3, సెప్టెంబర్ 2015, గురువారం

అగ్ని,భూతత్వ,వాయు,జలతత్వ రాశులుఅగ్ని,భూతత్వ,వాయు,జలతత్వ రాశులు

మేషం,సింహం,దనస్సు రాశులు అగ్నితత్వ రాశులు.
వృషభం,కన్య,మకర రాశులు భూతత్వ రాశులు.
మిధునం,తుల,కుంభం వాయుతత్వ రాశులు.
కర్కాటకం,వృశ్చికం,మీనం జలతత్వ రాశులు.

అగ్నితత్వ రాశులు :-అగ్నితత్వ రాశులవారు ఉష్ణ తత్వం కలిగి కోప స్వభావాలు కలిగిఉంటారు.న్యాయకత్వం,దైర్యసాహసాలు,శత్రువులపైన విజయాలు.ఆరాటం ,పోరాటం కలిగి ఉంటారు.ఇతరులను ఆకర్షించుట.,ఇతరులను తమ అడుగు జాడలలో నడిపించుట.ఇతరులు పొగిడినచో పొంగిపోయి ఆపదలు కొని తెచ్చుకుందురు.ఎక్కువ మంది అధికారులు గాని,నాయకులు గాని,సైన్యాధిపతులు గాని అగ్నితత్వ రాశుల యందు లగ్నం గాని,చంద్రుడు గాని,సూర్యుడు గాని ఉండగా జన్మింతురు.


భూతత్వరాశులు:-భూతత్వ రాసుల వారు మంచి దృడమైన శరీరం కలిగి ఉంటారు.మంచి భోజన ప్రియులు.కూడబెట్టుట,ఏదైనా పనిని ప్రారంభించేముందు లాభ నష్టములను బేరీజు వేసుకొని ప్రవర్తించెదరు.వ్యక్తిగత విషయాలయందు,ఊహా జగత్తులయందు విహరించుట.బౌతిక విషయాల యందు,జీవనం నందు విశ్వాసం ఉండును.ఏదైనా పనిని ప్రారంభించిన వదిలిపెట్టారు.

వాయుతత్వ రాశులు:- వాయుతత్వ రాశుల వారు ఆలోచనలమీద,ప్రణాళికల మీద,పధకములు వేయుటయందు గడుపుదురు.తెలివితేటలు,సామర్ధ్యం, పై విశ్వాసం ఎక్కువ.సాంఘిక కార్యక్రమములయందు కొత్త ఫధకాలు తయారు చేయుట,అనేకమందిని (స్నేహితులను,అధికారులను)కలుపుకొనిపోవుట.కొత్త విషయాలు తెలుసుకొనుట ,కొత్త ప్రదేశాలు దర్శించుట వీరి అభిరుచులు.కష్టించి పనిచేయటం కష్టం.మానవజాతికి ఉపకరించు ఏ కార్యక్రమమైన వీరు చేపడతారు.నిస్వార్ధత,మానవ శ్రేయస్సు వీరి యందుండు లక్షణాలు.

జలతత్వం రాశులు :-జలతత్వ రాశుల వారు ఆవేశపరులు,చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందటం,కష్ట సుఖాలు,సంపదలను గూర్చి ఎక్కువగా ఊహించుకోవటం.బార్యా పిల్లలతో ఎక్కువ బందం ఉండును.పరిసరాలకు ఆనుగుణంగా   లోబడి ప్రవర్తిస్తారు.చంచలమైన స్వభావం కలిగి ఉంటారు.భావనా శక్తి,కల్పనాశక్తి ఎక్కువ.ఎక్కువగా గేయరచనలు చేయువారు ఈ తత్వానికి చెందినవారు అవుతారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...