29, ఏప్రిల్ 2016, శుక్రవారం

హీరా శంఖు

హీరా శంఖు

"హీరా శంఖు" లు చాలా అరుదుగా లభిస్తాయి. హీరా శంఖునే ‘పహాడి శంఖు’ అని కూడా అంటారు. ఈశంఖు కొన్ని మిలియన్ సంవ త్సరాలకు శిల రూపంలోకి మారి నవరత్నాలు అంతర్గతంగా పొందు పరచనట్టుగా ఉంటుంది. హీరాశంఖు దక్షిణావృత శంఖుతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. హీరా శంఖుని పూజించే వారికి మంచి భవిష్యత్, అదృష్టం కలసి వస్తాయి. పర్వత ప్రాంతాలలో సహజసిద్ధంగా లభిస్తుంది. హీరా శంఖును పూజించిన వారికి లక్ష్మీ అనుగ్రహం తో పాటు, ఊహించనంత ఐశ్వర్యం కలుగుతాయి. ఇది పైకి కనపడటానికి సాదారణంగా ఉన్న లోపల నవరత్న కాంతులతో వజ్రం వలె సహజ సిద్ధంగా మెరుస్తూ ఉంటుంది.

పురాతన గ్రంధాల కధనం ప్రకారం ఉత్తర బారతదేశంలో గంగానది పరివాహాక ప్రాంతం నందు ఒక గ్రామంలో "హీరా ఉజ్వల" అనే పేదరిక మహిళ జీవిస్తుంది. ఆమె లక్ష్మీనారాయణలకు పరమ భక్తురాలు. ఒకసారి హీరా ఉజ్వల నివశిస్తున్న గ్రామం నందు అంతులేని అంటువ్యాది ప్రబలి గ్రామంలో వారంతా చనిపోతున్నారు. తన ఇద్దరు కుమారులు, కోడళ్ళకు కూడా ఆ అంటువ్యాది సోకింది. ఈ గ్రామానికి పూర్వ వైభవం రావాలంటే లక్ష్మీనారాయణులను కొలుస్తూ ఉపవాసం ఉండమని కలలో దివ్య వాణి పలుకుతుంది. భక్తి శ్రద్ధలతో హీరా లక్ష్మీనారాయణుల ప్రసన్నం కోసం ఉపవాస దీక్ష చేపట్టి గొప్ప తపస్సు చేయనారంభించింది.

హీరా తపస్సుకి మెచ్చిన లక్ష్మీ నారాయణులు ప్రసన్న మవుతారు. లక్ష్మీదేవి తన స్వహస్తాలతో హీరా ఉజ్వలకు శంఖాన్ని ప్రసాదిస్తుంది. ఈశంఖంలో నీటిని ఉంచి వ్యాది ప్రభలిన వారికి ఆ నీటిని ఇవ్వమని కోరుతుంది. హీరా శంఖంలో నీటిని ఉంచి అందరికి తీర్ధ ప్రసాదంగా పంచుతుంది. కొన్ని రోజులకు అంటువ్యాదులు సోకిన వారు వ్యాదులు నయం అయి ఆరోగ్యవంతులవు తారు. గ్రామంలో ప్రబలిన అంటువ్యాదులు నయం అయ్యి గ్రామం పూర్వ వైభవాన్ని సంతరించు కుంటుంది. పూర్వవైభవాన్ని చూసి ఆనందపడి హీరా తన తపస్సును కొనసాగిస్తూ ఉంటుంది.

శంఖంతో పాటు హోమాన్ని నిర్వహిస్తూ తపస్సు చేస్తున్న తరుణంలో పెద్ద పెద్ద వర్షాలు, సముద్రంలో పెద్ద పెద్ద అలలు తాకిడికి అన్నీ కొట్టుకుపోతాయి. ఒకపెద్ద అల హీరా చేస్తున్నహోమ జ్వాలను ఆర్పివేస్తుంది. తన తపస్సు భంగం కలిగే సరికి హీరా కోపంతో బాధతో సముద్రంలో నీరు లేకుండా శపిస్తుంది. సముద్రంలో ఉండే లక్ష్మీదేవి ప్రతి రూపాలు ఐన వెండి నాణేలు, దక్షిణావృత శంఖాలు నీరు లేక శిలలుగా మారిపోతాయి. వరుణ దేవుడు వాటిని కాపాడమని లక్ష్మీదేవిని కోరతాడు. అప్పుడు లక్ష్మీదేవి హీరా ఉజ్వలని శాపాన్ని వెనకకు తీసుకోమని కోరుతుంది. అప్పుడు హీరా లక్ష్మీ దేవి ఆజ్ఞని శిరసావహిస్తూ శాపాన్ని వెనకకు తీసుకుంటుంది. అప్పుడు లక్ష్మీదేవి హీరాకి ఒక వరాన్ని ప్రసాదిస్తుంది.

శిలగా మారిన శంఖాలు నీ పేరుతో పిలవబడుతూ, శాప కారణంగా బహు దుర్లభమైన శంఖంగా పూజింపబడతావు అని పలుకుతుంది. అంతేగాక హీరాశంఖును దీర్ఘకాల అనారోగ్యాలు ఉన్నవారు, అంతు బట్టని అనారోగ్యాలు ఉన్నవారు, మానసిక ప్రశాంతత లేనివారు శంఖాన్ని నీటిలో వేసుకొని ఆ నీటిని తాగిన అనారోగ్య బాధల నుండి విముక్తి కలుగుతుంది. శాప కారణంగా హీరా శంఖులు చాలా అరుదుగా, బహు దుర్లభంగా లభిస్తాయి. హీరా శంఖులు పూజా మందిరంలో అక్షయ తృతీయ రోజు గాని, శుక్రవారం రోజుగాని ప్రతిష్ఠించి గంధం, కస్తూరి, గోరోచనం, పునుగుతో శంఖాన్ని అలంకరించి పుష్పాలు, అక్షింతలు శంఖం దగ్గర ఉంచి ధూపదీప నైవేద్యాలు సమర్పించి పొంగళి నైవేద్యం చేసి స్పటికమాలతో “ఓం మహా దేవ్యేచ విద్మహే విష్ణు పత్నయచ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్” అనే మంత్రంతో 108 సార్లు పఠిస్తూ పూజ చేసిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అంతు బట్టని దీర్ఘకాల అనారోగ్యాలు సైతం నయం అవుతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...