10, ఆగస్టు 2018, శుక్రవారం

వృషభ రాశి, వృషభ లగ్నం జాతకుల “అదృష్ట రుద్రాక్ష కవచం”

వృషభ రాశి, వృషభ లగ్నం జాతకుల “అదృష్ట రుద్రాక్ష కవచం” 

వృషభ లగ్నం, వృషభ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్షలు చతుర్ముఖి,  సప్తముఖి, షణ్ముఖి రుద్రాక్షలు. వృషభ లగ్నానికి లగ్నాధిపతి అయిన శుక్రుడికి షణ్ముఖి రుద్రాక్ష, పంచమాధిపతి అయిన బుధుడికి చతుర్ముఖి రుద్రాక్ష, నవమాధిపతి అయిన శనికి సప్తముఖి రుద్రాక్ష అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్ష కవచం. వృషభ లగ్నానికి లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి యోగ కారకులు. ఈ యోగకారకులు అస్వతంత్ర స్ధానాలలో ఉండి యోగాన్ని ఇచ్చే పరిస్ధితులు లేనప్పుడు ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని మెడలో ధరించటం వలన యోగకారక గ్రహాలు శత్రు క్షేత్రాలలో ఉన్నా యోగ ఫలాన్ని పొందవచ్చును. మొదటిసారిగా ఈ రుద్రాక్షను ధరించేటప్పుడు సోమవారం రోజు గాని గురువారం రోజు గాని శివాలయంలో అభిషేకం చేయించుకొని ధరించిన ఉత్తమ ఫలితాలు పొందవచ్చును.


స్ధిరమైన అభిప్రాయాలు, సుఖ జీవనం, ఉన్న చోటును, ఇంటిని వదులుకోలేక వచ్చిన అవకాశాలు జార విడిచికొందురు. పొలం, గృహం, స్ధిరాస్తులపైనా మక్కువ చూపిస్తారు. పనులు కార్య రూపం దాల్చవలెనన్న వీరి సహాయం తీసుకొన్నచో పనులు కార్య రూపం దాల్చేదాకా నిద్రపోరు. మొండిగా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. స్ధిర సంకల్పం, దీక్ష, ఏకాగ్రత, నిగ్రహం, ఓర్పు, సుస్ధిరత, పట్టుదల, కార్యసాధన, ఆత్మ విశ్వాసం, సమర్ధత, వాగ్ధానాలు చెల్లించాలనే స్వభావం, ప్రయోజన దృష్టి కలిగి ఉంటారు. కొన్ని విషయాల పట్ల, కొన్ని పనుల విషయాలలో, కొంతమంది వ్యక్తుల పట్ల స్ధిరమైన అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. వాటిని మార్చటం కష్టం. తరచుగా మార్పులు ఇష్టపడరు.  స్ధిరాస్తులు కలిసి రావటానికి ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని మెడలో ధరించటం వలన ఉత్తమ ఫలితాలు పొందవచ్చును.
  
వృషభరాశి అంటే ఎద్దు.స్ధిరత్వం కలిగి ఉంటుంది. పోషించే స్వభావం, ఎత్తైన భుజాలు, పెరిగిన కండలు, కాంతి కల కన్నులు, విశాలమైన ముఖం, గొడ్డు చాకిరీ చేయుదురు. ఓర్పు అధికం, ఇతరుల ఆదీనంలో ఉందురు. ఇతరులకు బాగా సహాయపడతారు. వృషభరాశి మేషాది క్రమంలో రెండవ రాశి కావటం వలన ధనం కూడ బెట్టటం, కోరికలు కలిగి ఉండటం, విలువలకు ప్రాధాన్యత, ప్రయోజనాన్ని ఆశించి పెట్టుబడి పెట్టటం, కుటుంబ పరిరక్షణ మొదలగు అంశాలపై ఆసక్తి కలిగి ఉంటారు. సంపాదనను, స్ధిర, చరాస్ధులను, స్వంతమైన వస్తువులను సద్వినియోగం చేసుకొని సౌకర్యాలను, సౌఖ్యాలను అనుభవించటం చేస్తారు. ధనాన్ని, వస్తువులను, స్ధిర చరాస్ధులను భద్రంగా కాపాడుకుంటారు. సంపాదనా మార్గాలను అన్వేషిస్తారు. వృషభరాశికి అధిపతి శుక్రుడు కావటం వలన సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. సకల సౌఖ్యాలు పొందటానికి ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని ధరించాలి.

