22, జనవరి 2016, శుక్రవారం

జాతకచక్రంలో పరిశీలించవలసిన అంశాలు


కోణాదిపతులు (1,5,9) శుభులు.కేంద్రాదిపతులు నైసర్గిక అశుభగ్రహాలు అయితే శుభపలితాన్ని, నైసర్గిక శుభగ్రహాలు అయితే అశుభ ఫలితాన్ని ఇస్తాయి.
 
దృష్టి, స్ధితి, యుతి సంబందత్రయాన్ని ఆధారంగా చేసుకొని ఫలితాన్ని చెప్పాలి. జాతకచక్రంలో పరివర్తన, వర్గోత్తమం గాని ఉండటం గమనించాలి. కేంద్ర, కోణాదిపతుల పరివర్తనే అసలైన పరివర్తన. పరివర్తన ఒకే గ్రహ తత్వంలో జరిగితే మంచిది. ఉదా:- రవి, కుజ అగ్నితత్వం, చంద్ర, శుక్ర స్త్రీతత్వం.
 
దశా నాధుడు, అంతర్ధశానాధుడు ద్విద్వాదశాలు, షష్టాష్టకాలలో ఉంటే చెడు జరుగుతుంది. గ్రహం పుష్టోదయ, ఉభయోదయ, శీర్షోదయ రాసులలో ఉంటే వరుసగా అంత్యలో, మద్యలో, ఆదిలో ఫలితాలను ఇస్తాయి.


ద్వితీయ, సప్తమ స్ధానాలను మారక స్ధానాలు అంటారు. వాటి అధిపతులు పాపులు. కాని సహచర్యం వలన శుభ అశుభ ఫలితాలను ఇస్తాయి. 6,8,12 అధిపతులు ఏ స్ధానంలో ఉంటే ఆ స్ధానంలోనే దోష ఫలితాలను ఇస్తాయి.
 
లగ్నాధిపతి 6,8.12 స్ధానాలకు అధిపతి కూడా అయినప్పుడు వాటి దోషం తగ్గుతుంది.

శుభగ్రహాలు వక్రిస్తే శుభాన్ని, పాపగ్రహాలు వక్రిస్తే పాపాన్ని కలిగిస్తాయి.గురువు ఏ స్ధానంలో వక్రిస్తే ఆ స్ధాన ఫలితాలను ఇస్తాయి. మిగతా గ్రహాలు వక్రిస్తే వెనుక రాశి ఫలితాలను ఇస్తాయి.



శని రాజయోగ ప్రదుడైనను శుక్రుని దశా భుక్తిలో రాజునైనా బిక్షవానిగా చేస్తుంది.

అదికారం చూపించేవారికి దశమస్ధానం, ప్రేమ, ఆప్యాయత చూపించే వారికి చతుర్ధ స్ధానం చూడాలి.

దిక్, స్ధాన, కాల, చేష్టా బలములను నాలుగు బలములూ లేని గ్రహం దుర్భలము కలది అగును.

చరలగ్నాలకు లాభాదిపతి బాధకుడు(మారకుడు) అవుతాడు. స్దిర లగ్నాలకు నవమాధిపతి బాధకుడు అవుతాడు. ద్విస్వభావ లగ్నాలకు సప్తమాధిపతి బాధకుడు అవుతాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...