిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చును.