17, సెప్టెంబర్ 2018, సోమవారం

కన్యారాశి, కన్యా లగ్నంలో జన్మించిన వారికి అదృష్ట రుద్రాక్ష కవచం.

కన్యారాశి, కన్యా లగ్నంలో జన్మించిన వారికి అదృష్ట రుద్రాక్ష కవచం.

కన్యా లగ్నం, కన్యా రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్షలు చతుర్ముఖి, షణ్ముఖి, సప్తముఖి రుద్రాక్షలు. కన్యా  లగ్నానికి లగ్నాధిపతి అయిన బుధుడికి చతుర్ముఖి రుద్రాక్ష, పంచమాధిపతి అయిన శనికి సప్తముఖి రుద్రాక్ష, నవమాధిపతి అయిన శుక్రుడికి షణ్ముఖి రుద్రాక్ష అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్ష కవచం. కన్యా  లగ్నానికి లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతులు యోగ కారకులు. ఈ యోగకారకులు అస్వతంత్ర స్ధానాలలో ఉండి యోగాన్ని ఇచ్చే పరిస్ధితులు లేనప్పుడు ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని మెడలో ధరించటం వలన యోగకారక గ్రహాలు శత్రు క్షేత్రాలలో ఉన్నా యోగ ఫలాన్ని పొందవచ్చును. మొదటిసారిగా ఈ రుద్రాక్షను ధరించేటప్పుడు సోమవారం రోజు లేదా బుధవారం రోజు  శివాలయంలో అభిషేకం చేయించుకొని ధరించిన ఉత్తమ ఫలితాలు పొందవచ్చును. 


కన్యారాశి ఆకార స్వరూపాన్ని అనుసరించి సముద్రంలో తెప్పపై ఒక చేత్తో దీపం, ఒక చేత్తో సస్యమును దరించిన స్త్రీ. కన్య పుష్పవతి కాని స్త్రీ. విశేషమైన ఊహాలు, సిగ్గు, లజ్జ, బిడియం, దగ్గరకు వచ్చి మాట్లాడుటకు భయం, సభలో మాట్లాడుటకు భయం, పెద్దల అండ లేనిదే ఏ పని చేయలేరు. స్త్రీకి ఉండే వాత్సల్యం, అభిమానం, బందు ప్రేమ. తన భాధను, శ్రమను ఇతరులు గుర్తించాలనే భావం కలిగి ఉంటారు. ఈ రుద్రాక్ష కవచాన్ని ధరించిన వారికి సిగ్గు, బిడియం, భయం తగ్గి అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడటం, ఎటువంటి బెరుకు లేకుండా ప్రవర్తిస్తారు. 

కన్యారాశి మేషాదిగా ఆరవ రాశి అయినందున కృషికి తగిన ప్రతిఫలాన్ని ఆశిస్తారు. కృషికి ప్రాధాన్యత కలిగి ఉండటం చేత ప్రయోజనాన్ని, సౌకర్యాలను పొందుతారు. సమగ్రమైన వివరాలు సేకరించటంలో అనుభవం కలిగి ఉంటారు. వివిధ రీతులలో,  వివిధ పరిస్ధితులలో విషయాన్ని సేకరించగలిగే నైపుణ్యం కలిగి ఉంటారు. ప్రతి అంశాన్ని విశ్లేషణాత్మకంగా వివరించగలిగే సామర్ధ్యం కలిగి ఉంటారు. సమీక్షలు, సమావేశాలు జరిపి సమగ్రమైన నివేదిక సమర్పిస్తారు. సూక్ష్మ పరిశీలనా ఙ్ఞానాన్ని కలిగి ఉంటారు. ప్రతి అంశాన్ని, పరిస్ధితులను అంచనా వేయటం, ఖచ్చితమైన లెక్కలు వేయగలరు. కొలతలు, తూనికల పట్ల శ్రద్ధ వహిస్తారు. వ్రాయటం, లెక్కలు కట్టటం వంటి పనులపై మక్కువ. జీర్ణాశయ సమస్యలు కలిగి ఉంటారు. సూక్ష్మ పరిశీలన, అంచనా వేయగలిగే సామర్ధ్యాన్ని కలిగించటానికి ఈ రుద్రాక్ష కవచాన్ని ధరించాలి. 

వ్యవసాయం, పాడి పరిశ్రమ, తోటలు, సాధు జీవులను పోషించటం, మొక్కలు పెంచటంపై మక్కువ. అంచనా వేయగలిగే వృత్తులలో రాణిస్తారు. ఇతరులకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని కోరుకుంటారు. తొందరగా ఒక అంచనాకు రాలేరు. ద్వంద రీతిలో ఆలోచిస్తారు. ఆరోగ్య సంబంధమైన ఆహార ధాన్యాలు, తినుభండారాలు, మందులు, పారిశుద్యం, వైధ్యం మొదలగు వృత్తి ఉద్యోగాలలో రాణింపు. శ్రమ సంబందమైన హస్తకళలు, కులవృత్తులు, నేత వస్త్రాలు, కుట్టుపని, పరిశ్రమలు, సేవా కార్యక్రమాలు, యంత్ర పరికరాలు, కార్మికులు, జీతం, ఉద్యోగం మొదలగు వృత్తి ఉద్యోగాలు కన్యారాశి లక్షణాలు. వృత్తి, వ్యాపార, విద్యా రంగాలలో రాణించటానికి ఈ రుద్రాక్ష కవచం ఎంతగానో ఉపయోగపడుతుంది. 

