19, జూన్ 2012, మంగళవారం

ఓంకార ధ్వని గంట(OM BELL)

ఓంకార ధ్వని గంట
                ఓంకార ధ్వని గంట పూర్తిగా కంచుతో చేయబడి ఉంటుంది. ఓంకార ధ్వని గంట మూడు విభాగాలుగా ఉంటుంది.గంట ఉన్న భాగం పూర్తిగా కంచు తో చేయబడి ఉంటుంది.గంట పైభాగాన ఇత్తడితో చేయబడి ఉంటుంది.గంట అంచు అడుగు భాగాన్ని చేతితో తిప్పటానికి చిన్న కర్ర ఉంటాయి.

ఉపయోగించే విధానం:-
                 ఓంకార ధ్వని గంటని ప్రతి రోజు ఉదయాన్నే స్నానం చేసిన తరువాత సూర్యోదయ సూర్యాస్తమయాలలోను ఉపయోగిస్తారు.గంట పైభాగాన్ని చేతితో పట్టుకొని కింద అంచు భాగాన్ని చిన్న కర్రతో తిప్పాలి.గంటని తిప్పేటప్పుడు పైన చేతితో పట్టుకుంటానికి వీలున్న ఇత్తడితో చేసిన భాగాన్ని మాత్రమే చేతితో పట్టుకోవాలి.గంటకు ఉన్న కంచుభాగానికి చేయి తగలకూడదు.అట్లు తగిలినచో ద్వని సరిగా వినిపించదు.గంట అడుగు అంచు భాగాన్ని కర్రతో తిప్పేటప్పుడు గంట పైభాగాన్ని గట్టిగా పట్టుకొనీ కింద అంచు భాగాన్ని కర్రతో పూర్తిగా వృత్తాకారంగా చిన్న చిన్నగా వేగం పెంచుతూ తిప్పుతూ పోవాలి. ఈ విధంగా తిప్పుతూ పోయిన కొద్ది ధ్వనిలో శభ్ద తీవ్రత ఎక్కువై "ఓంకారం" స్పష్టంగా వినపడుతుంది.
ఉపయోగాలు:-
              ఓంకార ధ్వని గంటని ప్రతిరోజు ఉపయోగించవచ్చును.
"ఓంకార శభ్దం" రోజు వినడం వలన మనలో ఆధ్యాత్మికత చేకూరుతుంది.
"ఓంకార శభ్దం" మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
"ఓంకార శభ్దం" మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు పూర్తిగా తొలిగించి పాజిటివ్ ఆలోచనల్ని కలిగిస్తాయి.
"ఓంకార శభ్దం" మనకు కలిగిన సమస్యాపరిష్కారానికి తగిన మార్గనిర్ధేశాన్ని కలిగిస్తుంది.
"ఓంకార శభ్దం" ఇంటిలో నరదృష్టి ప్రభావాల్ని తొలగిస్తుంది.
"ఓంకార శభ్దం" ఇంటిలో అందరి మధ్య అన్యోన్యతలని,అప్యాయతలని కలిగిస్తుంది.
"ఓంకార శభ్దం" షాపులో గాని ఆపీసులో గాని ఉపయోగించటం వలన ధనాభివృధ్ధి,జనాకర్షణ,గౌరవాలు,కీర్తిప్రతిష్టలు,కమ్యూనికేషన్,సహాయసహాకారాలు అందులో వున్న ప్రతి వ్యక్తికి కలుగుతాయి.
"ఓంకార శభ్దం"వలన ముఖ్యంగా శివానుగ్రహాం కలుగుతుంది.  


           

1 కామెంట్‌:

అఖండ దైవిక వస్తువులు Price List

జాతకచక్రం

Related Posts Plugin for WordPress, Blogger...