2, జూన్ 2015, మంగళవారం

కుజగ్రహ దోష నివారణకు లాల్ కితాబ్ రెమిడీస్



లాల్ కితాబ్ కుండలి ప్రకారం లో కుజుడు బలంగా ఉన్న యెడల వీరత్వము,పోటీతత్వం,దూకుడుతనం,సాహసము మరియు పరాక్రమము ఇచ్చును. బలహీనంగా వుండిన బందు మిత్రులతోను,జీవిత బాగస్వామితోనూ సమస్యలు ఏర్పడును. వివాదములు ఏర్పడగలవు.అప్పుల భాదలు,శతృభాదలు,ప్రమాదాలు కలుగుచుండును.కుజుడు బలహీనంగా వుండిన ఎడల బలమైనదిగా చేయుటకు ఉపాయములను చేయవలనని లాల్ కితాబ్ లో చెప్పబడ్డది. లాల్ కితాబ్ లో ప్రతి ఒక్క బావమునకు శాంతులు(Remedy) చెప్పబడి వున్నది.

ప్రధమ భావములో కుజుడు (Mars in 1st house) కుజుడు ప్రధమ ఇంట(house) బలహీనంగా(debilitated) ఉన్న ఎడల దానిని బలమైనదిగా చేయుటకు వ్యక్తి వారి కోపమును అదుపులో పెట్టుకొన వలసి వుండును. వ్యక్తి వారి యొక్క వాణిపై నియంత్రణము కలిగి వుండవలెను. ఎప్పుడూ ఎవరితోను కోపంగా మాట్లాడరాదు. కుజుని యొక్క శుభత యొక్క ఫలితములను పొందుటకు మట్టి కుండలిలో (వెడల్పపైన మూతిగల కుండ) సోఫ్ ను వేసి ఎవరి తిరుగని ప్రదేశములో మట్టిలో పాతి పెట్టవలెను.

శివలింగాన్ని పూజించాలి.
రెండవ బావములో కుజుడు (Mars in 2nd house) లాల్ కితాబ్ చెప్పిన విధముగా కుజుడు రెండవ ఇంట(Combust) ) బలహీనంగా వుండిన ఎడల దానిని బలమైనదిగా చేయుటకు సోదరులతో మధుర సంబందములను కలిగి వుండవలెను. అవసర సమయములలో సోదరులకు సహాయము చేయవలెను. వెనుక నుండి ఎవరిని చెడు మాటలు మాట్లాడ వద్దు. మీ వ్యవహారము మరియు కార్యములలో దృడతను తీసుకురావలెను. జనసేవ మరియు ప్రజలకు బోజనములు పెట్టుట వలన కుజుడు మంచి ఫలితములను ఇచ్చును.
మూడవ బావములో కుజుడు (Mars in 3rd house) మూడవ ఇంట(3rd house) బలహీనంగా వుండిన ఎడల కుజుని మంద ప్రభావమును దూరము చేయుటకు ఏనుగు దంతముతో చేసిన కంణము లేదా ఏనుగు వెంట్రుక చేసిన  మరే ఇతర వస్తువునైనా ఇంటిలో వుంచవలెను. ఆడంబరమునకు దూరముగా వుండవలెను మరియు అనవసర ఖర్చులను చేయరాదు. మీలో ఆత్మ విశ్వాసమును పెంపొందించుకొన వలెను మరియు మీ గుణములు మరియు మీ క్షమతను ప్రయోగించుకొన వలెను.
నాల్గవ బావములో కుజుడు (Mars in 4th house) కుజుడు నాల్గవ ఇంట మందముగా వుండిన ఎడల దీని యొక్క శుభత కొరకు మట్టి పాత్రలో తేనెను నింపి దానిని పాతిపెట్టవలెను. ఇంటి ద్వారమును దక్షిణ దిశలో వుంచరాదు. 400 గ్రాముల రేవడిని నదిలో ప్రవాహితము చేయవలెను. పక్షులకు తీపి పదార్ధములను పెట్టవలెను. కుజుని యొక్క శుభత కొరకు హనుమంతునికి సిందూరముతో పూజించవలెను. కుజుడు నాల్గవ స్ధానంలో బలహీనంగా ఉన్నప్పుడు ఇంటిలో వాస్తు దోషాలు,నరదృష్టి భాదలు,వాహన ప్రమాదాలు పీడిస్తున్నప్పుడు సముద్రంలో అడుగు భాగంలో లభించే ఇంద్రజాల్ మొక్కని దక్షిణ దిక్కున ఉంచాలి.
పంచమ బావములో కుజుడు (Mars in 5th house) పంచమ బావములో వున్న కుజుని బలమైనదిగా చేయుటకు రాత్రి పడుకునే ముందు తలవైపు ఏదైనా ఒక ఎర్ర మట్టి పాత్రలో నీటిని పెట్టుకొని పడుకొనవలెను. ఉదయము ఆ నీటిని ఎవరూ త్రొక్కని చోట పారవేయవలెను. యది కుజుడు ఈ భావములో బలమైనదిగా వున్న ఆ స్థానమును దృడపరచుటకు సౌందర్యము మరియు బోగ విలాములు లేకుండా వుండవలెను. ఏ వ్యక్తి యొక్క కుండలిలో ఈ స్థితి వున్నదో ఆ వ్యక్తి వారి కర్తవ్యములపై పూర్తి శ్రద్దకలిగి వుండవలెను.
షష్టమ బావములో కుజుడు (Mars in 6th house) లాల్ కితాబ్ కు ప్రకారము ఎవరి కుండలిలో అయితే ఆరవ ఇంట కుజుడు శుభకరముగా వుండునో వారు కుజుని యొక్క శుభకరతను పెంపొందించుతకు కన్యలకు బోజనము పెట్టవలెను. కుజుడు బలహీన స్థితిలో వుండిన ఎడల సంతానము కలిగినప్పుడు తీపి పదార్ధములకు బదులుగా ఉప్పటి పదార్ధములు ఇతరులకు పంచి పెట్టవలెను. సోదరులకు సమయమునకు తగ్గట్టు సహాయము చేయవలెను.