కన్యారాశిలో జన్మించిన వారు స్వయం ప్రతిభా కలిగి ఉంటారు. ఇతరుల ప్రతిభా సామర్ధ్యాలను చక్కగా గుర్తించగలరు. ఈ పనికి ఎవరు సరైన వారో తెలివిగా నిర్ణయం చేయగలరు. గణితంలో మంచి పరిజ్ఞానం, జ్ఞాపక శక్తి, బంధుప్రీతి అధికంగా ఉంటాయి. సమస్యలు సృష్టించి పరిష్కరించినట్లుగా నటించే స్నేహితులను కలిగి ఉంటారు. ఇతర వ్యక్తుల నేర ప్రవృత్తిని ఈజీగా గుర్తించగలరు. పత్రికా రంగంలో రాణిస్తారు. రైటింగ్ వర్క్స్ లో మంచి నేర్పరులు. ప్రభుత్వ మరియు ప్రవేటు రంగాలకు సంబంధించిన స్కీములను సద్వినియోగం చేసుకోగల నేర్పు ఉంటుంది. 

ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్ధలలో ఉన్న లోపాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఈ జాతకులు మనీ రొటేషన్ చేయటంలో మంచి నేర్పు కలిగి ఉంటారు. త్వరగా ఇతరులపై నమ్మకాన్ని ఏర్పరచుకోరు. ఒకొక్కసారి వారిని నమ్మి మోసపోతారు. ఇతరుల విషయంలో  హామీలు ఉండటం, మధ్యవర్తిత్వ సంతకాలు మెదలైనవి కలసి రావు. వీలునామాల ద్వారా ఆస్తి కలసి రావటం, లిటిగేషన్ వ్యవహారాలు లాభిస్తాయి. మేధావులతోనూ, ఆధ్యాత్మిక గురువులతోనూ సన్నిహిత సంబంధాలు లాభాన్ని చేకూరుస్తాయి. అంతర్గత రాజకీయాలు ప్రతి చోట ఇబ్బంది కలిగిస్తాయి. కొంత పురోగతి సాధించిన తరువాత బయటకు పంపే ప్రయత్నాలు జరుగుతాయి. ప్రతి విషయాన్ని విశ్లేషణాత్మకంగా తీర్చిదిద్దటంలోను, ఊహాత్మకంగా విశ్లేషణ చేయటంలోను పురోగతి సాధించటానికి ఈ రుద్రాక్ష కవచాన్ని ధరించాలి. 

వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండవు. స్వయంకృతాపరాధాల వలన నష్టపోతారు. శుక్ర మహా దశ యోగిస్తుంది. మధ్యస్ధ జీవితం నుండి విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఇబ్బందుల్లో ఉన్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందుల్లో పడతారు. సంతాన పురోగతి ప్రారంభంలో ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రింటింగ్, టెండర్లు, కాంట్రాక్టులు, న్యాయ సంబంధమైన వృత్తి వ్యాపకాలు రాణింపులో ఉంటాయి. భుధ గ్రహం అనుకూలత వలన అధికార ప్రాప్తి, ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. అదే విధంగా సినిమా, చలన చిత్ర, కళా రంగాలలో అద్భుతంగా రాణిస్తారు. చెస్, క్రికెట్ మొదలైన క్రీడా రంగాల్లో మంచిగా రాణిస్తారు. బలమైన వర్గాన్ని ఏర్పరచుకుంటారు. 

కన్యా రాశి  వారు అనుకున్న కార్యక్రమాలకు, ఆశయాలకు లోబడి పనిచేసే అభిమాన వర్గం ఉంటుంది. హాస్య సంబంధమైన, అంచనాలకు సంబంధించిన రచనలు వెలుగులోకి వస్తాయి. వ్యాపార దక్షాట కలిగి ఉంటారు. వ్యాపారాన్ని అంచలంచలుగా విస్తరించే సామర్ధ్యం కలిగి ఉంటారు. జీవం లేని సంస్ధల రూపు రేఖల్ని మార్చి మంచి దారిలో పెట్టగలరు. ప్రతి విషయంలోనూ చివరి వరకు ప్రయత్నాలు కొనసాగిస్తుంటారు. కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా ఉండదు. భూములు, పెద్దలు ఇచ్చిన ఆస్ధులు అన్యాక్రాంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్ధిరాస్ధూల పరంగా కొన్ని వివాదాలు ఎదుర్కొంటారు. గృహాన్ని మనసుకు తగినట్టుగా ఏర్పరచుకుంటారు. చిట్ ఫండ్స్ వ్యవహారాల పట్ల అధిక జాగ్రత్తలు పాటించాలి.  ఊహాత్మకమైన విషయాలను ఆచరణలో పెట్టటానికి ఈ రుద్రాక్ష కవచం ఉపయోగపడుతుంది.

1 కామెంట్‌:

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...