అందంగా కనపడాలనుకోవటం, ఆకర్షణగా కనపడాలనుకోవటం, అందమైన, ఆకర్షణీయమైన దుస్తులు ధరించాలని కోరుకుంటారు. ఖరీదైన ఆభరణాలపై మక్కువ కలిగి ఉంటారు. విలాస వంతమైన వస్తువులతో సౌఖ్యాలను అనుభవిస్తారు. ఖరీదైన వాహనంలో సుఖాలు కోరుకుంటారు. ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటారు. ఆకర్షణీయమైన చిత్రాలపై, ప్రకృతిపై మక్కువ. చిత్రలేఖనం, సంగీతం, పాటలు పాడటంపై ఆసక్తి కలిగిస్తుంది. బ్యాంకింగ్, వస్త్రాలు, వాహనాలు, భూ సంభంధమైన, గృహ సంభంధమైన వ్యాపారాలు లేదా ఉద్యోగాలలో రాణించే అవకాశాలు వృషభ రాశి వారికి ఉంటాయి. లలితా కళలు, భూ సంబందమైన, గృహ సంబందమైన వృత్తులలో రాణించటానికి ఈ అదృష్ట రుద్రాక్ష కవచం మంచిది. 

వృషభ రాశిలో జన్మించిన వారికి మధ్య వయస్సు నుండి జీవితం అత్యంత యోగవంతంగా ఉంటుంది. శ్రమించాల్సిన సమయంలో బద్ధకించటం వలన ఇబ్బందులు కోరి తెచ్చుకుంటారు. ఇతరుల మాటని లెక్క చేయరు. అందరి అభిప్రాయాలూ తెలుసుకొని వారి మనసుకు నచ్చింది చేస్తారు. వంశపారంపర్య ఆస్తులను వృద్ధి చేయటానికి ప్రారంభంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. పెద్దలు ఇచ్చిన ఆస్తి కన్నా అధికంగా లాభం పొందినట్టు ప్రచారం జరుగుతుంది. వీరి కుటుంబంలో తండ్రి లేక టాటా అత్యంత ప్రతిభావంతులు అయి ఉంటారు. వంశ ప్రతిష్ఠ ప్రఖ్యాతి చెంది ఉంటుంది. కుటుంబ పోషణ భారం, వంశ ప్రతిష్ఠను నిలబెట్టాల్సిన బాధ్యత అధికంగా ఉంటుంది. వ్యాపార విస్తరణలో భార్య వైపు సహాయ సహకారాలు లాభిస్తాయి. చాలా విషయాలలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. లెక్కల విషయంలో, పనుల విషయంలో, క్రమ శిక్షణ విషయంలో ఎక్కడ రాజీ పడని మనస్తత్వం. కూతురి విషయంలో విశేషమైన అభిమానం ఉంటాయి. కళా సంబంధమైన వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. కొంత కాలం కష్టాలు ఇబ్బంది పెట్టిన నిలదొక్కుకుంటారు. చాలా విషయాలలో అదృష్టానికి దగ్గరగా పిల్లల జాతకాలు నడుస్తాయి. సహచరుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. ప్రతి విజయం వెనుక ఇంకొకరి సహాయ సౌకర్యాలు ఉంటాయి. ఇతరుల నుండి వ్యతిరేకతలు, విమర్శలు, నరదృష్టి దోష నివారణకు ఈ అదృష్ట రుద్రాక్ష కవచం ఎంతగానో ఉపయోగం.

విలాసవంతమైన జీవితం చాలా కాలం గడుపుతారు. అవగాహన లేని అన్ని విషయాలలో పరిజ్ఞానం, నిపుణత కనబరుస్తారు. సలహాలు చెప్పే మేధావులుగా రాణిస్తారు. ముఖ్యమైన వ్యక్తులకు సర్వస్వం మీరే అవుతారు. ప్రారంభ జీవితాన్ని పోల్చుకుంటే సాధించిన స్ధాయి అధికంగా ఉంటుంది. వివాహం చాలా మందికి మంచి మలుపుగా మారుతుంది. ఆత్మీయ వర్గంతో, సహోద్యోగుల చెప్పు చేతల్లో నడిచే అవకాశాలు లేవు. మానసికంగా ప్రభావం చూపగలిగేది ఒక్క స్త్రీ సంతానం మాత్రమే అందులోనూ జ్యేష్ఠ కుమార్తె ప్రభావం మాత్రం అధికంగా ఉంటుంది. జీవితంలో ఆధ్యాత్మిక విషయాలు, సేవా కార్యక్రమాలు ప్రధానపాత్ర విశిస్తాయి. మాట సహాయం చేయటం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. లేని విషయాలు, నిందలు ప్రచారంలోకి వస్తాయి. సొంత విషయాలు, రహస్యాలు సొంత మనుషులు బయట పెట్టనంతవరకు ఇబ్బందులు రావు. స్ధిరమైన ఆలోచనా విధానానికి, అన్ని  విషయాలను అంచనా వేయటానికి, ప్రతి పనిలో విజయం సాదించటానికి ఈ అదృష్ట రుద్రాక్ష కవచం మంచిది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...