ఏడవ బావములో కుజుడు (Mars in 7th house) కుండలిలో ఏవ బావములో కుజుని బలహీన ప్రభావమును దూరము చేయుటకు కొమ్ములు లేని గోవును పూజించువలెను. బోజనము చేయుటకు ముందు దాని నుండి ఒక బాగమును గోవు కొరకు తీసి పెట్టవలెను. కుజుని యొక్క చెడు ప్రభావము నుండి బయట పడుటకు మద్య మాంసాదులను వదులుకొనవలెను. ఎవరి వద్ద నుండి కూడా ఉచితముగా వస్తువులు తీసుకొనరాదు.
అష్టమ బావములో కుజుడు (Mars in 8th house) ఎవరి కుండలిలో అయితే కుజుడు అష్టమ బావములో వున్నాడో వారు కుజుని యొక్క శుభత కొరకు (auspiciousness of Mars) సాయంకాల వేలలో చపాతీలను చేసే ముందు చపాతీలు చేసే రాయిపై నీటిని చిలక వలెను. ఇంటిలో తందూరీ పొయ్యి లేదా బట్టీని పెట్టరాదు. అన్యతా కుజుని యొక్క అశుభ ఫలితములు మరింత అశుభ కరముగా మారును. కుజుడు విదవ స్త్రీ యొక్క ఆశీర్వాదములను తీసుకొనుట వలన మంచి ఫలితములను ఇచ్చును. 40 నుండి 43 రోజుల పాటు కుక్కలకు తీపి రొట్టేలను పెట్టుట వలన శుభకారిగా కాగలడు.
నవమ బావములో కుజుడు (Mars in 9th house) కుండలిలో తొమ్మిదవ ఇంట వున్న కుజుని శుభ ఫలితములను పొందుటకు ధర్మ గ్రంధములను చదవవలెను.వృద్దులను, శ్రేయస్సు కోరేవారిని గౌరవించవలెను. సోదరులతో స్నేహ పూరితమైన సంబందములను వుంచుకొన వలెను. ఏ కార్యమును చేపట్టదలచినా సోదరులతో సలహాలను తీసుకొనవలెను.

దశమ బావములో కుజుడు (Mars in 10th house) కుజుని యొక్క ఉపస్థితి యది దశమ బావములో వుండిన ఎడల కుజుని యొక్క శుభ ప్రభావముల వృద్ది కొరకు లేడికి ఆహారము పెట్టవలెను. నలుపు మరియు కంటిచూపు సరిగా లేని వారికి సేవ చేయవలెను. అసామాజిక కార్యకలాపములను చేపట్టరాదు. హనుమంతునికి సిందూరమును అర్పించుట వలన మరియు పుత్రహేనులైన వ్యక్తికి సేవచేయుట వలన కూడా కుజుని యొక్క శుభత ప్రాప్తించగలదు.
ఏకాదశ బావములో కుజుడు (Mars in 11th house) కుండలిలో ఏకాదశ బావములో కుజుడు అశుభ ప్రబావము(negative impact)ను తొలగించుటకు మరియు శుభ స్థితిని పెంచుటకు ఇంటిలో కుక్కను పెంచవలెను. ఏ వ్యక్తి యొక్క కుండలిలో ఏకాదశ బావములో కుజుడు వున్నాడో వారు ఎల్లప్పుడూ వారితో రక్త చందనమును వుంచుకొనవలెను.

ద్వాదశ బావములో కుజుడు (Mars in 12th house) జన్మ కుండలిలో ద్వాదశ ఇంట(12th house)లో కుజుడు అశుభ స్థితిలో వుండిన ఎడల జలములో పంచదారను కలిపి సూర్యునికి అర్పించవలెను. జలములో తేనెను కలిపి ప్రజలను పంచవలెను. తమ్మునికి పాలు త్రాగించవలెను. యది కుజుడు శుభ స్థితిలో వుండిన వారి శుభ స్థితిని ఇంకా మెరుగు పరుచుటకు మీ వద్ద ఎల్లప్పుడూ వెండితో చేసిన బియ్యపు గింజను వుంచుకొనవలెను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...