23, మార్చి 2016, బుధవారం

కుబేర దీపం

కుబేర దీపం

జాతకచక్రంలో బుధుడు మీనరాశిలో నీచలో ఉన్న, అస్తంగత్వం చెందిన, లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న శుభగ్రహ దృష్టి లేని శత్రు స్ధానాలలో ఉన్న తెలివితేటలు తక్కువగా ఉండటం, చదువులో రాణించలేక పోవటం, వ్యాపారంలో తరచూ ఇబ్బందులు ఎదుర్కోవటం, తన మనసులోని భావాలను బయటకు వ్యక్త పరచలేక పోవటం, ఇతరుల దగ్గర ఏది మాట్లాడిన తప్పుగా అర్ధం చేసుకోవటం. బుద్ధి నిలకడ లేకపోవటం, చర్మవ్యాదులు, ఫిట్స్, నరాల బలహీనత, చెవుడు, నపుంశకత్వం, నిద్ర పట్టక పోవటం జరుగుతుంది. ఇలాంటి వారు పచ్చ కర్పూరంతో కుబేర దీపాన్ని వెలిగిస్తే బుధగ్రహ దోషాలను తొలగించుకోవచ్చును.

వాస్తు శాస్త్రం రీత్యా ఉత్తరం దిక్కు బుధుడికి చెందిన దిక్కు అని, ఉత్తరం కుబేర స్ధానంగా భావిస్తారు. ఉత్తర దిక్కు వాస్తు దోషాలు ఉన్నవారికి ఎప్పుడు చేతిలో డబ్బు నిలవక పోవటం, మానసికంగా ఎప్పుడు సమస్యలను ఎదుర్కోవటం జరుగుతుంది. డబ్బు లేక దుర్భర పరిస్ధితి అనుభవిస్తున్న వారు పచ్చ కర్పూరంతో కుబేర దీపాన్ని ఉత్తర దిక్కున వెలిగించాలి.

వ్యాపారంలో మెలుకువలకి కారకుడు కూడ బుధుడే. వ్యాపారానికి కావలసినది వాక్శుద్ధి. అవతలి వ్యక్తులు మనోభావాలకు తగినట్టుగా చెప్పగలిగే సామర్ధ్యాన్ని బుధుడు కల్పిస్తాడు. ప్రతి విషయాన్ని అంచనా వేయగలిగే సామర్ధ్యాన్ని కూడ బుధుడు కల్పిస్తాడు. ఇలాంటి అంశాలలో లోపాలు ఉంటే బుధగ్రహ దోషంగా భావించి వ్యాపార స్ధలంలో కుబేర దీపాన్ని వెలిగించాలి. జ్యోతిష్యం, రచనా, లలిత కళల యందు రాణించాలన్న, మాట్లాడే ఉద్యోగాలలో రాణించాలన్న, వేద పాడిత్యం, క్రీడలలో రాణించాలన్న వారికి బుధగ్రహ అనుగ్రహం కలిగి ఉండాలి. 
 
కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని కూడా ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకను పచ్చ కర్పూరంతోనే చేస్తారు. అంజనం వేయటానికి కూడ పచ్చ కర్పూరాన్ని ఉపయోగిస్తారు. పచ్చ కర్పూర తిలకాన్ని తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి రోజు పెడతారు.

పచ్చ కర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదిటికి పెట్టుకొంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పటికి ఉంటుందని, పచ్చ కర్పూరం కుంకుం పువ్వు కలిపి డబ్బుపెట్టలో పెడితే ఎక్కువ ధన లాభం కలుగుతుందని, వ్యావారులు ప్రతి రోజు పచ్చ కర్పూరాన్ని కుంకుమను నుదిటికి పెట్టుకుంటే ఆ రోజు ఎక్కువ వ్యాపారం జరుగుతుందని,పచ్చ కర్పూరాన్ని తీపి పదార్దాలకు కలిపి దేవునుకి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే ఇంట శుభకార్యాలు త్వరగా జరుగుతాయని, పచ్చ కర్పూరం తో హోమం చేస్తే వశీకరణ శక్తులు వస్తాయని, పచ్చ కర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే గౌరవం దక్కుతుందని, పిల్లలు లేని వారు పాలకు పచ్చ కర్పూరాన్ని జోడించి మంగళవారం శ్రీ సుబ్రమణ్య స్వామికి అబిషేకం చేసి ఆ పాలను త్రాగుతూ వుంటే అన్ని రకాల గర్భ దోషాలు నివారణ అయి సంతానం కలుగుతుందని, పచ్చ కర్పూరాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే అన్ని పనులు త్వరగా నెరవేరి గౌరవం పెరుగుతుంది అని ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్న పచ్చ కర్పూరాన్ని కుబేర దీపంలో వెలిగించటం ఎంతో మంచిది.

బుధగ్రహ దోష నివారణకు, వ్యాపారాభివృద్ధికి  కుబేర దీపాన్ని వెలిగించాలి. పంచ లోహాలతో చేయబడిన కుబేర దీపం క్రింది భాగంలో చిన్న కాపర్ బౌల్ ఉండి దానిలోపల దీపపు వత్తి పెట్టటానికి ఒక కాపర్ తో చేయబడిన స్ప్రింగ్ ఉంటుంది. ఈ కాపర్ బౌల్ లో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి.  సూర్యాస్తమయములందు ఆవు నెయ్యితో వెలిగించి దానిపైన ఉన్న బౌల్ లో‘పచ్చ కర్పూరం’ వేసి ఉంచిన కర్పూరం వేడికి కరిగి ఇంటి మొత్తం ఒక విధమైన శక్తి ఆవహిస్తుంది. అదే కుబేర శక్తి. “ఓం మహా రాజాయ విద్మహే ధనాధ్యక్షాయ ధీమహి తన్నో కుబేరఃప్రచోదయాత్” అనే మంత్రంతో కుబేరుడిని ఆవాహనం చేసుకున్న తరువాత మన మనస్సులో కోరికలు చెప్పుకుంటే తొందరగా తీరుతాయి. చేతిలో ధనం వృధా కాదు. ఎప్పుడు డబ్బుకు కొరత ఉండదు. అప్పులు తొందరగా తీరును.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...