1, సెప్టెంబర్ 2013, ఆదివారం

బాఘవా మిర్రర్((Pa Kua Mirror)

వీదిపోట్లు స్తంభ,చాయ వేధ దోష నివారణకు "భాఘవా మిర్రర్"


బాఘవా మిర్రర్ 
(ఫాకువా మిర్రర్)
            
            బాఘవా మిర్రర్ (ఫాకువా మిర్రర్) ఒక చెక్కని ఎనిమిది కోణాలు ఉండేవిధంగా కట్ చేయబడి ఉంటుంది.మద్యలో కుంభాకారం కలిగిన అద్దం ఉంటుంది. ఈ అద్దం చుట్టు లోపలి భాగంలో ఎరుపు రంగులో ఉంటుంది.
            ఎరుపు రంగు పైన పసుపు రంగు గాని,బంగారపు రంగు కలిగిన గీతాలు ఉంటాయి.చెక్కకు ఎనిమిది కోణాలు కలిగిన మూలలో గ్రీన్ కలర్ లైన్ ఉంటుంది.కొన్ని ఫాకువా మిర్రర్ మధ్యలో కుంభాకార అద్దం లేదా ప్లాటుగా ఉండే అద్దాలు అమర్చబడి ఉంటాయి.దీనిపైన గోడకు తగిలిచ్చుకోవటానికి వీలుగా ఒక కొక్కెం అమర్చబడి ఉంటుంది.
వాస్తు శాస్త్రంలో వీధి పోట్లకు అధిక ప్రాముఖ్యత ఉన్నది. విధిని మార్చే శక్తి వీధిపోట్లకు ఉన్నది అనేది అక్షర సత్యం. ఈ వీధిపోట్లలో మంచివి, చెడు వీధి పోట్లు కూడా ఉన్నాయి. కొన్ని మంచి వీధి పోట్లు వున్న ఇంటికి వాస్తు దోషాలు ఉన్నా చాలా గొప్పగా రాణించగల స్థితిలో ఉంటారు.

స్థలానికి గానీ, ఇంటికి గానీ ఎదురుగా, సరాసరి ఇంటిలోకి వచ్చే వీధి ఉంటే ఆ ఇంటికి ‘వీధి పోటు’ ఉంటుంది. కొన్ని వీధిపోట్లు ఆడవారి మీద ప్రభావం చూపుతాయి. మరి కొన్ని వీధి పోట్లు మగవారి మీద ప్రభావం చూపుతాయి.


తూర్పు ఈశాన్య వీధి పోటు ప్రభావం ఇంటిలో నివసించే పురుషులపైన, ఇంటి మగ సంతతిపైన ప్రభావం చూపుతుంది. ఇంట్లో వున్నా, బయట ఉన్నా తమదే పైచేయిగా ఉంటుంది. ఎక్కడైనా సరే తామే ఆధిపత్యం చెలాయిస్తారు. కోరినా కోరకున్నా పదవులు, అధికారాలు తమను వరిస్తుంటాయి. తప్పనిసరై ఇంకొకరి కింద పని చేస్తున్నా, పై అధికారుల మనసును గెలుచుకొని తమ మాటే పై మాటగా నెగ్గుకు రాగలరు. పేరుకు పై అధికారులు కానీ, వీరిదే అధికారం అంతా అన్నట్లు ఉంటుంది. తమ మాటలు పనితనంలో పైవారి మెప్పును పొందగలుగుతారు. సమయానుకూలంగా నిర్ణయం తీసుకొనే ఓర్పు, నేర్పు, చాకచక్యం కలిగి ఉంటారు. ఇతరులచే నమ్మకస్తులుగా పరిగణింపబడతారు.


తూర్పు ఈశాన్య వీధి పోట్ల వలన కొన్నిసార్లు ఈశాన్యం తెగిపోవడం కానీ, తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయవ్యం పెరగడం గానీ జరుగుతుంది. ఈ విధంగా ఉన్న ఇంటిలో నివసించేవారు ఈశాన్య వీధి పోట్ల వలన ఆర్థికంగానూ, పేరు ప్రతిష్ఠలలో గొప్పగా ఉంటారు కానీ సంతాన విషయంలోనూ, యజమానురాలి విషయంలోనూ విచారించాల్సి ఉంటుంది. ఇటువంటి ఇంటిలో మగ సంతతి లేకపోవడమో, అసలు సంతతి లేక దత్తు రావడమో, ఇల్లరికపు అల్లుళ్లు రావడమో జరుగుతుంది. ఇటువంటి గృహాలను ప్రత్యక్షంగా చూసి గానీ వీధి పోటు ఫలితం చెడుదా? మంచిదా? చెడు ఫలితం ఉంటే ఏ విధంగా మంచి ఫలితం వచ్చేటట్లు చేయవచ్చునో చూసి గానీ చెప్పడానికి సాధ్యం కాదు.


గృహం కానీ, గృహ ఆవరణ కానీ, రోడ్డుకన్నా తక్కువ ఎత్తులో ఉంటే ఆ గృహానికి మంచి వీధి పోట్లు వలన కలిగే మంచిని ఎక్కువగా పొందడానికి అవకాశం ఉండదు.


              భాఘవా మిర్రర్ ని ఇళ్ళు లేదా ఆఫీసు లేదా వ్యాపారసంస్ధలలో ప్రధాన సింహద్వారానికి పైన అమర్చాలి.
              ఇళ్ళు లేదా ఆఫీసు లేదా వ్యాపారసంస్ధలకు వీది పోటు ఉన్న తప్పకుండా భాఘవామిర్రర్ సింహాద్వారానికి పైన ఉంచాలి.నరదృష్టి ఉన్న తొలిగిపోతుంది.
            దేవాలయాల యొక్క నీడ పడుతున్న భాఘవా మిర్రర్ ని సింహాద్వారానికి పైన ఆ దేవాలయం యొక్క ప్రతిబింబం ఆ అద్దంలో పడే విధంగా ఉంచాలి.
                    విద్యుత్ స్తంభాలు ఇంటి ఎదురుగా ఉన్న ఆ ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది.ఈ నెగిటివ్ ఎనర్జీ పోవటానికి తప్పనిసరిగా భాఘవా మిర్రర్ ఉంచాలి.
             ఇళ్ళు లేదా ఆఫీసు లేదా వ్యాపారసంస్ధలకు ఎదురుగా హాస్పటల్స్ గాని ఎత్తైన ప్రాకారాలు గాని ఉంటే తప్పనిసరిగా భాఘవా మిర్రర్ ఉంచాలి.
              ఎత్తైన చెట్లు లేదా ఎత్తైన కొండలు ఇళ్ళు లేదా ఆఫీసు లేదా వ్యాపారసంస్ధలకు ఎదురుగా ఉన్న భాఘవా మిర్రర్ ఉంచాలి.


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...